Suryaa.co.in

Features

ప్రజాస్వామ్యంలో వ్యక్తి లేదా సంస్థ కోసం రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయకూడదు

– దత్తాత్రేయ హోసబాలే జీ

అత్యవసర సమయంలో (1975–1977) దేశం యొక్క పరిస్థితులు,ప్రభుత్వ అణచివేత విధానం,సంఘ్ పాత్రపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కి చెందిన సహకార్యవాహ దత్తాత్రేయ హోసబాలేతో విశ్వ సంవాద కేంద్రం ప్రత్యేక సంభాషణ దాని ముఖ్యాంశాలు

దేశ చరిత్రలో అప్పట్లో ఎమర్జెన్సీ పోరాటాన్ని రెండో స్వాతంత్య్ర పోరాటంగా చాలా మంది పేర్కొన్నారు.నేటికీ అది కనిపిస్తుంది, ఇది సరైన పోలికే. పరాయి పాలనకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం జరిగింది,స్వాతంత్య్ర ఉద్యమం జరిగింది. కానీ దేశంలోని మన సొంత వాళ్లే రాజ్యాంగంలోని నిబంధనలను దుర్వినియోగం చేశారు.,దేశ ప్రజల గొంతును అణిచివేసి, జయప్రకాష్ నారాయణ్ లాంటి పెద్దపెద్ద వ్యక్తులను అణచివేసే పని కూడా జరిగింది. అంతేకాకుండా సాధారణ ప్రజలు అణచివేయబడ్డారు, అందువల్ల, ఒక కోణం నుండి, దీనిని రెండవ స్వాతంత్ర్య పోరాటం అని పిలవవచ్చు.

ఈ ఎమర్జెన్సీ ఎందుకు జరిగింది, అని చూస్తే… అసలు దేశంలో ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుంది, దేశం అభద్రతలో ఉన్నప్పుడు. కానీ ఒక వ్యక్తి లేదా పార్టీకి హానికలిగుతుందనో లేదా అస్థిరంగా ఉందనో వారు రాజ్యాంగంలోని నిబంధనను ఉపయోగించుకుని రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ఎమర్జెన్సీని ఏర్పాటు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ జరగకూడదు.

ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగం కల్పించిన పౌరుల ప్రాథమిక హక్కులు రద్దు చేయబడ్డాయి. అందులో భాగంగానే ప్రసంగం చేయడం, రాయడం, అభిప్రాయం వ్యక్తీకరణ, భావప్రకటనా స్వేచ్ఛ, సంస్థాగత స్వేచ్ఛ మొదలైనవి లేవు.

ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయం అత్యవసర పరిస్థితి-
విశ్వ సంవాద కేంద్రంతో జరిగిన ప్రత్యేక సంభాషణలో 1975లో జరిగిన అత్యవసర పరిస్థితి గురించి RSS సర్ కార్యవాహ జీ పై వ్యాఖ్యలు చేశారు. వారు మాట్లాడుతూ నలభై ఎనిమిది సంవత్సరాల కిందటి జరిగిన సంఘటనలను గుర్తు చేసుకోవడం కొంచెం కష్టమే, కానీ ఎమర్జెన్సీ, దానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం అసలు మరిచిపోలేనిది. ఆ పోరాటంలోని ప్రతి సంఘటన గుర్తుపెట్టుకోవాల్సిందే.

నేను అప్పుడు బెంగళూరు యూనివర్సిటీలో ఎంఏ విద్యార్థిని. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర స్థాయి కార్యకర్తగా నేను కూడా ఉద్యమంలో పాల్గొన్నాను. అవినీతికి వ్యతిరేకంగా, నిరుద్యోగాన్ని అంతం చేయడానికి, విద్యావ్యవస్థలో మార్పు తీసుకురావడానికి పోరాటం సాగింది. తర్వాత మే చివరి వారం నాటికి దేశంలో విద్యార్థి యువ సంఘర్ష్ సమితి, దేశవ్యాప్తంగా జనతా సంఘర్ష్ సమితి, విద్యార్థి జన్ సంఘర్ష్ సమితి ఏర్పడింది. అవి రెండూ కూడా ఉద్యమానికి వేదికలయ్యాయి.

