Suryaa.co.in

Telangana

అదానీ మోడీ మనిషి ఐతే.. ప్రతిమ శ్రీనివాస్ కేసీఆర్ బినామీ

-అదానీ మోడీ మనిషి ఐతే.. ప్రతిమ శ్రీనివాస్ కేసీఆర్ బినామీ రూపంలో నైని సంస్థల్లోకి ఎంట్రీ కాబోతున్నారు
– కేసీఆర్.. ఆదానిపై ఏం మాట్లాడుతావ్?
– కేసీఆర్, ఐఏఎస్ శ్రీధర్ అక్రమాలకు పాల్పడుతున్నారు
– నైని కోల్ మైన్ 25 ఏళ్లు ప్రైవేట్ సంస్థకు లీజ్ ఇచ్చారు
– రాఫెల్ 35 వేల కోట్లు ఐతే.. ఇది 50 వేల కోట్ల కుంభకోణం
– ఇప్పుడు నైని కోల్ మైన్ ఎట్లా ఆదానికి కట్టబెడుతున్నావ్?
– రేవంత్ రెడ్డి, ఎం.పీ టీపీసీసీ అధ్యక్షులు

సీఎం కేసీఆర్ ఈ మధ్య కేంద్రంపై, బిజెపిపై యుద్ధం ప్రకటించా.. రాఫెల్ నుండి మొదలుకుంటే కేంద్రమంత్రుల అవినీతి అక్రమాల ఆధారాలు నా వున్నాయ్ అన్నారు. ఉప ఎన్నికల సమయంలో, మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన బిజెపి జాతీయ నేతలు కేసీఆర్ అవినీతిపై మాట్లాడిండ్రు.త్వరలోనే కేసీఆర్ కుటుంబం జైల్లో ఉంటది అన్నారు.వీరిద్దరూ ఒకరిపై మరొకరు ఆరోపించుకున్నారు.టీఆర్ఎస్, బిజెపిల మధ్య విభేదాలున్నాయి అని జనాలకు చెప్పేలా చేశారు. కేసీఆర్ నిన్న ముంబై పర్యటన ఓ డ్రామా. ఉప్పు, నిప్పులా ఉన్నట్లు చూపించే పని చేశారు.

సింగరేణి సంస్థ లో 51 శాతం రాష్ట్ర వాటా, 49 శాతం కేంద్రం వాటా వుంది. 50 వేల మంది గని కార్మికులకు ఉద్యోగులకు అండగా ఉంటుంది సింగరేణి సంస్థ. కరెంట్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది.సింగరేణి గనులను ప్రైవేట్ సంస్థలకు కేంద్రం అమ్మడానికి ముందుకొస్తే.. రాష్ట్ర సర్కార్ అడ్డుకోడానికి ముందుకు రాలే. అత్యంత నాణ్యమైన బొగ్గు మన వద్ద ఉంది. సాంకేతిక అవసరం లేకుండా బొగ్గు తీయవచ్చు.

సింగరేణి 25 ఏళ్ళు లీజ్ ఇవ్వడానికి కేసీఆర్ తన అధికారాన్ని వినియోగించి ప్రైవేట్ పరం చేసే కుట్ర చేశారు. ఒరిస్సా లోని నైనా బొగ్గు గనిని లీజ్ ఇవ్వడం జరిగింది. ఐఏఎస్ శ్రీధర్ .. సింగరేణి సంస్థకు సీఎండి గా వున్నారు. నిబంధనలకు విరుద్దంగా శ్రీధర్ కొనసాగుతున్నారు. 7 ఏళ్లుగా ఛైర్మెన్, సీఎండీ గా కొనసాగుతున్నారు. వేలాది కోట్ల రూపాయల అవినీతికి జరుగుతుంది. కేసీఆర్, ఐఏఎస్ శ్రీధర్ అక్రమాలకు పాల్పడుతున్నారు.

ఎంతో మంది ఐఏఎస్ లున్నా నిబంధనలకు విరుద్ధంగా శ్రీధర్ కొనసాగడం ఏంటీ?శ్రీధర్ పై ఎన్నో ఆరోపణలు వచ్చిన కేసీఆర్ తొలగించలేదు. కోల్ ఇండియా కూడా వద్దని చెప్పిన కేసీఆర్ వినలేదు. ఒరిస్సా లోని నైని కోల్ మైన్ 25 ఏళ్లు ప్రైవేట్ సంస్థకు

లీజ్ ఇచ్చారు. దీని ద్వారా 3 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వొచ్చు. కోల్ ఇండియా నిబంధనలను కాలరాసి ఒకరిద్దరి వ్యక్తులకు లబ్ది చేకూరే పని చేసిండు.

