Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి వాలంటీర్ల సభలో టీడీపీకి ఇచ్చింది వార్నింగ్ అయితే.. మేం ఇచ్చేది కూడా వార్నింగే

• బాబు ష్యూరిటీ : భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో టీడీపీ అధినేత ప్రకటించిన పథకాలకు ప్రజలు మద్ధతు తెలపడానికి కారణం..జగన్ రెడ్డి, అతని ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత
• 95 లక్షల కుటుంబాలు త్వరలో జరిగే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమికి ఓటేసి, జగన్ ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాయి
• చేతులు మడతపెట్టాలనే వ్యాఖ్యల ద్వారా భయపెట్టేలా మాట్లాడిన జగన్ మాటలు భవిష్యత్ లో ఎన్నికలు హింసాత్మకంగా మారబోతున్నాయి అనడానికి నిదర్శనాలు
– మాజీ శాసనసభ్యులు కూన రవికు మార్

దేశంలో గతంలో ఏ పార్టీ, ప్రభుత్వం ప్రకటించని విధంగా టీడీపీఅధినేత చంద్రబాబు నాయుడు ‘బాబు ష్యూరిటీ : భవిష్యత్ కు గ్యారెంటీ’ పేరుతో రాష్ట్ర ప్రజలకు గొప్పభరోసా కల్పించారని, దానిలో భాగంగా త్వరలో ఏర్పడబోయే టీడీపీ-జనసేన ప్రభుత్వం అందించే పథకాలు పొందడానికి రిజిస్ట్రేషన్ పొందిన 95 లక్షల కుటుంబాలకు టీడీపీసీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు కూన రవికు మార్ పాత్రికేయుల సాక్షిగా అభినందనలు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే …

దేశంలో ఇప్పటివరకు ఏ రాజకీయపార్టీ చంద్రబాబులా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించలేదు. గతంలో ఆయన పేదలకు అమలుచేసిన సంక్షేమ పథ కాలు, భవిష్యత్ లో అందిస్తానని చెబుతున్న సంక్షేమ పథకాలే అందుకు నిదర్శనం.

జగన్ రెడ్డి పాదయాత్రలో 627 హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక కేవలం 15శాతం మాత్రమే అమలుచేసి ప్రజల్ని వంచించాడు
ప్రతిపక్షనేతగా, పాదయాత్ర సమయంలో జగన్ రెడ్డి అనేక హామీలిచ్చాడు. ఒక్క పాదయాత్రలోనే 627 హామీలిచ్చాడు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన హామీల్లో 15శాతం మాత్రమే అమలుచేసి, 85శాతం హామీలకు మంగళం పాడాడ డు. మోసకారీ, నేరపూరిత స్వభావం ఉన్న జగన్ రెడ్డి లాంటి వ్యక్తి ఉత్తుత్తి హామీలతో ఎలా వంచించాడో ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. ఈనాడు తెలుగుదే శం నాయకులు, కార్యకర్తలు ‘బాబు ష్యూరిటీ : భవిష్యత్ కు గ్యారెంటీ’ కార్యక్రమం లో భాగంగా ఇంటింటికీ వెళ్లినప్పుడు జగన్ రెడ్డి తమను వంచించాడని ప్రజలే చెప్పారు.

జగన్ ప్రభుత్వం సంక్షేమం ముసుగులో ఈతకాయ చేతిలో పెట్టి, తమ నుంచి గుమ్మడి కాయ కొట్టేశాడని చెప్పుకొని బావురుమన్నారు. ఈ ప్రభుత్వం ఎలా దోచుకుంటుందో కూడా ప్రజలు స్వచ్ఛందంగా తెలియచేస్తున్నారు. ప్రజలు టీడీపీ శ్రేణులతో చెప్పింది విన్నాక, వారి బాధలు చూశాకే వారికోసం చంద్రబాబు కొత్త పథకాలు ప్రకటించారు.

95 లక్షల కుటుంబాలు ఎన్నికల్లో టీడీపీకి ఓటేసి, జగన్ ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాయి
95 లక్షల కుటుంబాలు జగన్ రెడ్డి అరాచక పాలనతో విసిగిపోయి టీడీపీ పథకాల ను అదరిస్తున్నాయి. ఆ కుటుంబాలన్నీ త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమిని గెలిపించి, జగన్ రెడ్డిని రాష్ట్రం తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. జగన్ రెడ్డిని, అతని ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపుదామా అని 95లక్షల కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.

పెరిగిన ధరలు…వివిధ ఛార్జీలు.. పన్నుల పెంపుతో జగన్ రెడ్డి ప్రజల్ని దారుణంగా దోచేశాడు
జగన్ ప్రభుత్వంలో ప్రజల ఆదాయం తగ్గింది.. ఖర్చులు పెరిగిపోయాయి. అన్ని ధరలు విపరీతంగా పెరిగాయి. వాటికి తోడు జగన్ రెడ్డి వేస్తున్న పిచ్చిపిచ్చి పన్నులతో ప్రజలు సర్వం కోల్పోతున్నారు. అమ్మఒడి పేరుతో తల్లుల్ని వంచిం చిన జగన్ రెడ్డి, రూ.15వేలు ఇస్తాననిచెప్పి, రూ.13వేలు మాత్రమే చెల్లిస్తున్నా డు.

