Home » సొంత ఎమ్మెల్యేలే జగన్ ను నమ్మకపోతే, ఇకప్రజలు ఎలా నమ్ముతారు?

సొంత ఎమ్మెల్యేలే జగన్ ను నమ్మకపోతే, ఇకప్రజలు ఎలా నమ్ముతారు?

-జగన్ నియంత్రత్వ విధానాలే అతని పతనానికి బాటలు వేస్తున్నాయి
• తండ్రి అధికారంతో వేలకోట్లు, తన ముఖ్యమంత్రిత్వంలో లక్షలకోట్లు కొట్టేయబట్టే డబ్బుతో అన్నీచేయొచ్చని జగన్ అనుకుంటున్నాడు.
• చంద్రబాబు డబ్బురాజకీయాలకు అతీతుడు. 4గురుటీడీపీ, 1జనసేన ఎమ్మెల్యేని జగన్ ఎంతకు కొన్నాడు?
– కొనకళ్ల నారాయణ 

ఎమ్మెల్యేకోటా ఎమ్మెల్సీఎన్నికల్లో టీడీపీఅభ్యర్థి గెలుపుపై వైసీపీనేతలు, మంత్రులు చాకబారు విమర్శలు చేస్తున్నా రని, ప్రజలు ఎన్నుకున్నవాళ్లను డబ్బుతో కొనే అలవాటు జగన్ కు, అతనిపార్టీకే ఉందని, టీడీపీఎమ్మెల్యేలు 4గురికి ఎంతఇచ్చారో ముఖ్యమంత్రి, అతని బృందమే సమాధానం చెప్పాలని టీడీపీ సీనియర్ నేత, మాజీఎంపీ కొనకళ్ల నారాయణ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే మీకోసం…!

“గతంలో తండ్రి అధికారంతో వేలకోట్లుకొట్టేసిన జగన్, ఇప్పుడు ఏకంగా లక్షలకోట్ల ప్రజలసొమ్ముని దిగమింగుతున్నాడు. ల్యాండ్, శాండ్, మైన్స్, వైన్స్, ఎర్రచందనం, గంజాయి, ఇలా అన్నింటినీ తనవ్యాపారాంశాలుగా మార్చుకున్నాడు. వాటితో ఆగకుండా, రాష్ట్రంలోని సహజ వనరులన్నింటినీ లూఠీచేస్తున్నాడు. అప్పులుతెచ్చిన సొమ్ముని, రాష్ట్రంకోసం, ప్రజలకోసం వినియోగించకుండా, దాన్నికూడా తనఖజానాకే తరలిస్తున్నాడు. ఇలా ఎటుచూసినా డబ్బు కోసం వెంపర్లాడే జగన్ ఎమ్మెల్యేలను, టీడీపీ డబ్బుతో కొన్నదంటే నమ్ముతారా? జగన్ నియంత్రత్వవిధానాలే అతని పతనానికి బాటలువేస్తున్నాయి.

పట్టభద్రులు, సొంతపార్టీ ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయిన జగన్, త్వరలోనే ప్రజల విశ్వాసం కూడా కోల్పోతారు
రాష్ట్రభవిష్యత్ కోసం ఆత్మప్రబోధానుసారం ఓటేయమని చంద్రబాబు ఇచ్చిన పిలుపై ఎమ్మె ల్యేలు స్పందించారు. జగన్ అవినీతి, నియంత్రత్వ విధానాలుచూసి, అతని పార్టీ ఎమ్మెల్యేలే అతన్ని కాదనుకుంటున్నారు. జగన్ తనఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయాడు, కాబట్టే వారు పక్కచూపులు చూస్తున్నారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచినప్పుడే, ప్రజల తో పాటు, వైసీపీఎమ్మెల్యేల్లో కూడా మార్పువచ్చింది. డబ్బురాజకీయాలకు చంద్రబాబు పూర్తి వ్యతిరేకి. అలాంటిపనులు ఆయన చేస్తాడని చెప్పడం, దేవుడు తప్పుచేశాడనడమే. 4 గురు టీడీపీఎమ్మెల్యేలను కొన్నజగన్, జనసేన నుంచి గెలిచిన ఒక్కతన్నికూడా తనవైపుకి లాక్కున్నాడు. ఇటీవల జరిగిన పట్టభద్రఎమ్మెల్సీ ఎన్నికల్లో తనపార్టీవారిని గెలిపించడానికి జగన్ డబ్బుని మంచినీళ్లకంటే దారుణంగా వెచ్చించాడు. అధికారపార్టీ నేతలు గెలుపుకోసం వెండి కాయిన్స్ పంచారు.. వెండి వస్తువులు పంచారు.. డబ్బులుఇచ్చారు.. ఇతరత్రా ప్రలోభాలకు గురిచేశారు. అయినాకూడా విద్యావంతులు జగన్ మాయలోపడకుండా, చంద్ర బాబు పక్షాన నిలిచారు. రాష్ట్రంలోని విద్యావంతులు జగన్ ను ఛీకొట్టాక, అదిచూసి వైసీపీ ఎ మ్మెల్యేలు కూడా ఆలోచించుకున్నారు. అందుకే ఆత్మప్రబోధానుసారం వ్యవహరించారు. జగన్ ను మించిన అవినీతిపరుడు, అతనిప్రభుత్వాన్ని మించిన అవినీతిప్రభుత్వం దేశంలో నే లేవు. జగన్ నియంత్రత్వపోకడలే సొంతపార్టీ ఎమ్మెల్యేలు దారితప్పడానికి కారణమయ్యా యి. జగన్ కు ఇష్టంలేకపోతే, సొంతఎమ్మెల్యేలకు కూడా స్వేచ్ఛలేకుండా చేస్తాడు. దానిప్రభా వమే పంచుమర్తి అనురాధ గెలుపు. ఇప్పుడుజరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీఎన్నికలు, ఎమ్మెల్యేకోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీగెలుపు, భవిష్యత్ లోజరగబోయే అసలైన ఎన్నికల గెలుపుకు దిక్సూచి. జగన్ ప్రజలమద్ధతుతో పాటు, వైసీపీఎమ్మెల్యేల విశ్వాసం కూడా కోల్పోయాడు కాబట్టే, దిక్కుతోచక టీడీపీపై, చంద్రబాబుపై నిందలేస్తున్నాడు.” అని నారాయణ స్పష్టంచేశారు.

Leave a Reply