వైకాపా నాయకులకు దమ్ముంటే ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేయాలి

– మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు

ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదన్న సాకుతో వైసిపి నాయకులు బుధవారం బంద్ నిర్వహించడం ద్వారా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాము. వైకాపా నాయకులకు దమ్ముంటే ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేయాలి కానీ ఓట్లేసిన ప్రజలపై కక్ష తీర్చుకొవడమేమిటి?.

కాపు రామచంద్రారెడ్డికి నిజంగా అంత సమర్థత ఉంటే ఎందుకు మంత్రి పదవి రాలేదని ప్రశ్నించడం జరిగింది. మంత్రివర్గ విస్తరణ ప్రకటన వెలువడిన మూడు రోజుల తరువాత తీరిగ్గా స్పందించడంలోనే అది స్వచ్చందం కాదని కాపు ప్రేరేపితమని ఎవరికైనా ఇట్టే ఆర్థమవుతుంది.

బుధవారం నాటి బంద్ సందర్భంలో వైసీపీ నాయకులు లాలూచీ అరెస్టులు చేయించుకోవడాన్ని ఒక చౌకబారు రాజకీయ ఎత్తుగడగా భావిస్తున్నాము.రాయదుర్గం పట్టణంలో ప్రజలు, వైకాపా కార్యకర్తలు స్పందించకపోవడం ఆపార్టీ డొల్లతనాన్ని బయటపెట్టింది.

అలాగే వైసీపీ నియోజకవర్గ కీలక నాయకులు మెట్టు గోవిందరెడ్డి, ఉపేంద్రరెడ్డి, గరుడచెడు రాజగోపాలరెడ్డిలాంటి వారు కాపు రామచంద్రారెడ్డికి బాసటగా నిలవక పోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించడం జరిగింది.రాయదుర్గంలో వైకాపా నిలువునా చీలిపోయిందనడానికి ఇంతకంటే నిదర్శనమేమి కావాలి. ఇప్పటికైనా కాపు రామచంద్రారెడ్డి క్షుద్ర రాజకీయాలు మాని ఓట్లేసి గెలిపించిన ప్రజల బాగోగులు చూడాలని హితవు పలకడం జరిగింది.

Leave a Reply