-సొంత చెల్లి, తల్లి నిన్ను నమ్మడం లేదు..నిన్ను మేమెందుకు నమ్మాలి.?
-తల్లి చెల్లితో ప్రచారం చేయించుకుని…ఇప్పుడు ఇంటి నుండి గెంటేశాడు
-షర్మిల, సునీత జగన్ నుండి ప్రాణహాని ఉందని డీజీపీకి లేఖ రాశారు
-తల్లి, చెళ్లెల్లకు రక్షణ కల్పించలేనోడు రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కల్పిస్తాడా.?
-జగన్ కూతుర్లు విదేశాల్లో చదవచ్చుకానీ, మన గిరిజన బిడ్డలు విదేశాల్లో చదవకూడదా?
-పుష్పశ్రీవాణి జీవో నంబంర్-3పై ఎందుకు జగన్ ను నిలదీయలేదు?
-జగన్ ను చూస్తే కోడికత్తి .. చంద్రబాబును చూస్తే కియా కార్లు గుర్తొస్తాయి
-2019లో టిక్ టాక్ ఆంటీని మీరు గెలిపించారు
-జగన్ సైకో..ఒక సద్దామ్ హుస్సేన్
-కురుపాం శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర..ఉద్యమాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర. ఇక్కడి ప్రజల రకత్తంలోనే కష్టపడే తత్వం ఉంది. దేశంలో ఏ మూలకు వెళ్లినా ఉత్తరాంధ్ర వాసులు కనబడతారు. రాజులు ఏలిన గడ్డ ఈ ఉమ్మడి విజయనగరం జిల్లా. శ్రీ పైడితల్లి అమ్మవారు వెలిశారు. మన్యం వీరుడు అల్లూరి నడిచిన పుణ్యభూమి ఈ ఉమ్మడి విజయనగరం జిల్లా. మంచి మనసుతో ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తాం..అలాంటి మంచిమనసున్నవారు ఉన్న గొప్పనేల ఉమ్మడి ఉమ్మడి విజయనగరం జిల్లా. ఉమ్మడి విజయనగరం జిల్లా వాసులకు రాజకీయ చైతన్యం ఎక్కువ. ఇంత పవిత్రమైన భూమికి వచ్చి మీ ముందు నేను మాట్లాడటం అదృష్టం.
జగన్ కు ఒక శాపం ఉంది..నిజం చెప్తే తన తల వెయ్యి ముక్కులు అవుతుంది. ఎన్నికల ముందు మహిళలకు అనేక హామీలిచ్చాడు. సంపూర్ణ మధ్య నిషేధం చేశాకే ఓట్లు అడుగతా అన్నాడు..మరి మధ్య నిషేధం చేశాడా.? 45 ఏళ్లు నిండిన ప్రతి ఎష్టీ మహిళలకు పెన్షన్ ఇస్తా అన్నాడు..ఇచ్చాడా.? మోసానికి ప్యాంటు, షర్ట్ వేస్తే ఎలా ఉంటుందో అందుకు జగన్ ప్రత్యక్ష ఉదాహరణ. అధికారంలోకి వచ్చాక 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నాడు. యేటా 6 వేల పోలీస్ నియామకాలు చేస్తానన్నాడు..చేశాడా.? అవేమీ చేయకపోగా టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ రద్దు చేశాడు. బీసీ విద్యార్థులకు కూడా స్టడీ సర్కిల్స్ రద్దు చేశాడు.
విదేశీ విద్య, ఫీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి వాటిని కూడా రద్దు చేశాడు. జగన్ కూతుర్లు విదేశాల్లో చదవచ్చుకానీ, మన గిరిజన బిడ్డలు విదేశాల్లో చదవకూడదా.? ఎన్నికల ముందు ఏం చెప్పాడు…ఇచ్చిన హామీలు ఆరు నెలల్లో హామీలు నెరవేర్చుతానన్నాడు..కానీ ఎన్నికలకు ఆరు నెలల ముందు కూడా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఎన్నికలు రెండు నెలలు ముందు గ్రూప్ – 2 నోటిఫికేషన్ ఇచ్చాడు. అవికూడా…కేవలం 897 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తానని చెప్పాడు. ఈ897 పోస్టులకు 5 లక్షల మంది పోటీ పడుతున్నారు.
