– ‘జగన్ ఎయిర్‌లైన్స్’ నుంచి.. ‘ఏపీ ఏవియేషన్ హబ్’ దాకా!
గత ఐదేళ్లలో (2019–2024) జగన్ ఆకాశం మీదే… కానీ అభివృద్ధి శూన్యం! జగన్ గారి పాలనలో ఏవియేషన్ అంటే కేవలం “తాడేపల్లి టు గన్నవరం” మాత్రమే అనుకున్నారు. ప్రజల సొమ్ము ₹222.85 కోట్లు ఖర్చు పెట్టి, జగన్ గాల్లో విహరిస్తే… రాష్ట్రంలోని ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులు మాత్రం నేలచూపులు చూశాయి. “జగన్ ఎయిర్‌లైన్స్” ఫుల్ స్వింగ్‌లో నడిచింది కానీ…
నెల్లూరు దగదర్తి ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి, రన్‌వే ఎక్కకముందే ప్రాజెక్టును కూల్చేశారు.
భోగాపురంలో టెంకాయ కొట్టారు కానీ, పనులు మాత్రం “ట్రాఫిక్ జామ్”లో ఇరుక్కుపోయినట్లు ఆగిపోయింది.
కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయంకు పేరు మార్చి 2021లో ప్రారంభించారు. అయితే అది గత టిడిపి ప్రభుత్వ హయాంలోనే ప్రారంభ దశకు చేరింది.
కొత్త విమానాలు రాలేదు, కార్గో ఎగుమతులు పెరగలేదు… కేవలం జగన్ జల్సా ట్రిప్పులు తప్ప!
2024 తర్వాత తెలుగుదేశం గేర్ మార్చింది… ఆ రంగంలో అభివృద్ధి ఆకాశమే హద్దుగా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది! కూటమి ప్రభుత్వం రాగానే సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఏవియేషన్ అంటే “లగ్జరీ” కాదు, “ఎకానమీ బూస్టర్”!
నిన్నటి దాకా నత్తనడకన సాగిన భోగాపురం పనులు, ఇప్పుడు జెట్ స్పీడ్ అందుకున్నాయి. జూన్ 2026 కల్లా విమానం దిగాల్సిందే అని డెడ్ లైన్ పెట్టారు.
జగన్ హయాంలో రోడ్ల మీద గుంతలు పూడ్చడమే గగనం అనుకున్న చోట… ఇప్పుడు కృష్ణా నదిలో “సీ ప్లేన్లు” దిగుతున్నాయి. టూరిజం కొత్త పుంతలు తొక్కుతోంది.
ఓర్వకల్లులో ఏకంగా “డ్రోన్ సిటీ”! ఏదో బొమ్మలు ఆడుకునే డ్రోన్లు కాదు… 25,000 మందికి పైలట్ ఉద్యోగాలిచ్చే “డ్రోన్ పాలసీ 4.0” తెచ్చారు. పెట్టుబడులు తెస్తున్నారు.
ఢిల్లీలో మనోడు: కేంద్ర విమానయాన శాఖ మన (ఏపీ) చేతిలోనే ఉండటంతో… కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఏకంగా 7 కొత్త ఎయిర్‌పోర్టులకు లైన్ క్లియర్ అవుతోంది.
ముక్కలో చెప్పాలంటే: గతంలో “విమానం జగన్ కోసమే” అన్నట్లు ఉండేది. ఇప్పుడు “విమానయానం మన పిల్లల భవిష్యత్తు కోసం” అన్నట్లు మారింది. అప్పుడు “ఖర్చు”… ఇప్పుడు “పెట్టుబడి”! తేడా స్పష్టం!
ఇండిగో సంస్థ పైలట్లను తగినంతమందిని పెట్టుకోకండా, కేంద్ర నిబంధనలకు సరేనన్నది. పొరపాటు చేసింది. దానివల్ల సంక్షోభం వచ్చి, షేర్ మార్కెట్లో దాని పేరు పోయింది.
దానికి కేంద్రమంత్రిగా ఉన్నాడని చిన్న వయసులోనే రాణిస్తున్న మన రామ్మోహన్ నాయుడు మీద ఏడుస్తున్నారు. ఆయన రాత్రింబవళ్లూ పనిచేసి పరిస్థితిని సరిదిద్దాడు. వాళ్ల నాన్న ఎర్రం నాయుడు జగన్ అక్రమాస్తుల కేసులో ఇంప్లీడ్ అయ్యాడనే కక్షతో… ఈ ఇండిగో తప్పిదాన్ని సాకుగా చూపి కొడుకు మీద ఏడుస్తున్నారు.
ఒక్కటి చెప్పండి: ఆ ఇండిగో తప్పిదం వలన మన రాష్ట్రానికి కలిగిన నొప్పికన్నా… ఆయన శాఖ ద్వారా రాష్ట్రం పొందుతున్న లబ్ది తక్కువా? రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి. ఆర్నాబ్ ఛానెల్లో అరిస్తే బెదిరే ఎవరూ లేరు ఇక్కడ.
ఒకడు లిక్కర్ కేసులో, మరొకడు గొడ్డలి కేసులో, ఇంకొకడు కల్తీ కేసులో బెయిలు మీద ఉండి… సిగ్గులేకుండా పార్లమెంటుకు వెళుతూ బిక్కు బిక్కు మంటున్నారు. ఈ “సింగిల్ సింగాలతో” రాష్ట్రానికి ఉల్లి పొట్టు అంత ప్రయోజనం కూడా లేదు.
రాష్ట్రంలో ఏ సమస్యలూ లేవన్నట్లు, షేట్ ఇంట్లో దాక్కునే ఆ పేర్ని నాని పౌరవిమానయానశాఖ గురించి మాట్లాడుతుంటే… జనం పక్కున నవ్వుకుంటున్నారు.
ఆకాశం మీదే జగన్ పాలన నుంచి… నేడు ఆకాశమే హద్దుగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్ర, తన గర్జనను ఈ అర్భకులకోసం ఆపదు.