Suryaa.co.in

Telangana

హరీశ్ రావు మీద అడ్డగోలుగా మాట్లాడితే తగిన బుద్ధి చెబుతాం

– బీఆర్ఎస్, హరీశ్ రావు పై కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్

హైదరాబాద్ : గాంధీ భవన్ లో కూర్చొని బీఆర్ఎస్ పై, హరీశ్ రావుపై అవాకులు చెవాకులు పేలిన మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్ ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాం. అత్యంత ప్రజాదరణ కలిగిన హరీశ్ రావు మీద అడ్డగోలుగా మాట్లాడితే తగిన బుద్ధి చెబుతాం. గల్లీ లీడర్ల గురించి, గల్లీల్లో ప్రెస్ మీట్లు పెట్టుకునే నీ చిల్లర స్థాయి ఎక్కడ? హరీశ్ రావు స్థాయి ఎక్కడ?

బిజేపీతో కుమ్మక్కై ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓటమికి కారణం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లి ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఖతం అవుతున్నది. మహారాష్ట్ర, ఢిల్లీ, కరీంనగర్ వెళ్లి ప్రచారం చేసిండు. అడ్రస్ లేకుండా పోయింది కాంగ్రెస్. ఉన్న మాటంటే కాంగ్రెస్ నాయకులకు ఎందుకు ఉలుకు? హరీశ్ రావు చెప్పినట్లు కాంగ్రెస్ లో ఉన్న బిజేపీ ఏజెంట్ రేవంత్ రెడ్డి.

మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి నువ్వు మైనార్టీలకు చేసింది ఏమిటి ముందు దానికి సమాధానం చెప్పు? షాదీ ముబారక్ కింద తులం బంగారం ఏమైంది? మైనార్టీకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఏడాదిన్నరలో 10కి పైగా మత ఘర్షణలు జరిగితే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? మైనార్టీలకు ప్రత్యేక సబ్ ప్లాన్ హామీ ఏమైంది? మైనార్టీ రెసిడెన్షియల్ల బిల్లులు చెల్లించక స్కూల్లకు తాళాలు వేసిన దుస్థితి కాంగ్రెస్ పార్టీలో వచ్చింది.

బీఆర్ఎస్ పార్టీ నాడు 16వేల కుట్టు మిషన్లు లబ్ధిదారులకు ఇస్తే, ఎన్నికల కోడ్ వల్ల మిగతా 4వేల కుట్టు మిషన్లు ఇవ్వలేక పోయాం. హరీశ్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్నపుడు నిధులు విడుదల చేసి తెచ్చిన ఆ కుట్టు మిషన్లపై ఉన్న కేసీఆర్ ఫొటోలను తొలగించి, రేవంత్ రెడ్డి ఫొటోలు అంటించి పంచిపెట్టారు. సిగ్గులేకుండా ప్రచారం చేసుకున్నారు. రంజాన్ వేళ అబద్దాలు మాట్లాడితే అల్లా క్షమించడు. హరీశ్ రావు వంటి మంచి మనుషుల మీద విమర్శలు చేయడం అంటే ఆకాశం మీద ఉమ్మేయడమే.

 

LEAVE A RESPONSE