డీఎస్సీ పేరుతో మరో మోసం చేస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పడు 23 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తానని ఇప్పడు కేవలం 6,100 పోస్టులు మాత్రమే నోటిఫికేషన్ వదిలాడు. స్కూల్ రేషనైలేజేషన్ ఉపాధ్యాయుల పోస్టులు తగ్గించాడు. నిరుద్యోగులుకు కూడా హామీ ఇస్తున్నా… టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుంది…యేటా జాబ్ కేలండర్ విడుదలు చేసి క్రమ పద్ధతిన ఉద్యోగాలు భర్తీ చేస్తాం. గిరిజన ప్రాంతాల్లో కేవలం గిరిజనులకు మాత్రమే ఉద్యోగ హక్కు కల్పించేలా నాడు చంద్రబాబు జీవో నంబర్-3ను తీసుకొచ్చారు. దాన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చాక హైకోర్టు కొట్టేసింది. దానిపై జగన్ కనీసం సుప్రీంకు అప్పీల్ కు వెళ్లలేదు.
డిప్యూటీ సీఎంగా పని చేసిన పుష్పశ్రీవాణి జీవో నంబంర్-3పై ఎందుకు జగన్ ను నిలదీయలేదు.? ఎస్టీ సోదరులకు హామీ ఇస్తున్నా టీడీపీ ప్రభుత్వం వచ్చాక మళ్లీ జీవో నంబంర్-3 ని అమలు చేస్తాం. జగన్ ను చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడు. కోట్లు ఖర్చు పెట్టి యాత్ర -2 సినిమా తీయించాడు. సొంత పార్టీ కార్యకర్తలే ఈ యాత్ర సినిమా వైసీపీకి అంతిమ యాత్ర అంటున్నారు అర్జునుడు, అభిమన్యుడు అని బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు. ఇతను సైకో..ఒక సద్దామ్ హుస్సేన్ లాంటి వాడు.
జగన్ కు రంగులన్నా, బొమ్మలు వేయడమంటే హహా ఇష్టం. టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లకు రంగులు వేసుకుంటున్నాడు. అన్నక్యాంటీపన్ కు రంగులు వేసుకుని సచివాలయాలు పెట్టుకున్నాడు. మీ పూర్వీకులు ఇచ్చిన భూముల రిజిస్ట్రేషన్ కాగితాలపైనా జగన్ బొమ్మ వేసుకుంటున్నాడు. ఈ మధ్య జగన్ మళ్లీ నేను మీ బిడ్డను అంటున్నాడు..మీరంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. జగన్ మీ బిడ్డ అంటున్నాడని అతని ట్రాప్ లో పడొద్దు. మీ బిడ్డను కదా..మీ భూములు కూడా రాసివ్వండిన చెప్తాడు. రోజుకో నాటకం..రోజుకో డ్రామా చేసే వ్యక్తి ఈ జగన్. వెయ్యి కోట్ల ఖర్చుపెట్టి సిద్ధం అని ప్లెక్సీలు వేస్తున్నాడు.
దేనికి సిద్ధం..ఇసుకను బంగారం చేయడానికి సిద్ధమా.? ప్రజల్ని వేధించడానికి సిద్ధమా జగన్.? బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రాగోల్డ్ మద్యం ధరలు పెంచడానికి సిద్ధమా.? చంద్రబాబులా ఇమేజ్ పెంచుకోవడానికి జగన్ తాపత్రయ పడుతున్నాడు..కానీ అది అసాధ్యం. చంద్రబాబు అంటే బ్రాండ్..జగన్ అంటే జైలు. జగన్ ను చూస్తే కోడికత్తి గుర్తొస్తుంది..కానీ చంద్రబాబును చూస్తే కియా కార్లు గుర్తొస్తాయి. చంద్రబాబు విజనరీ..జగన్ ప్రిజనరీ. చంద్రబాబు పేదలకోసం పని చేస్తే..జగన్ పెత్తందారుల కోసం పని చేస్తున్నాడు.
