జీవనశైలి వ్యాధులు నియంత్రించడమెలా?

డా. యం. అఖిల మిత్ర,  ప్రకృతి వైద్యులు, బుద్ధా నేచర్ క్యూర్ సెంటర్

మారుతున్న జీవన శైలి అనేక రుగ్మతలకు దారి తీస్తోంది. బీపీ, హైపర్ టెన్షన్, డయాబెటిస్, కార్డియోవాస్కులర్ లాంటి అనేక రోగాల బారిన పడుతున్నారు. ఏ ఒక్కరికీ కూడా తాము ఫలానా వ్యాధితో  మూలంగా బాధపడుతున్నామని,  కంఠం మీద వచ్చేదాకా తెలియదు.  మితాహారం, కాలానుగుణ ఆహారం ఆరోగ్యానికి కీలకం. అసంక్రమిత వ్యాధుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది, దీనిని నివారించడానికి ఏమాత్రం ఖర్చు కాకుండా మన ఆరోగ్యాన్ని పదిలంగా ఉండే మార్గం ప్రకృతి వైద్యం ద్వారా నయం చేసుకోవచ్చు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే అత్యాశే అవుతుంది.  కష్టతరమైన పనులు చేసేవారు, రైతులు, కూలీలు, హెవీ మోటార్ డ్రైవర్లు, మేస్త్రి కార్మికులు, హమాలీలు  శరీర కష్టం చేసే వారు  ప్రత్యేకంగా వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఎవరి పనులు వారు చేసుకుంటే వ్యాయామం చేసే అవసరం తగ్గుతుంది.

రోజువారి పనులు నడక, సైకిల్‌ ద్వారా చేసుకుంటే సహజంగానే వ్యాయామం లభిస్తుంది. ఏ వ్యాయామం అయినా క్రమం తప్పకుండా చేయాలి. మీకు ఆనందానిచ్చే వ్యాయామాన్ని ఎన్నుకోండి. వ్యాయామానికి వయసుతో నిమిత్తం లేదు. దీర్ఘకాలిక వ్యాధులు కలవారు, 40 ఏళ్లు దాటిన వారు కొత్తగా వ్యాయామం మొదలు పెట్టాలంటే డాక్టరు సలహా తీసుకోవాలి. ఏ వ్యాయామమైనా ఒక్కటే నియమం,  శక్తికి మించి వ్యాయామం చేయకూడదు. మిట్ట మధ్యాహ్నం ఎండ లో వ్యాయామం చేయకుంటే మంచిది. నిత్య జీవితంలో రోజూ చేసే పనులు శారీరక శ్రమకు లింక్‌ చేయడం మంచిది. లిఫ్ట్‌కు బదులు మెట్లుyogaఉపయోగించాలి. టైము ముఖ్యం కానీ సమయాల్లో దగ్గర పనులకు నడిచి వెళ్లాలి.  శరీర దృఢత్వానికి ఫిట్నెస్ సెంటర్లు, జిమ్, హెల్త్ క్లబ్స్ కు వెళ్లడం చూస్తున్నాము.  ఒబెసిటీ, బీపీ, మధుమేహ నియంత్రణకు  వ్యాయామం ఎంతో అవసరం.  అలాగే మనం ఇంట్లో కూర్చొని  యోగ వ్యాయామం పైసా ఖర్చులేకుండా చేసుకోవచ్చు.  యోగా  అందరికీ తెలిసిన విషయమే, తక్కువ సమయంలో ప్రతి ఒక్కరూ చేయాల్సిన ఆసనాలు చాల ఉన్నాయి. యోగాసనాల గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. అవి  శరీరానికీ, మెదడుకీ ఎంత మంచిదో అందరికీ తెలిసిన సంగతే.  తక్కువ సమయంలో  చేయగలిగే యోగాసనాలు  ఉన్నాయి. ఇది చేయడానికి యోగా మ్యాట్ తప్ప ఇంకేమీ అక్కర్లేదు. ఇవన్నీ బిగినర్స్ ఫ్రెండ్లీ యోగాసనాలు. ఇది మన  ఫ్లెక్సిబిలిటీ, బాలెన్స్, స్ట్రెంత్ ను పెంచుతాయి. అందువల్ల మన  ఎనర్జీ లెవల్స్ కూడా బాగుంటాయి.

