Suryaa.co.in

Andhra Pradesh

వేలకోట్ల విలువైన భూములు కారుచౌకగా ఇతరుల పాలవుతుంటే, ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదు?

• లేపాక్షి నాలెడ్జ్ హబ్ ముసుగులో ప్రభుత్వ, రైతులభూముల్ని కారుచౌకగా ఇందూ సంస్థకు కట్టబెట్టి నాడు రైతుల నోట్లో తండ్రి మట్టి కొడితే.. నేడు కొడుకు తాకట్టులోని భూముల్ని విడిపించి రైతులకు ఇవ్వడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు?
• 4,196 ఎకరాలు ఇందూ ప్రాజెక్ట్ సంస్థ బ్యాంకుల్లో తాకట్టుపెట్టి రూ.4వేల కోట్ల పైచిలుకు రుణం తీసుకుంటే, దానిలోకేవలం రూ.477 కోట్లు మాత్రమే చెల్లిస్తే చాలని బ్యాంకులు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది
• ఇందూ సంస్థకు నాడు రాజశేఖర్ రెడ్డి అప్పనంగా కట్టబెట్టిన భూముల్లో ప్రభుత్వ భూమి 3,032 ఎకరాలు ఉంది
• తండ్రి చేసిన అన్యాయాన్ని కొడుకు జగన్ రెడ్డి ఎందుకు సరిదిద్దే ప్రయత్నం చేయడంలేదు?
• జగన్ ప్రభుత్వమే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి, బ్యాంకులకు ఇవ్వాల్సిన సొమ్ము చెల్లించి, మొత్తం భూములు వెనక్కు తీసుకొని రైతులకు ఎందుకివ్వదు?
– టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్

లేపాక్షి భూముల దోపిడీకి సంబంధించి వెర్షన్ 2.0 మొదలైందని, నాలెడ్జ్ హబ్ ముసుగులో ఇందూ ప్రాజెక్ట్స్ కు గతంలో కేటాయించిన భూములు ఇప్పటికే అనేక చేతులు మారాయని, ఆ కోవలో 4,190 ఎకరాల ప్రభుత్వ భూమిని గ్యారెంటీగా పెట్టుకున్న బ్యాంకులు రూ.4వేలకోట్లను ఇందూసంస్థకు రుణంగా ఇవ్వగా సదరు కంపెనీ దివాళా తీసిందని, ఈ క్రమం లో బ్యాంకులు ఆస్తుల వేలానికి సిద్ధమై, రూ.4వేలకోట్లకు బదులు రూ.477కోట్లు కడితే చాలని చెప్పడం విడ్డూరాలకే విడ్డూరమని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

“ మరో వైపు 650 ఎకరాల ప్రభుత్వభూమిని గ్యారెంటీగా పెట్టుకొని, రూ.5కోట్లను ఢిల్లీకి చెందిన గ్లోబల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రిజిస్ట్రేషన్ ఖర్చుల కింద 2013లో చెల్లించింది. . సీబీఐ కేసులతో ఆనాడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోవడంతో, ఆ 650 ఎకరాలను తిరిగి తమకు ఇచ్చేయాలంటూ సదరు సంస్థ ఇప్పుడు కోరడం తో సరేననే పరిస్థితి. ఇవీ లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములకు సంబంధించి పుట్టు కొస్తున్న దోపిడీ కథలు.

ఇందూ ప్రాజెక్ట్ సంస్థ నాలెడ్జ్ హబ్ పేరుతో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు దాదాపు 15 ఏళ్ల క్రితం ప్రభుత్వ రైతుల భూమి కలిపి దాదాపు 8,844 ఎకరాలు సేకరించింది. ఆ భూముల్లోని 4,,190 ఎకరాలను ఇందూప్రాజెక్ట్ సంస్థ బ్యాంకుల్లోతాకట్టు పెట్టి రుణాలు తీసుకుంది. కేవలం రుణాలతో సరిపెట్టింది తప్ప ఇన్నేళ్లలో ఆ సంస్థ సదరు భూముల్లో ఎక్కడా ఎలాంటి పారిశ్రామిక నిర్మాణాలు చేయలేదు. బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా ఎగవేయడంతో దివాళా తీశామని చేతులెత్తేసింది. ఈ భూములకు సంబంధించిన విచారణ ఇప్పటికీ న్యాయస్థానాల్లో కొనసాగుతోంది. ఇదంతా గత చరిత్ర. ఇప్పుడు తాజాగా ఆ కోవలో 2.0 స్కామ్ మొదలైంది.

