జగన్ రెడ్డి లాంటి కటింగ్, ఫిటింగ్ ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు

2

-జగన్ రెడ్డి చేతిలో రెడ్డి సామాజికవర్గం కూడా బాధిత వర్గమే
-మీ బాధలు పోవాలంటే బాబు రావాల్సిందే
-సొంత బాబాయ్ ని చంపిన వాడు ఈ రాష్ట్ర ప్రజలను గౌరవిస్తాడా?
-కిషోర్ అన్నను అసెంబ్లీకి పంపండి
-పీలేరు నియోజకవర్గం, కలికిరి ఇందిరా నగర్ సమీపంలోని యువగళం క్యాంపు సైటులో వైసీపీ నుండి టీడీపీలోకి భారీగా చేరికలు
-నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అధ్వర్యంలో టిడిపి లో చేరిన వైసిపి నాయకుడు కలికిరి సర్పంచ్ ఆర్ ప్రతాప్ రెడ్డి. మహాల్ మాజీ సర్పంచ్ వై. సతీష్ రెడ్డి.ఎనుగొండపాలెం మాజీ ఎంపిటిసి
ఏ. శ్రీనివాసుల నాయుడు. పలువురు ముస్లిం నాయకులు
-వీరితో పాటు టిడిపి లో చేరిన 1500 వైసిపి కుటుంబాలు
-పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన లోకేష్

యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ…
పీలేరు ప్రజలు నాపై చూపుతున్న ప్రేమను నేను ఎన్నడూ మర్చిపోలేను.కలికిరి మండలానికి వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. గతంలో ఎంతో మంది సీఎంలను మనం చూశాం..కానీ జగన్ రెడ్డి లాంటి కటింగ్, ఫిటింగ్ ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు.ఇతను సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశాడు. రాష్ట్ర చరిత్రలో 100 సంక్షేమ పథకాలు రద్దు చేసిన వ్యక్తి జగన్ రెడ్డి మాత్రమే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అక్రమ కేసులు, సీఐడీ కేసులతో వేధిస్తున్నారు. నాపై 2019 వరకు ఒక్క కేసు కూడా లేదు. జగన్ రెడ్డి వచ్చాక నాపై 20కేసులు పెట్టారు. ఎక్కడా తగ్గేదే లే.పోలీసులు వేలాదిగా నా పాదయాత్రలో కనిపిస్తున్నారు.

నేను టెర్రరిస్టును కాదు…వారియర్ ని.. యువత గళాన్ని వినిపించేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు నేను మీ ముందుకు వచ్చాను.యువకుల సమస్యలపై పోరాడుతున్న నన్ను జీఓ 1తో అడ్డుకుంటున్నారు. నా సౌండ్ వెహికల్, మైక్, చివరకు స్టూల్ కూడా లాక్కుంటున్నారు. నా గొంతును ఎలా నొక్కాలో తాడేపల్లి ప్యాలెస్ లో స్కెచ్ వేసి, పోలీసులతో అమలు చేయిస్తున్నారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక వైసీపీలో పనిచేసిన వారికి ఏమైనా న్యాయం జరిగిందా? కనీస గౌరవం ఇస్తున్నారా? ప్రతాప్ రెడ్డి అన్నని నేను అడిగాను. వైసీపీలో ఎలా గౌరవించారో తెలుసుకున్నా. నల్లారి కుటుంబంతో 40 సంవత్సరాలు పోరాడి ఇటు ఎందుకు వచ్చారని నేను అడిగితే వైసీపీలో నాకు గౌరవం లేదని వాపోయాడు.