జూన్ నెలలో మూడు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. ఈ మూడింటి ఫలితంగా ఎమర్జెన్సీ విధించారు. అందులో ఒకటి జూన్ ప్రారంభం నాటికి, జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో జరిగిన ఉద్యమం దేశవ్యాప్తంగా తీవ్రతరం అయింది. రెండవది గుజరాత్‌లో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ ఎన్నికలలో ఆమె ఓడిపోయింది. జూన్12న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్‌మోహన్ లాల్ సిన్హా రాయ్ బరేలీ నుంచి ఇందిరా గాంధీ లోక్‌సభ ఎన్నికల విజయాన్ని రద్దు చేశారు.

ఇలా న్యాయపరంగానూ, రాజకీయంగానూ, ప్రజల మన్నలను దక్కించుకోవడంలోనూ ఇలా ఇందిరాగాంధీ ఇలా మూడు రంగాల్లోనూ ఓడిపోయారు. అందుకే ఈ విపరీతమైన పరిస్థితిని ఏర్పరిచారు. 25జూన్‌లో రాత్రి ఎమర్జెన్సీని ప్రకటించారు. ఆ రోజుల్లో మొబైల్ లేదు, టీవీ లేదు. ఆనాటి పరిస్థితిని అర్థం చేసుకోవడం నేటి ప్రజలకు అంత తేలిక కాదు. 50సంవత్సరాల క్రితం, భారతదేశంలో టీవీ లేదు, కంప్యూటర్లు లేవు. ఈ-మెయిల్, మొబైల్ ఈనాటివి, అప్పుడు లేవు.

కాబట్టి మాకు ఆ వార్త కూడా బీబీసీ ఇంకా ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రకటన వెలువడిన వెంటనే తెలిసింది. మాకు ఉదయం 6 గంటలకి వచ్చే వార్తల నుండి వార్త వచ్చింది. ఆ సమయంలో నేను ఇతర మిత్రులు అందరూ కలిసి బెంగళూరులోని గాంధీ నగర్, సంఘ శాఖలో ఉన్నాం. మేము శాఖకు వెళుతుండగా మాకు వార్త తెలిసింది. పార్లమెంటరీ కమిటీ పని కోసం అటల్ జీ, అద్వానీ జీ, మధు దంద్వతే జీ ఇంకా ఎస్ఎన్ మిశ్రాజీ బెంగళూరు వచ్చి అక్కడే ఉన్నారు. శాఖ ముగిసిన వెంటనే మేము వారిని కలవడానికి వెళ్లాం.

అప్పుడే అటల్ జీ, అద్వానీ జీ స్నానం చేసి అల్పాహారం తినడానికి కిందకు వస్తున్నారు. మేము వారికి ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చిందని చెప్పాం. బహుశా అప్పటి వరకు వారికి తెలిసి ఉండవచ్చు, ఉండకపోవచ్చు అని భావించి మేము చెప్పాం. వారు అడిగారు ఎలా తెలిసింది అని మేము రేడియోలో విన్నాం అని చెప్పాము. వెంటనే అద్వానీ జీ అన్నారు యూఎన్ఐ, పిటిఐ న్యూస్ ఏజెన్సీలకు కాల్ చేయండి, దీన్ని వ్యతిరేకించడం కోసం మనం ఫోన్ ద్వారా మాత్రమే స్టేట్‌మెంట్ ఇవ్వాలి అని.

ఆసమయంలో అటల్ జీ అద్వానీ జీ తో అన్నారు, మీరేం చేస్తున్నారని అప్పుడు అద్వానీ జీ నేను దీన్ని వ్యతిరేకిస్తూ ప్రకటనని ఇస్తున్నాను అని చెప్పారు. అప్పుడు అటల్ జీ అన్నారు ఆ ప్రకటనని ఎవరు ప్రింట్ చేస్తారు అని, ఎందుకంటే ఎమర్జెన్సీ ప్రకటించిన వెంటనే ప్రెస్‌ సెన్సార్‌ ఏకకాలంలో జరిగిందని, ఆ తర్వాతి రోజు కూడా ఆ ప్రకటనను ఎవరూ ముద్రించబోరని అటల్‌జీకి తెలిసింది.

