కోర్టు ఆదేశాలను స్ట్రిక్టుగా అమలు చేస్తే ఎన్నికల ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి దూరమయ్యే ఛాన్స్
– కిలారు రాజేష్ ను బెదిరించిన ఘటనలో కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల ప్రమేయం
– ఆంజనేయులు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలి
– ఏ అధికారి ఆదేశాల మేరకు కిలారు రాజేష్ ను బెదిరించారో రాబట్టాలి.
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు
ఏ ఎన్నికల ప్రచారానికి అయితే ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని దూరం చేయాలని అక్రమ కేసులను పెట్టారో, కోర్టు ఆదేశాలను స్ట్రిక్టుగా ఇంప్లిమెంట్ చేస్తే అదే ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దూరమవుతారేమోనని అనిపిస్తుందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టు విధివిధానాలను త్వరగా రూపొందించి, సిబిఐ కోర్టు బాగా త్వరితగతిన విచారణ పూర్తి చేయాలనీ ఆదేశించాలన్నారు.
ఎందుకంటే ఇప్పటికే పదేళ్లు ఆలస్యం అయ్యిందని పేర్కొన్నారు. ఇంకా ఆలస్యం చేయడానికి వీలులేదని, జగన్మోహన్ రెడ్డి కి మరిన్ని వాయిదాలు ఇవ్వవద్దన్నారు. సుప్రీంకోర్టులో ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న కేసులో మంచి తీర్పు వెలువడింది. అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటీషన్ లో ఒక్కసారి ఎవరైనా దోషి అని రుజువు అయితే ఆరు సంవత్సరాలు పాటు కాకుండా, జీవితకాలం నిషేధించాలని కోరారు. అయితే జీవితకాలం నిషేధాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోకపోవచ్చు. కానీ ఇప్పటివరకు అమల్లో ఉన్న నిషేధాన్ని యధావిధిగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. వేగవంతంగా విచారణ పూర్తి చేయాలని, అవసరమైతే బెంచ్ మార్చాలని, కోర్టు కూడా బదిలీ పిటిషన్లు వేయడం జరిగింది.
ఇదే విషయమై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురేంధరేశ్వరి కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లపై సిబిఐ మోపిన ఆర్థిక నేరాభియోగాల కేసులను త్వరితగతిన విచారించాలని ఆమె కోరారు. ఈ కేసులను వేగవంతం చేయాలని సుప్రీం కోర్టు తీర్పుని ఇవ్వడం శుభ పరిణామమని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీ నాయకుల, ముఖ్యంగా పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయ నడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కేసుల విచారణకు వాయిదాలు ఇవ్వడానికి వీలులేదని హైకోర్టు తన విధివిధానాలలో స్పష్టం చేయాలని కోరారు. అలాగే వాయిదాలు వేయడానికి వీలులేదని ఆదేశించాలి. విచారణకు కచ్చితంగా హాజరు కావలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి పై ఉన్నదని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు కి పూర్తిస్థాయి బెయిల్ లభించడం ఖాయం
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో పూర్తిస్థాయి బెయిల్ లభిస్తుందన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ హైకోర్టులో నేడు విచారణకు వచ్చింది. గతంలో వాయిదా పడిన ఈ కేసును , ఈ నెల 21వ తేదీ వరకు వాయిదా వేయాలని అడ్వకేట్ జనరల్ కోరడం ఉంది. 21వ తేదీ వరకు వాయిదా వేయడం కుదరదని న్యాయమూర్తి , ఈనెల 15వ తేదీ వాయిదా వేయడం జరిగింది. ఏదో విధంగా కేసు వాయిదా వేయించడం ద్వారా ఈనెల 28వ తేదీ వరకు సమయాన్ని తీసుకుంటే, నారా చంద్రబాబునాయుడు ని ఏదో ఒకటి చేయవచ్చునని అనుకుంటున్నారు.
నీ ఈనెల 20, 21వ తేదీలలో స్కిల్ డెవలప్మెంట్ కేసు లో రిమాండ్ రిపోర్ట్ క్వాష్ కోసం దాఖలు చేసిన పిటిషన్ పై అవినీతి నిరోధక చట్టంలోని 17A నిబంధన వర్తిస్తుందని తీర్పు వెలవడ నుందన్నారు. అలాగే హైకోర్టులో కూడా చంద్రబాబు నాయుడు కి పూర్తి బెయిల్ లభించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఉన్నవారందరికీ పూర్తిస్థాయి బెయిల్ లభించడం జరిగింది. అసలు కేసే లేదు. హైకోర్టులో నారా చంద్రబాబునాయుడు కి పూర్తిస్థాయి బెయిల్ లభిస్తుందన్న నమ్మకం తనకు ఉన్నదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.. త్వరలోనే నారా చంద్రబాబు నాయుడు జనబాహుల్యంలోకి తిరిగి వస్తారన్నారు. రాబోయేది అంతా శుక్లపక్షమే. రైజింగ్ మూన్ ను చూస్తామన్నారు.