జగన్ రెడ్డి చేతిలో రెడ్డి సామాజికవర్గం కూడా బాధిత వర్గమే.నేనే కాదు…జగన్ రెడ్డి చేతిలో ప్రతి వర్గం బాధిత వర్గమే…చివరకు పోలీసులు కూడా జగన్ రెడ్డి చేతిలో బాధితులుగా మారిపోయారు. మహిళలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని జగన్ రెడ్డి అమలు చేయలేదు. అమ్మఒడి ప్రతి విద్యార్థికి ఇస్తానని మోసం చేశాడు. సంపూర్ణ మద్యపానం నిషేధం హామీని గాలికొదిలేశాడు. యువతకు నిరుద్యోగ సమస్యలపై ఇచ్చిన ప్రతి హామీని విస్మరించాడు. జాబ్ క్యాలెండర్, పోలీసు పోస్టుల భర్తీ, మెగా డీఎస్సీ ప్రతి హామీని జగన్ రెడ్డి గాలికొదిలేశాడు.రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. డ్రిప్ ఇరిగేషన్, ఇన్ పుట్ సబ్సిడీ, పంట బీమా లేదు.కార్మికులకు జీవితా బీమా లేదు. ఉపాధి లేదు. ఇసుక అందుబాటులో లేదు. ఉంటే అత్యధిక రేటు.రోజుకు రూ.3కోట్ల ఇసుకపై సంపాదించందే పెద్దిరెడ్డి నిద్రపోవడం లేదు.పోలీసులకు సరెండర్లు మూడు పెండింగ్. 20 టీఏలు బకాయి పెట్టాడు. మెడికల్ బిల్స్ కూడా రీయింబర్స్ చేయడం లేదు.

అధికారంలోకి వచ్చాక వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని నమ్మించి జగన్ రెడ్డి ఉద్యోగులతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక వారిపై అక్రమ కేసులు పెడుతున్నాడు. ఈ రాష్ట్రాన్ని పాపాల పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేసి సామాన్యుల నడ్డి విరుస్తున్నాడు. మీ బాధలు పోవాలంటే బాబు రావాల్సిందేసొంత బాబాయ్ ని చంపిన వాడు ఈ రాష్ట్ర ప్రజలను గౌరవిస్తాడా? మీరంతా ఆలోచించాలి.వివేకానందరెడ్డిని చంపేసి ఆ నేరాన్ని చంద్రబాబుపై జగన్ రెడ్డి తోసేశాడు. అబద్దాలు చెప్పడం, నేరాలు చేసి వాటిని వేరొకరికి ఆపాదించడంలో జగన్ రెడ్డి దిట్ట. కలికిరి సర్పంచ్ ఆర్ ప్రతాప్ రెడ్డి, మహాల్ మాజీ సర్పంచ్ వై. సతీష్ రెడ్డి, ఎనుగొండపాలెం మాజీ ఎంపిటిసి ఏ శ్రీనివాసుల నాయుడు లోకేష్ సమక్షంలో టీడీపీ చేరారు. వీరితో పాటు 1500 వైసిపి కుటుంబాలు టీడీపీలో చేరాయి. చాలా సంతోషం.వీళ్ల చేరికతో తెలుగుదేశం పార్టీ జెండా కలికిరిలో రెపరెపలాడుతుందనే నమ్మకం కలిగింది. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయం అనిపిస్తోంది.

ఈ నియోజకవర్గానికి కిషోర్ కుమార్ రెడ్డి చేసిన ఖర్చులో ఒక్క శాతం డబ్బులు కూడా వైసీపీ ఎమ్మెల్యే చింతల ఖర్చు పెట్టలేదు.వైసీపీ నాయకుల ఫ్లెక్సీలు భారీ ఎత్తున పెట్టారు. వాటిలో పెద్దిరెడ్డి, చింతల బావమరిది, మిథున్ రెడ్డి ఫోటోలు భారీ ఎత్తున పెట్టుకున్నారు. అసలు వీళ్లంతా మీకు ఏం ఒరగబెట్టారని ఫ్లెక్సీలు పెట్టుకున్నారు? మీరు నిలదీయండి. 2024 ఎన్నికల్లో మళ్లీ కోడికత్తి కమల్ హాసన్ కొత్త స్క్రిప్టుతో మీ ముందుకు వస్తాడు. ఎవరూ నమ్మొద్దు.మీ బాధలు పోవాలంటే, మహిళలకు నిత్యావసరాలు తగ్గాలంటే, యువతకు ఉద్యోగాలు రావాలంటే, రైతుకు గిట్టుబాటు ధర రావాలంటే, కార్మికులకు చేతినిండా పనిదొరకాలంటే బాబు రావాలి…సైకో పోవాలి. పోలీసుల కష్టాలు పోవాలన్నా బాబు రావాల్సిందే. కిషోర్ కుమార్ రెడ్డి మీకు అండగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. మీరంతా ఏకమై వచ్చే ఎన్నికల్లో పీలేరులో టీడీపీ దుమ్ముదులపండి. కిషోర్ అన్నను అసెంబ్లీకి పంపండి. మీకు కావాల్సిన పనుల గురించి నాకు వదిలేయండి. పీలేరు ప్రజలంతా ఏకమై టీడీపీ విజయానికి ముందుకు రావాలని కోరుతున్నా

