-
భారీ భద్రత మధ్య కూల్చివేతలు
-
కోట్లలో విలువ చేసే చెరువును కాజేసే ప్రయత్నం
-
చెరువు భూమిలో అక్రమ లేఅవుట్
-
బహదూర్పురా ఎంఐఎం ఎమ్మెల్యే జోక్యం… అరెస్ట్
రంగారెడ్డి: హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) ఆక్రమణలపై ఉక్కుపాదం మోపేలా ప్రభుత్వ ఆస్తులు, కాలువలు, చెరువులను కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు శివరాం పల్లి, రాజేంద్రనగర్లో అక్రమ లేఅవుట్ను గుర్తించారు, ప్రభుత్వ సర్వే రికార్డులు మరియు సర్వే నంబర్ ప్రకారం అది బన్రుద్దీన్ కౌలా చెరువుగా గుర్తించబడింది, హైడ్రా అధికారులు ప్రొసీజర్ ను అనుసరించి చెరువుపై ఉన్న లీగల్ నిర్మాణాలను కూల్చివేయడం ప్రారంభించారు.
అక్రమ లే అవుట్ యజమానికి మద్దతుగా వచ్చిన బహదూర్పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ ను ముందస్తు అరెస్ట్ చేశారు.