పోలీసుల అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి
తెదేపా కార్య నిర్వాహక కార్యదర్శి కిలారు రాజేష్ ను బెదిరించిన ఘటనలో కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల ప్రమేయం ఉందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. గతంలో సిఐడి అధికారులు కిలారు రాజేష్ ను నోటీసు ఇచ్చి పిలిచినప్పుడు, ఇంటలిజెన్స్ శాఖ అధికారి ఒకరు మధ్యలో వచ్చి, తాను చెప్పిన వ్యక్తి పేరును చెప్పకపోతే మనిషి గల్లంతు కావడం ఖాయమని బెదిరించినట్టు తెలిసింది. కిలారు రాజేష్ తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు లంచ్ మోషన్ పిటీషన్ చేశారు. దాన్ని కోర్టు స్వీకరించడం జరుగుతుంది.
కౌంటర్ ఇంటెలిజెన్స్ కు చెందిన వ్యక్తులు ఇతర రాష్ట్రాలలో ఉన్నప్పుడు, పక్క రాష్ట్ర పోలీసుల అనుమతి తీసుకోవలసి ఉంటుంది. ఎంతమంది ఉన్నారని విషయాన్ని వారికి తెలియజేయాల్సి ఉంటుంది. సిఐడి నోటీసు ఇచ్చిన కేసులో కిలారు రాజేష్ వాహనాన్ని వెంబడించి మా సారు చెప్పిన వారి పేరు చెప్పకపోతే, మనిషి గల్లంతవ్వడం ఖాయమని బెదిరించడం దారుణం. ఫేక్ నెంబర్ వెహికల్ పై తిరుగుతూ, బెదిరించడం అనేది సిగ్గుచేటు. పోలీస్ వ్యవస్థకు కొన్ని విధివిధానాలు ఉంటాయి. కానీ ఆ విధివిధానాలను మరిచిపోయి కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్నారు.
గతంలో నన్ను కూడా దొంగ పోలీసుల చేత అపహరింపజేసి, కడ తేర్చాలని ఈ నీచ ప్రభుత్వం చూసింది . కిలారు రాజేష్ ను బెదిరించడం వెనుక కుట్ర కోణం దాగి ఉంది. ఆంజనేయులు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలి. ఏ అధికారి ఆదేశాల మేరకు కిలారు రాజేష్ ను బెదిరించారో రాబట్టాలి. ఆంజనేయులుపై వేణుగోపాల్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రఘురాం రెడ్డి అనే అధికారులు, ఐజీ స్థాయి అధికారి ఉండి ఉంటారు. డీజీ, సీతారామాంజనేయులులలో ఎవరు ఆదేశించారో నిగ్గు తేల్చాలన్నారు. పోలీసు వ్యవస్థను తమ కీలుబొమ్మగా వాడుకొని, ఇలా సామాన్యులను బెదిరించి బలవంతంగా ఇతరుల పేర్లు చెప్పించాల్సిన అవసరం ఎందుకొచ్చింది అన్నది విజ్ఞులైన ప్రజలు ఆలోచించుకోవాలని రఘు రామకృష్ణం రాజు కోరారు. కిలారు రాజేష్ ను బెదిరించిన ఘటనపై లంచ్ మోషన్ పిటిషన్ పై వాదనలు జరిగిన తర్వాత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం పేర్కొంటుందన్నారు.
తెలుగు భాషను అమితంగా ప్రేమించే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జయంతి సందర్భంగా కడప జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భాషా విధ్వంసానికి పూనుకోవడం దురదృష్టకరం.. ఇసుమంతైన భాష పై ఆయనకు ప్రేమ కలగాలని, జగన్మోహన్ రెడ్డి లో ఇంగ్లీషు భావాలు ఉన్నప్పటికీ, చార్లెస్ పీలిప్ బ్రౌన్ జయంతి సందర్భంగానయినా తెలుగు భావాలు వృద్ధి చెందాలని కోరుకుందామని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.