చంద్రబాబుపై దొంగకేసులు పెట్టి అర్థరాత్రి అరెస్ట్ చేశారు. అరెస్టు చేసినప్పుడు స్కిల్ డెవలెప్మెంట్లో రూ.3 వేల కోట్ల కుంభకోణం అన్నాడు..తర్వాత రూ.3 వందల కోట్ల కుంభకోణం అన్నారు..ఇప్పుడు రూ.27 కోట్ల కుంభకోణం అంటున్నారు. చంద్రబాబుపై ఛార్జ్ షీట్ ఇస్తే ఇదేం ఛార్జ్ షీట్ అని కోర్టు కూడా చీకొట్టింది. నిజాయితీకి మారు పేరు చంద్రబాబు. బాంబులకే భయపడని కుటుంబం మాది..ఇలాంటి చిల్లర కేసులకు భయపడతామా.? ఎక్కడ చూసినా మా నమ్మకం నువ్వే జగన్ అని బోర్డులు పెడుతున్నారు. సొంత చెల్లి, తల్లి నిన్ను నమ్మడం లేదు..నిన్ను మేమెందుకు నమ్మాలి.? ఎన్నికల్లో గెలవడానికి తల్లి చెల్లితో ప్రచారం చేయించుకుని…ఇప్పుడు ఇంటి నుండి గెంటేశాడు.
షర్మిల, సునీత జగన్ నుండి ప్రాణహాని ఉందని డీజీపీకి లేఖ రాశారు. తల్లి, చెళ్లెల్లకు రక్షణ కల్పించలేనోడు రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కల్పిస్తాడా.?
టీడీపీ-జనసేన కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే పేటియం కుక్కలను వదులుతున్నారు. సొంత చెల్లి వ్యక్తిత్వంపై దెబ్బకొడుతున్నాడు. ఆమె పెళ్లిపైనా విమర్శలు చేయిస్తున్నాడు. పాలన సరిగా చేయండని షర్మిల చెప్తే వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నాడు. విద్యుత్ చార్జీలు 9 సార్లు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు, ఇంటి పన్ను, చెత్తపన్ను, పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలు పెంచారు. ఇంట్లో కుక్కకు కూడా పన్ను వేస్తాడు ఈ జగన్. ఎవర్నీ వదలకుకండా బాదుతున్నాడు.
అన్న క్యాంటీన్, విదేశీ విద్య, పెన్షన్లు, రైతులకు డ్రిప్, సబ్సీడీలు కూడా రద్దు చేశాడు. దేశ చరిత్రలో 100 సంక్షేమ పథకాలు రద్దు చేసిన ఏకైక సీఎం ఈ సైకో జగన్. ఏపీకి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్. ఎస్టీలు ఇబ్బందుదుల పడుతున్నారని ఐటీడీఏ, ట్రైకార్ ఏర్పాటు చేశాడు. చంద్రబాబు వందలాది సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. బీమా, విదేశీ విద్య, అన్న క్యాంటీన్ లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చారు. చంద్రబాబు, పవన్ కలిసి సూపర్ – 6 ప్రకటించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నాం. ఉద్యోగం రాకపోతే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం.
