రాష్ట్రంలో మూడు జిల్లాలలో విశ్వకర్మ యోజన పధకం ప్రయోగాత్మకంగా అమలు
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
విజయవాడ…. కళాకారులను ప్రోత్సహించి వారి ఉత్పత్తులను మార్కెటింగ్ కల్పించడం ద్వారా నిరుద్యోగాన్ని రూపు మాప వచ్చు అందుకే మన ప్రధాన మంత్రి విశ్వకర్మయోజన పధకం ప్రవేశపెట్టారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వివరించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పిఎం విశ్వకర్మయోజన రాష్ట్ర స్ధాయి సమావేశంలో పురందేశ్వరి ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు.
చేతి వృత్తిల వారికి ఈ పధకం ద్వారా ప్రధాని నరేంద్రమోడీ 13 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారని ఈ బడ్జెట్ ద్వారా 30 లక్షల కుటుంబాలకు పేదరికం నుండి విముక్తి కలుగుతుందన్నారు.అగ్గిపెట్టిలో మడిచి పెట్టిన ఆరుడగుల పట్టు చీర తయారు చేసిన కళ మనసొంతం అన్నారు. ఇదీ మన తరతరాల మేథోసంపత్తి.. డిఎన్ ఎ రూపంలో , నేటి తరంలోనూ మనల్ని అంటిపెట్టుకుని ఉన్న కళా వైభవం..ఈ కళలను ప్రోత్సహిస్తే… నిరుద్యోగం సమసిపోతుందని ప్రధానమంత్రి ఈ పధకం ప్రవేశపెట్టారన్నారు.
కుటీర పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమలు…… ఇంటింట, ప్రతి ఇంటా,సాధికారిత జీవితం సులువు అవుతుందన్నారు.ఈ దేశ జనాభాలో 52 శాతం చేతి వృత్తులు వారే … వారి జీవితాలు మెరుగు పడితే దేశం బాగుపడుతుందని ఈ పధకం లక్ష్యం అన్నారు.
ఆలోచనలతో 2023 ఆగస్టు 15న ప్రధాని తన మనసులోని మాటను బయటకు చెప్పారని ప్రస్తావించారు.ఈ 13 వేల కోట్ల రూపాయలు దశల వారీగా విడుదల చేస్తారు.పిఎం విశ్వకర్మ యోజన పేరిట అమలు కానున్న ఈ పధకం తొలిదశలో లబ్ది పొందనున్న ఆంధ్రప్రదేశ్ లోని 3 జిల్లాలు
1. నెల్లూరు, 2. తిరుపతి, 3. పశ్చిమ గోదావరి జిల్లా లు ఉన్నాయన్నారు
మొదటి దశ మొత్తం 254 జిల్లాలలోఅమలు అవుతోంది. ఈ 18 చేతి వృత్తులలో అర్హులైన వారు సి.ఎస్. సి కేంద్రాల ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఇలా నమోదు అయిన వారిలో అర్హుల ఎంపిక జరుగుతుందన్నారు వారిలోని ప్రతిభకు మరింత మెరుగులు దిద్దడానికి అయిదు నుండి 15 రోజుల వరకు ఉచిత శిక్షణ ఇవ్వడమే కాక ప్రతి రోజు ఒక్కోక్కరికి 500 రూపాయలు ఖర్చుల నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది.
ప్రతి ఒక్కరికి వారి వృత్తి పరమైన 15 వేల రూపాయల విలువైన టూల్ కిట్టు, ఆ టూల్ కిట్టు ఉపయోగించు విధానాన్ని వివరించే బ్రోచర్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది.ప్రధాని నరేంద్ర మోడీ సత్ సంకల్పాన్ని పల్లెలకు , గల్లీలకు కూడా చేర్చాలి ఊపిరి పీల్చే ప్రతి వ్యక్తికి ఏదో ఒక కళలో ప్రావీణ్యం ఉంటుంది.
వారికి మన ప్రధాని సందేశం చేరేలా చూడాల్సిన బాద్యత మనందరి పైనా ఉందని పురందేశ్వరి ఉధ్గాటించారు. ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిఖిల్ ఆనంద్, జాతీయ కార్యదర్శి డాక్టర్ పార్ధసారధి, ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపీ శ్రీనివాస్, ఆర్టిజన్ సెల్ రాష్ట్ర కన్వీనర్ బంగారు బాబు తదితరులు ఈ సమావేశంలో మాట్లాడారు.