– మంత్రి పొన్నం ప్రభాకర్
– జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యూసుఫ్ గూడా డివిజన్ లో బూత్ కృష్ణ నగర్ లో 261,261,263 బూత్ లలో డోర్ డోర్ ప్రచారం లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్
– కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్ ను గెలిపించాలని మహిళలు , వృద్ధులు , వ్యాపారస్థులతో ఓటు అభ్యర్థించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీహిల్స్ మరింత అభివృద్ధి జరుగుతుంది. నవీన్ యాదవ్ లోకల్ యూసుఫ్ గూడా లోని పుట్టిన బిడ్డ. ఆయనను ఆశీర్వదించండి. ప్రజా పాలన ప్రభుత్వం లో సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో జరుగుతుంది. గత 10 సంవత్సరాల్లో జూబ్లీహిల్స్ నిర్లక్ష్యానికి గురైంది. గత శాసన సభ్యులు ఇబ్బందులకు గురి చేశారు.
నవీన్ యాదవ్ గెలిస్తే మన మధ్యే ఉంటారు. రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుంది. మహిళా సాధికారత ద్వారా ఆర్థిక వృద్ధి సాధించేలా మహిళా సంఘాల ద్వారా సున్నా వడ్డీ రుణాలు అందించి ప్రత్యేక పథకాలు ప్రారంభించాం. గత 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు.మేము రాగానే నూతన రేషన్ కార్డులు అందించాం.
సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. 500 కి గ్యాస్ అందిస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం. ఉద్యోగాలు భర్తీ చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి భారీ మెజారిటీ తో నవీన్ యాదవ్ ను గెలిపించండి.