రూ.4138 కోట్ల రుణంలో కేవలం 10శాతం చెల్లిస్తే చాలని బ్యాంకులు..ఇతర ప్రైవేట్ సంస్థలు అనడం పలు అనుమానాలకు తావిస్తోంది
ఇందూ సంస్థనుంచి తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని బ్యాంకులు ఎన్.సీ.ఎల్.టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) ను ఆశ్రయించాయి. దాంతో బ్యాంకుల్లో తాకట్టుపెట్టిన భూములు వేలానికి వచ్చాయి. ఇదంతా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2019 జూన్లో జరిగింది. ఇంతజరుగుతున్నా జగన్ సర్కార్ తమకేమీ సంబంధం లేదన్నట్టు మిన్నకుండిపోయింది. ప్రభుత్వ భూముల్ని తాకట్టుపెట్టే అధికారం ఇందూసంస్థకు లేదని న్యాయస్థానాల్ని ఆశ్రయించాల్సిన ప్రభుత్వం చోద్యం చూసింది. దాంతో బ్యాంకులు నిర్వహించిన వేలంలో వైసీపీ నేతలు, జగన్ బినామీల సంస్థలైన రాంకీ గ్రూప్, ఎర్త్ ఇన్ ప్రాజెక్ట్స్, శ్యామరాజు, అరబిందో రియాలిటీస్, అరబిందో ఏస్ డెవలపర్స్ సంస్థలు వేలానికి సంబంధించి తమ ప్రతిపాదనలు బ్యాంకుల ముందు ఉంచాయి.

అంతిమంగా ఎర్త్ ఇన్ ప్రాజెక్ట్స్ కు ఆమోదం తెలిపారు. బ్యాంకులు ఇచ్చిన అప్పు మరియు వడ్డీ కలిపి, రూ. 4,138 కోట్లకు ఎన్.సీ.ఎల్.టీ వేలానికి ఒప్పుకుంది. 9 బ్యాంకులు ఇందూ సంస్థ కు రుణమిచ్చిన జాబితాలో ఉన్నాయి. ఈ బ్యాంకులతో వేలంలో పాల్గొన్న సంస్థలు కుమ్మక్కయ్యాయో.. సంస్థలు బ్యాంకులు, వ్యక్తులతో కుమ్మక్కయ్యాయో తెలియదు గానీ రూ.4,138 కోట్ల రుణానికి కేవలం రూ.477 కోట్లు చెల్లిస్తే చాలు.. భూములు మొత్తం తిరిగిచ్చేస్తామనే పరిస్థితికి బ్యాంకుల వచ్చాయి. రూ.4,138 కోట్ల పైచిలుకు రుణంలో కేవలం 10 శాతం తిరిగిస్తే చాలనడం బ్యాంకుల దివాలా కోరుతనం కాదా?

బ్యాంకుల వాదనను అంగీకరిం చిన ట్రైబ్యునల్… ఎర్త్ ఇన్ ప్రాజెక్ట్స్ సంస్థకు డబ్బులు చెల్లించి భూములు తీసుకోవాలని చెప్పింది. రూ.477 కోట్లకు వడ్డీతో కలిపి సుమారు రూ.500 కోట్లపైచిలుకు మొత్తాన్ని 90రోజుల్లో బ్యాంకులకు చెల్లించాలని ఎన్.సీ.ఎల్.టీ (ట్రైబ్యునల్) ఆదేశించింది. ఇదంతా జరి గాక నిర్ణీత కాలపరిమితిలోగా ఎర్త్ ఇన్ ప్రాజెక్ట్స్ సంబంధిత సొమ్ము చెల్లించకపోవడంతో, బ్యాంకుల ఫిర్యాదుతో ఎన్.సీ.ఎల్.టీ మొత్తం అంతకుముందు జరిగిన బిడ్స్స్ పూర్తిగా రద్దుచేసింది.

ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం ప్రేక్షపాత్రకు పరిమితం కావడం.. బ్యాంకులు ఒకేసారి అంతమొత్తం సొమ్ము రైటాఫ్ చేసి, కేవలం 10శాతం చెల్లిస్తే చాలనడం… వైసీపీప్రభుత్వ పెద్దల సంస్థలు.. ముఖ్యమంత్రి బినామీ సంస్థలు బ్యాంకులకు బకాయిలు చెల్లించేందుకు ముందుకొచ్చి, మరలా వెనక్కు తగ్గడం పలు అను మాలకు తావిస్తోంది.

ఇందూ ప్రాజెక్ట్స్ కు ఏఏ బ్యాంకు ఎంత రుణమిచ్చిందో చూద్దాం..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బీ.ఐ) : రూ.996 కోట్లు,
ఐడీబీఐ బ్యాంక్ : 803 కోట్లు,
ఎడల్వేస్ అసెట్స్ అనే ప్రైవేట్ సంస్థ : రూ.451 కోట్లు,
బ్యాంక్ ఆఫ్ ఇండియా : రూ. 331 కోట్లు.
సిండికేట్ బ్యాంక్ : రూ. 217 కోట్లు,
పంజాబ్ నేషనల్ బ్యాంక్ : రూ.223 కోట్లు,
కెనరా బ్యాంక్ : రూ. 196 కోట్లు
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ : రూ.243 కోట్లు,
యూకో బ్యాంక్ : రూ.193 కోట్లు,
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : రూ.125 కోట్లు,
ఆంధ్రాబ్యాంక్ (ఇప్పుడు యూనియన్ బ్యాంక్) : రూ.151 కోట్లు,
శ్రీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ వారు : రూ.246 కోట్లు

మొత్తం సొమ్ము రూ.4,189 కోట్ల రుణమిచ్చి చివరికి రూ.477కోట్లు ప్లస్ వడ్డీ కలిపి రూ.500కోట్ల చిల్లరకు మొత్తం 4,196ఎకరాలు తిరిగివ్వడానికి బ్యాంకులు, ఇతర ప్రైవేట్ సంస్థలు సిద్ధమయ్యాయి. ఇందూ ప్రాజెక్ట్స్ వారు 4,196 ఎకరాలతో పాటు హైదరాబాద్ లోని దుర్గం చెరువు వద్ద ఉన్న 12 ఎకరాలు, మియాపూర్లోని 20 ఎకరాలు, హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో ఉన్న 35 ఎకరాలతోపాటు పలు ఆస్తుల్ని తాకట్టు పెట్టింది. ఇంత విలువైన భూముల్ని కేవలం రూ.500కోట్ల పైచిలుకు మొత్తానికే బ్యాంకులు వేలం నిర్వహించడం గమనార్హం. కేవలం హైదరాబాద్ లోని భూముల్ని వేలం వేసినా బ్యాంకులు కోరుతున్న రూ.500కోట్ల కంటే రెట్టింపు మొత్తమే వస్తుంది. కానీ బ్యాంకులు ఆ పని చేయడం లేదు.

ఎకరం రూ.కోటి విలువచేసే ప్రభుత్వభూమి ప్రైవేట్ వ్యక్తులు.. సంస్థలు కాజేయడానికి సిద్ధమైనా… జగన్ సర్కార్లో చలనం లేకపోవడం సిగ్గుచేటు
బ్యాంకులు.. ఇందూ సంస్థ వ్యవహారం ఇలా ఉంటే… ప్రభుత్వ భూములు పోతున్నా కూడా జగన్ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదన్నదే ఇక్కడ ప్రశ్న. మొత్తం ఇందూ సంస్థకు కేటాయించిన 8,844 ఎకరాల్లో 5,811 ఎకరాలు రైతు లు భూములు…అసైన్డ్ భూములతే, 3032 ఎకరాలు ప్రభుత్వభూమి. అనంతపు రం జిల్లాలోని సరిహద్దులో ఇందూ సంస్థకు నాడు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కేటాయించిన భూమి ధర ఇప్పుడు బాగా పెరిగింది. ఆనాడు ఎకరం రూ.లక్ష.. రూ.50వేలకు ఇందూ సంస్థకు కట్టబెడితే, నేడు అదే భూమి ఎకరం రూ.కోటి.. అంతకంటే ఎక్కువ ధర పలుకుతోంది.

