Suryaa.co.in

Andhra Pradesh

ఉచిత గ్యాస్ కు అనూహ్య స్పందన..

– రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో అత్యధికంగా గుంటూరు 99,365 మంది నమోదు

విజయవాడ: దీపం పథకం క్రింద అర్హత కలిగిన పేద కుటుంబాలకు ప్రతి సంవత్సరం మూడు ఉచిత సిలిండర్లు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 2 న శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించారు.

అర్హత కలిగిన పేద కుటుంబాలు ఆధార్, తెల్ల రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఈ నెల 29 ఉదయం 10 గంటల నుంచి ఫ్రీ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు అని ప్రభుత్వం తెలిపింది.. ఆ విధంగా బుక్ చేసుకున్న బుకింగ్ కన్ఫర్మ్ అయ్యాక పట్టణాల్లో 24 గంటలు, గ్రామాల్లో 48 గంటల్లో సిలిండర్ సరఫరా అవుతుంది.

సిలిండర్ డెలివరీ అయ్యాక 48 గంటల్లోపు డబ్బు లబ్ధిదారుల అకౌంట్లలోకి డబ్బులు జమవుతాయి.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయిల్‌ కంపెనీలకు రూ.894 కోట్లు అందిస్తామని.. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల ఈ పథకానికి రాయితీ రూపంలో ఏడాదికి రూ.2,684 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నెల 29న ఆయిల్‌ కంపెనీలకు చెక్కు కూడా అందించడం జరిగింది.

ఇప్పటి వరకు మూడు కంపెనీలకు లబ్ధిదారులు బుకింగ్స్ చేసుకోవడం జరిగింది. అందులో హిందూస్థాన్ పెట్రోలియం కంపెనీ (HPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOL), భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) లు ఉన్నాయి.

ఇప్పటి వరకు మూడు కంపెనీల ద్వారా మొత్తం ఉచిత గ్యాస్ కోసం బుక్ అయిన కనెక్షన్లు 16,82,646 బుక్ అయినట్టు ఆయా కంపెనీలు తెలియజేశాయి.. దీనికి సంబంధించి సబ్సిడీ మొత్తం రూ. 16,97,93,928.99 అందించినట్లు తెలిపారు. అందులో ఇప్పటి వరకు 6,46,350 కనెక్షన్లకు ఉచిత సిలెండర్లను లబ్ధిదారులకు డెలివరీ చేసినట్లు ఆ కంపెనీలు తెలియజేశారు.. దీనికి సంబంధించిన సబ్సిడీని రూ. 2,14,437 లను లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటికే జమ చేయడం జరిగింది.

ఇప్పటి వరకు అత్యధికంగా హెచ్ పీసీఎల్ కంపెనీలో 7,23,483 మంది నమోదు చేసుకున్నారు. అదేవిధంగా ఐవోసీఎల్ 6,22,759, బీపీసీఎల్ 3,36,404 మంది ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం లబ్ధిదారులు నమోదు చేసుకున్నట్లు ఆ కంపెనీలు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో అత్యధికంగా గుంటూరు 99,365 మంది నమోదు చేసుకున్నారు. ఉచిత సిలిండర్ల కోసం నమోదు చేసుకున్నారు. ఉచిత గ్యాస్ కు సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే లబ్ధిదారులు చేయవలసిన టోల్ ఫ్రీ నంబర్ 1967..

LEAVE A RESPONSE