తల్లికి వందన ద్వారా యేటా రూ.15 వేలు, 18-59 ఏళ్ల మధ్యనున్న మహిళలకు నెలకు రూ.15 వందలు, యేటా 3 గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించబోతున్నాం. రైతులకు పెట్టుబడిసాయంగా యేటా రూ.20 వేలు అందించబోతున్నాం. ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్. మూడు రాజధానులు పేరుతో మూడు ముక్కలాటలాడుతున్నాడు. ఇక్కడి యువకులను అడుగుతున్నా ఒక్క పరిశ్రమైనా ఉత్తరాంధ్రకు తీసుకొచ్చడా..ఒక్క ఉద్యోగమైనా ఇచ్చాడా.? ప్రజల నుండి పన్నుల ద్వారా డబ్బులు లాక్కుని రూ.500 కోట్లతో రుషికొండపై ప్యాలెస్ కట్టుకున్నాడు.
విశాఖ ఉక్కు..ఆంధ్రలు హక్కు. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కానివ్వం…రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించేలా చేస్తాం. అధికారంలెకి వచ్చాక విశాఖ రైల్వే జోన్ కు భూమి కేటాయిస్తాం. విజయనగరం జిల్లాకు జగన్ 50 హామీలిచ్చాడు. భోగాపురం విమనాశ్రయం పూర్తి చేస్తానన్నాడు..రామతీర్థం ప్రాజెక్టూ పూర్తి చేస్తాన్నాడు. జంఝావతి-చంపావతి నదులు అనుసంధానం చేస్తానని చెప్పాడు. రామభద్రాపురంగడ్డ పూర్తి చేస్తానన్నాడు చేశాడా.?
సాలూరు బైపాస్, పాలేరు నదిపై డ్యాం నిర్మిస్తాననన్నాడు…స్వర్ణముఖిచింతగడ్డపై బ్రిడ్జి నిర్మస్తానన్నాడు…చేశాడా..చేయలేదు. అందుకే జగన్ నిజం మాట్లాడితే తన తల వెయ్యి ముక్కలు అవుతంది. ఉమ్మడి విజయనగరం జిల్లాను అభివృద్ధి చేసింది టీడీపీనే. పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు ఇచ్చాం. భోగాపురం ఎయిర్ పోర్టుకు భూ సేకరణ, రోడ్లు, టిడ్కో ఇళ్లు, కాల్వల ఆధునీకరణ చేశాం. కురుపాంలో టీడీపీ గెలవకపోయినా వందల కోట్లతో అభివృద్ధి చేశాం.తోటపల్లి ప్రాజెక్టుకు రూ.450 కోట్లు కేటయించి సాగు, తాగు నీరు అందించాం. 33 ఎస్టీ గ్రామాలకు నిధులు కేటాయించి బీటీ రోడ్లు వేశాం. సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు నిర్మించాం.
కానీ 2019లో టిక్ టాక్ ఆంటీని మీరు గెలిపించారు. పుష్ఫశ్రీవాణిని మీరు గెలిపిస్తే ముగ్గురు ఎమ్మెల్యేలను ఆమె మీకు ఇచ్చింది. పుష్పశ్రీవాణి, తమ్ముడు, భర్త కలిసి కురుపాంను దోచుకుంటున్నారు. ఔట్ సోర్సింగ్ నుండి కాంట్రాక్ట్ పోస్టులు దాకా అన్నీ అమ్ముకుంటున్నారు. నాగావళి నది నుండి ఇసుక దోచుకుంటున్నారు. టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుకు వెయ్యి ఉంటే ఇప్పడు రూ.5 వేలు అయింది. ఆర్ అండ్ బి, ఐటీడీఏ, ఉపాధి పనులు ఎమ్మెల్యే మరిది రమేష్ బాబు చూసుకుంటున్నాడు. పుష్పశ్రీవాణికి మీరు రెండు సార్లు అవకాశం ఇచ్చారు..మీ జీవితాల్లో మార్పులు వచ్చాయా. గ్రామాల్లో ఏమైనా మార్పు వచ్చిందా..మీకు ఆదాయం పెరిగిందా.?