ఈ భూములన్నీ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కియా పరిశ్రమకు సమీపంలోనే కేవలం 30. 40 కిలోమీటర్ల పరిధిలోనే బెంగుళూరు రహదారివైపు ఉన్నాయి. ఎకరం రూ.కోటి విలువచేసే ప్రభుత్వభూమి ప్రైవేట్ వ్యక్తులు.. సంస్థలు కాజేయడానికి సిద్ధమైనా… జగన్ సర్కార్లో చలనం లేదు. బ్యాంకుల్లో తాకట్టుపెట్టిన 4,196 ఎకరాల తాకట్టు తర్వాత, 2013 మే-జూన్ మధ్యలో ఢిల్లీకి చెందిన గ్లోబల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ సంస్థ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద రూ.5కోట్లు తీసుకొని మరో రూ.650 ఎకరాలు తాకట్టు పెట్టారు.

గ్లోబల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ సంస్థ డైరెక్టర్ అయిన గుల్షన్ కుమార్ తర్వాత కొద్దికాలానికే ఇందూ సంస్థలో డైరెక్టర్ గా చేరారు. దొంగలు.. దొంగలు ఊళ్లుపంచుకున్నట్టు ఈ విధంగా ప్రభుత్వ.. ప్రజల భూములు కలిపి దాదాపు 9 వేల ఎకరాలను కేవలం రూ.500కోట్ల పైచిలుకు మొత్తానికే కొట్టేయడానికి అందరూ ఒక్కటయ్యారు. ఇదంతా గమనిస్తే ఇదో పెద్ద గూడు పుఠాణీ వ్యవహారంలా ఉంది.

ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి…బ్యాంకులకు ఇవ్వాల్సిన సొమ్ము ఇచ్చేసి భూములు వెనక్కు తీసుకొని రైతులకు న్యాయంచేయాల్సిన బాధ్యత జగన్ రెడ్డిపై లేదా?
అంత విలువైన భూములు అంత కారుచౌకగా ఇతరుల పాలవుతుంటే, ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదు? జగన్ ప్రభుత్వమే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి, రూ.350కోట్లు చెల్లించి, మొత్తం భూములు 9వేలఎకరాలు తిరిగి వెనక్కు తీసుకొని రైతులకు ఇవ్వడమో.. లేక కొత్త సంస్థల్ని పిలిచి పరిశ్రమలు పెట్టించ డమో ఎందుకు చేయడంలేదు? బ్యాంకులకు రుణాలు తీసుకున్నవారంటే భయమా… రుణాలు తీసుకున్నవారికి ప్రభుత్వమంటే భయమా? ఎవరికి ఎవరు భయపడుతున్నారు.

ఈ వ్యవహారం వెనకున్న భూ బకాసురులు ఎవరు? బ్యాంకులు ఒకేసారి ఇచ్చిన రుణంలో 87శాతం రైటాఫ్ చేయడానికి ఎందుకు సిద్ధమయ్యాయి. ఈ భూములన్నీ ఈడీ జప్తు లో ఉండగానే ఇంత కథ నడవడం గమనార్హం. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన ఈ భూమి కేటాయింపులకు.. నేడు జగన్ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు..అధికారులు కూడా బాధ్యులే. తండ్రి ఆనాడు రైతుల భూములు కారుచౌకగా ఇందూ సంస్థకు కట్టబెట్టి..వారికి తీరని అన్యాయం చేస్తే, అవే భూముల తాలూకా ప్రతిఫలం పొందిన జగన్ రెడ్డి నేడు అధికారంలోఉండి కూడా ఎందుకు రైతులగురించి ఆలోచించడం లేదు?

ఆనాడు తమప్రాంతానికి పరిశ్రమలు వస్తాయి.. తమ బిడ్డలకు ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయని ఆశపడి, భూములిచ్చిన రైతులు..వారి కుటుంబాల పరిస్థితి నేడు దారుణంగా ఉన్నా బాధ్యతాయుత స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు స్పం దించడు?” అని నీలాయపాలెం విజయ్ కుమార్ నిలదీశారు.

LEAVE A RESPONSE