ప్రారంభించిన వాడు గొప్పవాడా? కొనసాగించిన వాడు గొప్పవాడా అంటే.. బ్రిటానియా 50 50 బిస్కెట్ మోడల్ అన్నమాట. ఇదే రకంగా న్యాయ రాజధాని కేంద్రంగా పలు రాష్ట్ర స్థాయి కార్యాలయాలు కర్నూలులో ఏర్పాటు చేసింది జగన్, ప్రస్తుతం ఆ కార్యాలయాలను అక్కడే కొనసాగిస్తుంది మాత్రం చంద్రబాబు. అసలు అక్కడ జగన్ రాష్ట్ర స్థాయి కార్యాలయాలు పెట్టబట్టే కదా.. ఇప్పుడు చంద్రబాబు అక్కడ కార్యాలయాలను కొనసాగిస్తుంది. లేకపోతే అసలు అక్కడ కార్యాలయాలు వచ్చి ఉండేవా? కానీ వాస్తవానికి ఇవన్నీ అమరావతి రాజధానిలో ఏర్పాటు కావాల్సింది. అప్పట్లో ఇవన్నీ అమరావతిలోనే పెట్టాలని జీవోలు కూడా ఇచ్చారు. వాటిని రద్దుచేసి, ఆ స్థానంలో కొత్త జీవోలు తీసుకొచ్చి కర్నూల్ లో ఏర్పాటు చేశారు.