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించండి. పూర్ణపాటు లావేసి బ్రిడ్జి పూర్తి చేస్తాం. ఏనుగుల వల్ల రైతులు నష్టపోతున్నారు..ఆ సమస్యను పరిష్కరిస్తాం. గుమ్మడి గడ్డ మినీరిజర్వాయర్ పూర్తి చేస్తాం. తోటపల్లి ప్రాజెక్టు అదనపు ఆయకట్టుకు నీరందిస్తాం. జంఘావతి-వట్టిగడ్డ ఆధునీకరణ పనులు పూర్తి చేస్తాం. జీవో నంబర్-3ను మళ్లీ అమలు చేసి ఎస్టీలకు ఉద్యోగాలు కల్పిస్తాం.
గిరిజనుల గొంతును జగన్ కోసేశాడు. 16 సంక్షేమ పథకాలు గరిరిజనులకు రాకుండా రద్దు చేశాడు. టీడీపీ – జనసేన అభ్యర్థిని గెలిపిచండి మళ్లీ 16 పథకాలు అమలు చేస్తాం. టీడీపీ బలం కార్యకర్తలే. నాయకులు పార్టీ మారినా కార్యకర్తలు పార్టీకి అండగా ఉన్నారు. కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ప్రమాద బీమా అందించాం. వందకోట్లు ఖర్చు చేశాం. కార్యకర్తలు ప్రమాదంలో చనిపోయినా, కార్యకర్తలను చంపేసినా వారి పిల్లలను నా తల్లి భువనేశ్వరి చదివిస్తున్నారు.
నాడు నేడు ఎప్పుడూ మీకు అండగా ఉంటా. ఎంత ఆలస్యమైనా సాయంత్రం నా సెల్ ఒకసారి చూసుకుంటా. దొంగ కేసులు పెట్టి నా కార్యకర్తలను జగన్ అరెస్టు చేయించారేమో అని చూస్తాను. కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారు. నాపైనా అక్రమ కేసులు పెట్టారు..అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు పెట్టారు. కార్యర్తలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా…2014 నుండి 19 వరకకు ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వారికే నామినేటెడ్ పదవి ఇస్తా. జగన్ పెట్టే చిల్లర కేసులకు భయపడం. కొందరు అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బంది పెడుతున్నారు…అందరి పేర్లు ఎర్రబుక్ లో ఉన్నాయి.
ఎర్రబుక్ దెబ్బకు వైసీపీ నేతలకు ఉచ్చపడుతున్నాయి. నాపైన కోర్టుకు వెళ్లి నాన్ బెయిలబుల్ జారీ చేయాలని చెప్తున్నారు. నేను ఇక్కడే ఉన్నా..జగన్ లా పారిపోయేవాన్ని కాదు. నేను తప్పు చేస్తే పరదాలు కట్టుకునేవాన్ని. తప్పు చేసిన వారందరి పేర్లు ఎర్రబుక్ లో ఉన్నాయి. ఎన్టీఆర్ దేవుడు..చంద్రబాబు రాముడు..వైసీపీ మూకలకు లోకేష్ మూర్ఖుడు. క్లస్టర్, యూనిట్, బూత్, మండల అద్యక్షులకు పిలుపునిస్తున్నా…సూపర్ – 6 పథకాలు ప్రతి ఇంటికి చేరాలి. 5 రోజుల్లో 250 గడపల్లో తిరిగి వివరించాలి.
చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో పవనన్న ఏపీకి రావడానికి విమానం బుక్ చేసుకుంటే రద్దు చేశారు. రోడ్డు మార్గాన వస్తుంటే రాకుండా అడ్డుకున్నారు. చంద్రబాబును జైల్లో కలిసిన మరుక్షణమే కలిసి పోటీ చేయాలని పవన్ నిర్ణయించారు. రెండు పార్టీల మధ్య విభేధాలు తెచ్చేందుకు పేటియం కుక్కుల రెడీగా ఉంటాయి. అన్నింటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. మన నినాదం ఒక్కటే హలో ఏపీ…బైబై వైసీపీ.