– షాడో సీఎంగా సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి
– రేవంత్ సోదరుడు కృష్ణారెడ్డి కనుసన్నల్లో ప్రభుత్వ యాడ్స్
– కొండల్ రెడ్డి ఫోర్త్ సిటీలో బిజీ
– తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి కంపెనీతో ఒప్పందం
– ఇప్పటివరకు ఒక్క పైసా అయినా పెట్టుబడులు పెట్టారా లేదా ?
– అల్లుడు సత్యనారాయణ రెడ్డి కోసం లగచర్లలో గిరిజన రైతులపై లాఠీఛార్జ్
– రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డికి అమృత్ టెండర్లు శోదా కంపెనీకి సింగరేణి కాంట్రాక్టులు
– బీఆర్ఎస్ నేత డాక్టర్ మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్: కడుపు కట్టుకుని హామీలు అమలుచేస్తామని సీఎం చెప్పారు. నన్ను కోసుకుతిన్నా పైసలు లేవని సీఎం అంటున్నారు. సీఎం సకుటుంబ సపరివారాన్ని కోస్తే పైసలు బయటకు వస్తాయి. షాడో సీఎంగా సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి వ్యవహరిస్తున్నారు.
కొండల్ రెడ్డి ఫోర్త్ సిటీలో బిజీగా ఉన్నారు. అమెరికా వరకు సీఎం వెళ్లి స్వంత తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటివరకు ఒక్క పైసా అయినా పెట్టుబడులు పెట్టారా లేదా అని క్లారిటీ లేదు. రెండు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ యాడ్స్ అన్ని రేవంత్ రెడ్డి మరో సోదరుడు కృష్ణారెడ్డి కనుసన్నల్లో నడుస్తున్నాయి. యాడ్స్ రూపంలో పోతున్న డబ్బులన్నీ రేవంత్ రెడ్డి సోదరుడి ఖాతాలోకి వెళ్తున్నాయి.
రేవంత్ రెడ్డి అల్లుడు సత్యనారాయణ రెడ్డి కోసం లగచర్లలో గిరిజన రైతులపై లాఠీఛార్జ్ చేశారు. రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డికి అమృత్ టెండర్లు కట్టబెట్టారు. సృజన్ రెడ్డికి చెందిన శోదా కంపెనీకి సింగరేణి కాంట్రాక్టులు అప్పగించారు. కాంగ్రెస్ కు అనుబంధంగా ఉన్న నేషనల్ హెరాల్డ్ పత్రికకు తెలంగాణ నుండి యాడ్స్ ఇస్తున్నారు
1,137 కోట్ల కాంట్రాక్టు శోదా కంపెనీకి ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు తిరిగిన ల్యాండ్ క్రూయిజర్ కారు, కె.ఎల్.ఎస్.ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద ఉంది. ఇప్పుడు అదే కె.ఎల్.ఎస్.ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు 320 కోట్ల కాంట్రాక్టు రేవంత్ రెడ్డి ఇచ్చారు. పాలేరులో 200 కోట్ల కాంట్రాక్టు ఇచ్చారు.
వందల కోట్ల కాంట్రాక్టులు కుటుంబానికి,మిత్రులకు అప్పగిస్తున్నారు. ఢిల్లీకి పోతే దొంగల్లా చూస్తున్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు. అసలు దొంగలు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు. రేవంత్ రెడ్డి కుటుంబ దోపిడీపై ఏ.ఐ.సి.సి ఎందుకు మౌనంగా ఉంటుంది? మంత్రుల అన్ని శాఖల్లో సీఎం రేవంత్ రెడ్డి వేలు పెట్టారు. ఐటీ శాఖ మంత్రి సలహా తీసుకోకుండా ఇంటర్ నెట్ కేబుల్స్ కట్ చేశారు.
రేవంత్ రెడ్డి కుటుంబం అవినీతి,అరాచకాలకు పాల్పడుతోంది. జేబులు నింపడానికి రేవంత్ రెడ్డి కుటుంబం బిజీగా వుంది. తెలంగాణ సమాజం విద్యార్థులు, యువత,రైతులు రోడ్ల మీద ఉన్నారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కంధాల ఉపేందర్ రెడ్డికి సృజన్ రెడ్డి అల్లుడు. కంధాల ఉపేందర్ రెడ్డి
ప్రభుత్వంలో ఉన్నారా? సృజన్ రెడ్డికి రేవంత్ రెడ్డి బామ్మర్దిగా కాంట్రాక్టులు వచ్చాయి.
జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యునిగా సృజన్ రెడ్డికి కాంట్రాక్టులు వచ్చాయి. సృజన్ రెడ్డికి జైపాల్ రెడ్డి కుటుంబానికి సంబంధం లేదా? రేవంత్ రెడ్డి చెప్పాలి. సృజన్ రెడ్డిని తప్పించడం కోసం మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి పేరు వాడుతున్నారు.