– మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సనత్ నగర్: నియోజకవర్గ ప్రజలకు ఏ అవసరమొచ్చినా అన్ని వేళలా అందుబాటులో ఉంటానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 6.10 లక్షల రూపాయల విలువై చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక సమస్యల కారణంగా అనేకమంది మెరుగైన వైద్యం పొందలేకపోతున్నారన్నారు. అలాంటి వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరమన్నారు.అత్యవసర వైద్యం అవసరమైన వారికి కూడా ఎల్ఓసీల ద్వారా ఆర్థిక సహాయం మంజూరు చేయించినట్లు వివరించారు. అదేవిధంగా ప్రజలకు లబ్ధిచేకూర్చే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నిత్యం ప్రజల మధ్యలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. నియోజకవర్గ కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన అనేక సమస్యలను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కరించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, హన్మంతరావు, ఆకుల హరికృష్ణ, వెంకటేషన్ రాజు, నాయకులు అశోక్ యాదవ్, శ్రీహరి, కిషోర్, కూతురు నర్సింహ, లక్ష్మీపతి, ప్రేమ్ కుమార్, ఆరీఫ్,బలరాం, ఉత్తమ్ కుమార్ సింగ్, హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.