టెండర్ ఎవరికీ రాకుండా చేసే కుట్ర. రాఫెల్ కుంభకోణం కంటే పెద్దది. రాఫెల్ 35 వేల కోట్లు ఐతే.. ఇది 50 వేల కోట్ల కుంభకోణం. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి దీనిపై కేంద్రానికి ప్రధానికి, హోమ్ , విజిలెన్స్ , కోల్ మినిస్టర్, కోల్ సెక్రెటరీ వరకు ఫిర్యాదు చేశాం. Dopt కి శ్రీధర్ పై ఫిర్యాదు చేశాం.

ఇంత పెద్ద టెండర్ ని ఎవరికీ దక్కకుండా చేస్తున్నారు. టేలర్ మేడ్ కండిషన్ పై ముగ్గురి టెండర్లు వేసేలా చేశారు. కేంద్ర మైనింగ్ మినిస్టర్ ప్రహ్లద్ జోషి కూడా ఏమి చేయలేమని చెప్పారు. పీఎంవో కార్యాలయం చూస్తుందని చెప్పారు. సెంట్రల్ విజిలెన్సు కమిషన్ కు రిఫర్ చేయండి అన్నా.. ప్రహల్లాద్ చేతులెత్తేశారు.టెండర్ బాక్స్ ఓపెన్ చేస్తే.. ఇద్దరి ముగ్గురికే లాభం చేకూరుతుంది. ఐఏఎస్ అధికారి శ్రీధర్ కు ఫోన్ చేసి తప్పు చేస్తున్నావ్ అని చెప్పిన.. ఆయన నిస్సహాయకత వ్యక్తం చేశారు.

అదానీకి టెండర్ దక్కితే.. ఆయన ఎవరికైనా ఆర్ధిక పెట్టుబడి దారికి అవకాశం కల్పించవచ్చు అదానీ మోడీ మనిషి ఐతే.. ప్రతిమ శ్రీనివాస్ కేసీఆర్ బినామీ రూపంలో నైని సంస్థల్లోకి ఎంట్రీ కాబోతున్నారు. సౌర విద్యుత్ కొనాలని మోడీ అంటుండు అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు నైని కోల్ మైన్ ఎట్లా అదానీ కి కట్టబెడుతున్నావ్?

మొత్తం భూగర్భ గనులను కేసీఆర్ కుటుంబం దోచుకునే పని చేస్తుంది. మోడీ, అమిత్ షా ఎందుకు కేసీఆర్ అవినీతిపై ముందుకు రావడం లేదు. వెస్ట్ బెంగాల్ లో డిజిపి పై చర్య తీసుకున్న కేంద్రం.. శ్రీధర్ పై ఎందుకు చర్యలు చేపట్టడం లేదు.
శ్రీధర్ పై తీవ్ర ఆర్ధిక ఆరోపణలు వున్నా ఎందుకు బిజెపి నాయకులు మాట్లాడ్డం లేదు?

మొన్నటి వరకు మోడీ కేసీఆర్ కలిసి దోచుకుంటే.. ఇవ్వాలా విడిపోయి దోచుకునే కుట్ర జరుగుతోంది. పారదర్శకంగా టెండర్లు పిలవడానికి కేంద్రం ముందుకొస్తుందా? ఆదానిపై కేసీఆర్ ఏం మాట్లాడుతావ్సు పారీ గ్యాంగ్ లీడర్ కేసీఆర్. బీజేపీ ని ఎదురు లేని శక్తిగా మారడానికి కాంగ్రెస్ పార్టీ అనుబంధ పార్టీలను కలుస్తున్నారు కేసీఆర్.
మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధిపై, ఇరిగేషన్ ప్రాజెక్టుల పై మాట్లాడుకున్నాం అని శరద్ పవర్, సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఎంపీ సుప్రియ సురే.. నిన్నటి కలయికను వివరిస్తూ ట్వీట్ చేశారు.

కానీ కేసీఆర్ అండ్ కల్వకుంట్ల కుటుంబ సభ్యులు.. వేరే రకంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు కూడా కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడలేదు. కేసీఆర్.. చీటర్, లయర్ అండ్ లూటర్. కేసీఆర్.. జగన్, కేజ్రీవాల్, ఇతర నేతలను ఎందుకు కలవడం లేదు.
బొగ్గు తవ్వకాల్లో డీజిల్ కొనుగోలులో సీఎస్ఆర్ నిధుల వినియోగం పై విచారణ చేపట్టాలి. అప్పుడే సింగరేణి శ్రీధర్ అవినీతి బయటపడుతుంది.

LEAVE A RESPONSE