కేంద్రప్రభుత్వం ఇచ్చే సొమ్ము తో సంబంధం లేకుండా ప్రతి రైతుకి ఏటా రూ.12,500 లు ఇస్తానని చెప్పిన జగన్ రెడ్డి చివరకు రైతులసంఖ్యలో కోతపెట్టి, ఇస్తానన్న సొమ్ముని కూడా రూ.6,500లకే పరిమితం చేశాడు. ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ముకూడా ఇవ్వకుండా తలాతోకా లేని నిబంధనలతో ఉన్నత విద్యను అభ్యసించే యువతను వంచించాడు.

మద్యాన్ని నిషేధిస్తాననిచెప్పి మహిళల్ని వంచించాడు. నాడు-నేడు పేరు చెప్పి దోచుకొని, చివరకు 4లక్షల మంది విద్యా ర్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు పోయేలా చేశాడు. ఇలా ఇచ్చిన హామీలు ఏవీ అమలుచేయకుండా, చేసిన వాటికి కోతలు పెట్టాడు. చంద్రబాబునాయుడు 2014-19 మధ్యన పుట్టిన బిడ్డ నుంచి కాటికిపోయే ముదుసలి వరకు అనేక సంక్షేమపథకాలు అందిస్తే, వాటన్నింటినీ జగన్ రెడ్డి రద్దుచేశాడు. చివరకు ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్..డీజిల్ ధరలు పెంచి ప్రజల్ని దారుణంగా దోచుకుంటున్నాడు. చివరకు గ్రామాల్లో కనీస మౌలిక సదు పాయాలు కూడా కల్పించకుండా ప్రజల్ని రోగాలపాలు చేస్తున్నాడు.

 ప్రజలు మరలా నిజమైన సుఖసంతోషాలు పొందాలంటే చంద్రబాబు ప్రకటించిన సూపర్ -6 తోనే సాధ్యం
ప్రజల నుంచి దండుకుంటున్న సొమ్ముని, అప్పుల సొమ్ము రూ.12 లక్షల కోట్ల ను జగన్ రెడ్డి హరతి కర్పూరంలా ఖర్చుచేస్తూ రాజభవనాల్లాంటి ప్యాలెస్ లలో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. సాక్షి మీడియాకు తప్పుడు ప్రకటనలు ఇస్తూ వేలకోట్ల ప్రజలసొమ్ముని దోచిపెడుతున్నాడు. జగన్ రెడ్డి 4 ఏళ్ల10 నెలల పాలన చూశాక పాలిచ్చేఆవుని కాదని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నామని ప్రజలకు కూడా అర్థమైంది. బాబు ష్యూరిటీ : భవిష్యత్ కు గ్యారెంటీ పథకాల్ని ప్రజలకు చేరువ చేయడంలో విజయవంతమైన టీడీపీ శ్రేణులు… ఇకపై జనసేన శ్రేణులతో కలిసి ఇరుపార్టీల కూటమి విజయం కోసం కృషి చేయాలి.

సూపర్-6 పథకాల గురించి కూడా టీడీపీ-జనసేన కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలి. సూపర్ -6 పేరుతో చంద్రబాబు ప్రకటించిన పథకాలు అన్నివర్గాల సంతోషానికి, రాష్ట్రాభి వృద్ధికి ఎంతగానో ఉపకరిస్తాయి. ప్రజలు నిజమైన సుఖసంతోషాలు పొందాలంటే చంద్రబాబు ప్రకటించిన సూపర్ -6 పథకాలతోనే సాధ్యమనే వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలి.

జగన్ రెడ్డి వాలంటీర్ల సభలో టీడీపీకి ఇచ్చింది వార్నింగ్ అయితే, మేం ఇచ్చేది కూడా వార్నింగే 
లోకేశ్ శంఖరావం సభలు జగన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఆ భయంతోనే జగన్ రెడ్డి వాలంటీర్ల సభలో పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు. జగన్. అతని పార్టీ నేతలు, కార్యకర్తలు చొక్కాలు మడతపెడితే, టీడీపీ-జనసేన శ్రేణులు కుర్చీలు మడతపెట్టి తిరగేస్తారు. జగన్ తమకు వార్నింగ్ ఇస్తే, మేం ఇచ్చేది కూడా వార్నింగే. నెలకు రూ.5వేల జీతానికి పనిచేస్తున్న వాలంటీర్ల ఎదుట చేతులు మడతపెడతామని చెప్పడం ద్వారా జగన్ రెడ్డి ఎవరిని భయపెట్టాలని చూస్తున్నాడు?

ముఖ్యమంత్రే హింసను ప్రోత్సహించేలా మాట్లాడితే ఎలా? ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవాలి. జగన్ రెడ్డి వాలంటీర్ల సభలో మాట్లాడింది విన్నాక…వచ్చేఎన్నికల్ని హింసాత్మకంగా నిర్వహించాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు అనిపించింది. కాబట్టి ముఖ్యమం త్రి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలి.

ఎన్నికల కోడ్ వస్తే ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయపార్టీలన్నీ కొన్ని నియ మాల ప్రకారం నడుచుకోవాలి. కానీ జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఉపేక్షిస్తే, భవిష్య త్ లో జరిగే పరిణామాలకు ఎన్నికల సంఘమే బాధ్యత వహించాల్సి వస్తుంది.” అని రవికుమార్ తెలిపారు.

LEAVE A RESPONSE