ప్రకృతి వైద్యంలో  మంచి నీరు ప్రాణాధారం
విరేచనాల వల్ల మన శరీరం ఎక్కువ నీరు కోల్పోయినప్పుడు ధారాళంగా నీటిని తాగాలి. జ్వరంతో ఉన్న జబ్బులు ఆశించినప్పుడు ఎక్కువ ద్రవాన్ని తాగడం వల్ల త్వరితగతిన ఉపశమనం లభిస్తుంది. విపరీతమైన జ్వరం లేదా వడదెబ్బ తగిలినప్పుడు శరీరాన్ని చల్లటి నీటితో స్నానం చెయ్యడం లేదా తడిగుడ్డతో ఒళ్ళంతా శుభ్రపరచడం మంచిది. ఉప్పు వేసిన నీటిని రోజంతా ఎక్కువ సార్లు తాగాలి. స్త్రీల లో తరచుగా కనిపించే మూత్ర సంబంధమైన అంటురోగాల ఎక్కువగా ద్రవాలను తాగడం ద్వారా నయం అవుతాయి. అంటురోగాల తీవ్రతను బట్టి వైద్యనిపుణుల సలహాలు చికిత్స అవసరపడతాయి. దగ్గు, ఉబ్బసం, రొమ్ము పడిశం, న్యూమోనియా, కోరింతదగ్గు వచ్చినట్లయితే ఎక్కువనీటిని తాగడం, కఫం తగ్గడానికి వేడినీటి ఆవిరిపట్టడం చాలా మంచిది. పగుళ్ళు, పుళ్ళు, చర్మ సంబంధమైన వ్యాధులు, మొటిమలు వచ్చినప్పుడు సబ్బుతో బాగా రుద్ది గోరువెచ్చని నీటితో శుభ్రపరచడం మంచిది.  మంచినీరు తాగడం వలన  యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, అల్సర్, కిడ్నీ, కాలేయం సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు .

ఈవిధంగా ఉదయం, మధ్యా హ్నం, సాయంత్రం చేస్తూండటం వల్ల వ్యాధులు త్వరితగతిన నయమవు తాయి. చీముపట్టిన గాయాలు, గడ్డలు, సగ్గెడ్డలు వచ్చినపుడు వేడినీటితో కాపడం పెట్టడం మంచిది. కీళ్ళు, కండరాలు నొప్పులు, బెణుకులు వంటివి వస్తే కూడా వేడినీటితో కాపడం బెట్టడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. దురద, మంట, రసికారే దద్దుర్లు ఉన్నప్పుడు చల్లటినీటితో కాపడం పెట్టడం మంచిది. తీవ్రంగా కాలిన గాయాలు అయినప్పుడు నీళ్ళతో శుభ్రం చేయకూడదు. అల్పమైన కాలిన గాయాలు అయిన సందర్భాలలో చల్లని నీటిలో ఉంచడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.గొంతునొప్పి, టాన్సిల్స్‌కు చీముపట్టడం వంటి సందర్భాలలో గోరువెచ్చటి ఉప్పునీటితో పుక్కిలించడం శ్రేయస్కరం. ఆమ్లము, దుమ్ము లేక ఇతర మండే పదార్థాలు కళ్ళల్లో పడటం వంటి సందర్భాల్లో వెంటనే చన్నీళ్ళతో కంటిని కడగటం మంచిది. ముక్కు దిబ్బడ చేసినప్పుడు ఉప్పు నీటి ఆవిరి పీల్చడం వల్ల దిబ్బడ తగ్గుతుంది. మలబద్ధకం, విరేచనాలు గట్టిగా అవుతున్నప్పుడు నీటిని ధారాళంగా తాగాలి.మొల్లలు, ఆసనం లేదా మలద్వారం వద్ద పుండ్లు ఏర్పడినప్పుడు ఒక తొట్టిలో గోరువెచ్చని నీరు పోసి, అందులో చిటికెడు పొటాషియం పరమాంగనేట్‌ వేసి అందులో ఆసనం అనేలా కూర్చోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. వ్యాధులు త్వరితగతిన నయమవుతాయి. ఏది ఏమైనప్పటికీ వ్యాధి లక్షణాలనూ, వ్యాధి తీవ్రత ఎప్పటి కప్పుడు వైద్య నిపుణుల ద్వారా పరీక్షలు చేయించుకుంటూ వారి సలహా మేరకు చికిత్స పొందడం ఉత్తమం.

Leave a Reply