Suryaa.co.in

Andhra Pradesh

ఆదర్శ ప్రజా ప్రతినిధి అన్నందేవుల చంటి

– పురందేశ్వరి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశంస

రాజమండ్రి: పర్యావరణ పరిరక్షణకి స్వయంగా కృషి చేస్తూ తాను పాలించే ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న మాధవ రాయుడుపాలెం గ్రామ సర్పంచ్ అన్నందేవుల చంటి అందరికీ ఆదర్శమని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.

ఇటీవల అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జీవవైవిద్య పురస్కారం అందుకున్న చంటిని మంగళవారం ఆయన నివాసంలో ఎంపీ, ఎమ్మెల్యే అభినందిస్తూ ఘనంగా ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం, పక్షుల సంరక్షణ రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటడం, ఇంకుడు గుంటలు తీయడం వంటి జీవవైవిద్య కార్యక్రమాలను వారు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కడియం ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్, జిల్లా అడ్మిన్ ఎస్పీ మురళీకృష్ణ, తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు పాటంశెట్టి రవి, పుల్లా రామారావు, వెలుగుబంటి వెంకటాచలం, గట్టి సుబ్బారావు, గట్టి నరసయ్య, ఆకుల శ్రీధర్, సూరపరెడ్డి జానకిరామ్, బొరుసు సుబ్రమణ్యం, నాగిరెడ్డి రామకృష్ణ, ఆదిమూలం సాయిబాబా, పత్తిపాటి రామారావు చౌదరి ,వివిధ శాఖల అధికారులు, ఓంశాంతి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE