కాకినాడ: “సమస్య మీది… పరిష్కారం మాది” అనే నినాదంతో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల్లో విశేష ఆదరణ పొందుతోంది. శుక్రవారం నిర్వహించిన 26వ ప్రజా దర్బార్ కార్యక్రమానికి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
సామర్లకోట మండలం కొప్పవరం గ్రామంలో గల రాజ్యసభ సభ్యుల కార్యాలయంలో జరిగిన ఈ ప్రజా దర్బార్లో అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా చర్యలు చేపట్టినట్లు కార్యాలయ ఇన్ఛార్జి మేకా లక్ష్మణమూర్తి తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు, టిడిపి సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ — ప్రజలలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రజాదర్బార్పై నమ్మకం పెరుగుతుందని, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజలు తరలివచ్చిన తీరు దానికి నిదర్శనమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో నాయకులు నూటన్ ఆనంద్, చింతపల్లి అర్జున్, డీఆర్యుసిసి సభ్యులు ముత్యాల అనిల్, జున్నూరు బాబి , ఐ టి డి పి పాలిక సతీష్ తదితరులు పాల్గొన్నారు.