జాన్ మెక్కార్తి కనిపెట్టిన ఏఐ అంటే ఏంటో.. ఇప్పటివరకు మనం నమ్మిన ప్రతిదీ అబద్ధం! న్యూరల్ నెట్‌వర్క్‌లు, డీప్ లెర్నింగ్—అంతా వేస్ట్ ఆఫ్ టైం.
అసలైన సిద్ధాంతం ఇదే: “డేటా ఉంటే, దానిపై మైండ్ అప్లై చేస్తే, అది ఏఐ అవుతుంది.”
అంటే నా దగ్గర పాత బజ్జీ పేపర్ల సాక్షి కట్ట వుంటే.. అదే నా డేటా! వాటిని చూస్తూ రెండు నిమిషాలు ముక్కు గిల్లుకుంటే, నేను ఏఐ చేస్తున్నానన్నమాట! వైనాట్ 175 గురించి ఆలోచించాను అంటే, నేను డీప్ లెర్నింగ్‌లో ఉన్నట్టే! ఇక ఫ్యాన్ స్విచ్‌ను రకరకాలుగా ఆన్/ఆఫ్ చేస్తే ఫ్యూజన్ శక్తి వస్తుందనే ఆవిష్కరణ గురించి త్వరలో వింటాం.
కంప్యూటర్ సైన్స్ మొత్తం ఈ సిద్ధాంతానికి ఒక ఫుట్‌నోట్ మాత్రమే. ఇకపై పిహెచ్డి అవసరం లేదు—మీకు కావలసిందల్లా ఏదైనా డేటా, దానిపై ఏదైనా మైండ్ అప్లై చేయగల మెదడు. ₹5/- పెటీఎం మెదడు నుండి జగన్ మెదడు వరకు ఏదైనా పర్లేదు.
నేను ఇప్పుడు జగన్ అన్న “వెంట్రుక కూడా పీకలేరు” అన్న డేటాపై మైండ్ అప్లై చేసి, ఏఐ ఆధారిత 11 ఎలా వచ్చింది అన్నది డీబగ్ చేయాలి. అంతవరకు, మీ మైండ్ అప్లై చేస్తూ ఉండండి.