ఈ సందర్భంగా పీలేరు ఇన్ చార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…
ఉదయ్ కుమార్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి వైసీపీకి సేవ చేసినా వైసీపీ నాయకులు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి చాలా అవమానించారు.వీళ్ల ఆత్మాభిమానంపై దెబ్బకొట్టారు. వీళ్ల ఆత్మగౌరవానికి మన పార్టీ పెద్దపీఠ వేస్తుందనే నమ్మకంతో మన పార్టీలో చేరుతున్నారు. చాలా సంతోషం. వీళ్ల చేరికతో మన పార్టీని మరింత బలోపేతం చేసుకోవడం చాలా ఆనందదాయకం. వైసీపీ నాయకులకే ఈ నియోజకవర్గంలో భద్రత, గౌరవం లేదు.పీలేరు నియోజకవర్గంలో వైసీపీకి మద్దతు పలికిన ప్రతి ఒక్కరూ అభద్రతా భావంలో బ్రతుకుతున్నారు. వీళ్లందరికీ మేము అండగా ఉంటాం… మన పార్టీని గెలిపించుకుంటాం.

కలికిరి సర్పంచ్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ… నేను, నల్లారి కిషోర్ అన్న కలిశాం…ఇక వార్ వన్ సైడే…కలికిరి గ్రామంలో టీడీపీ జెండా ఎగరేస్తాం…పీలేరు నియోజకవర్గంలో కిషోర్ అన్నని బంపర్ మెజారిటీతో గెలిపిస్తాం. వైసీపీలో అడుగడుగునా అవమానాలు అడ్డుకున్నాం. ఇప్పటి వరకు నా సొంత డబ్బులు రూ.5 కోట్లు వైసీపీ బలోపేతానికి ఖర్చుపెట్టా.. కానీ పెద్దిరెడ్డి, ఇక్కడి ఎమ్మెల్యే, ఎంపీ మిథున్ రెడ్డి నన్ను కనీసం లెక్కచేయలేదు. హీనంగా చూశారు. నా ఆత్మగౌరవంపై దెబ్బకొట్టారు. నేను ఏ పదవీ ఆశించి టీడీపీలోకి రాలేదు.కిషోర్ కుమార్ రెడ్డి గెలుపే నా లక్ష్యం.మా కష్టాలు, కన్నీళ్లు, అభివృద్ధి పనులన్నీ లోకేష్ అన్న, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాళ్లే చూసుకుంటారనే నమ్మకం ఉంది. 2019లో కలికిరి పంచాయతీలో ఏ ఒక్కరూ వైసీపీని, జగన్ రెడ్డిని చూసి ఓట్లు వేయలేదు. కేవలం నన్ను చూసి ఓట్లు వేశారు.నేను ఈ గ్రామంలో ఏ ఒక్కరికీ వ్యతిరేకిని కాను. ఒకవేళ గతంలో ఎవరినైనా ఇబ్బందిపెట్టి ఉంటే ప్రతి ఒక్కరూ నన్ను క్షమించండి. పీలేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తిరుగుతా…వైసీపీ అక్రమాలను ఎండగడతా. పీలేరులో టీడీపీ జెండాను ఎగరేసి చంద్రన్నకు కానుకగా ఇస్తాం.