కొద్దిసేపటికే పోలీసులు వచ్చి అటల్‌జీ, అద్వానీ జీ, ఎస్ఎన్ మిశ్రా జీ ముగ్గురిని అరెస్టు చేసి హైగ్రాన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై మిసా వేశారు. మేమందరమూ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళాము. పోలీసుల వాంటెడ్ లిస్ట్ లో మేము కూడా ఉన్నాం. మా అందరిపై కూడా మీసా చట్టం పెట్టాలని చూశారు. దాంతో మేము అండర్ గ్రౌండ్ లోకి వెళ్లాల్సి వచ్చింది. నేను డిసెంబర్ వరకు కూడా అండర్ గ్రౌండ్ లోనే ఉండాల్సి వచ్చింది.

ఆ సమయంలో కొందరిని డిఐఆర్, మరికొందరిని మిసా చట్టం కింద ఇలా రెండు చట్టాల్లో అరెస్టు చేశారు.డిఐఆర్ చట్టంలో డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్‌లో కోర్టుకు వెళ్లి అక్కడ వాదన చేసి నిర్దోషిగా విడుదల కావచ్చు. అలాంటి నిబంధన ఉంది. కానీ మీసాలో అలాంటి నిబంధన లేదు.

ఎంతలాగా అంటే న్యాయం కోసం కనీసం కోర్టుకు వెళ్లే హక్కు కూడా లేదు. ఆసమయంలో అన్ని ప్రాథమిక హక్కులను తీసివేయడం వల్ల మీసా చట్టం కింద అరెస్టు చేయబడిన వ్యక్తులకు ఏమైంది అనేది వారి ఇంటి వాళ్లకు కూడా తెలియాల్సిన అవసరం లేదు. అలాంటి నిబంధన ఉంది.

ఆ సమయంలో ఫోన్ చేయడానికి లేదు, కలవడానికి కూడా లేదు. అలాంటి సమయంలో ప్రజలకు, కార్యకర్తలతో సమన్వయం ఏర్పరచడానికి సంఘ, మరియు సంఘ అనుబంధ సంస్థలు పనిచేశాయి. సంఘటితం చేయడానికి ఇంటింటికి వెళ్లి అందరితో సమన్వయం కావడం అనే పద్ధతి చాలా ఉపయోగపడింది. ఇంటింటికీ వెళ్లి అందరినీ కలవడం అనేది సంఘంలో ఎప్పటి నుంచో ఉంది. ఎమర్జన్సీ సమయంలో ఇది ఉపయోగపడింది. అది ఎలా ఉపయోగపడింది అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి.

ఉదాహరణకు, రవీంద్ర వర్మ జీ బెంగళూరుకు వచ్చినప్పుడు, అతన్ని ఎక్కడ ఉంచాలి మరియు పోలీసులకు తెలియకుండా ఎలా ఉంచాలి? వారిని రైల్వే స్టేషన్ నుంచి తీసుకుని రావడం, తిరిగి వారిని క్షేమంగా వెనక్కి పంపడం ఇలాంటి పనులన్నీ ఎవరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా చేశాం. సంఘ్ కార్య‌క‌ర్త‌ల‌లో ఇంటింటికీ వెళ్లడంలాంటి పద్ధతే ఇందుకు కార‌ణం.

ఇక రెండో విషయం ఏంటంటే ,ఏం జరుగుతుందో ప్రజలకు తెలియలేదు, ఎందుకంటే సెన్సార్ కారణంగా ప్రభుత్వ అనుమతితో ప్రచురించిన వార్తలే తప్ప వార్తాపత్రికలు వేరే ఏ వార్తలను ప్రచురించలేదు.ఎవరిని ఎక్కడ అరెస్టు చేశారు,ఎవరికి ఏమైంది,ఎవరూ తెలుసుకోలేకపోయారు. కాబట్టి అండర్ గ్రౌండ్ లో సాహిత్యాన్ని ముద్రించడానికి జర్నలిస్టులందరితో కలిసి విజయవంతమైన ప్రణాళిక తయారు చేయబడింది. అది అమలు చేయబడింది.ఎమర్జెన్సీ సమయంలో అండర్ గ్రౌండ్ లో ఇలా పనిచేయడం అనేది మరో గొప్ప విజయం,

హచ్.వీ. శేషాద్రి దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలలో సాహిత్య ప్రచురణకు మార్గదర్శకత్వం వహించారు. వారు బెంగళూరు కేంద్రంగా పనిచేశారు. అప్పుడు వివిధ చోట్ల ప్రెస్‌ల కోసం వెతుకుతూ, రాత్రిపూట ప్రెస్‌లో పని చేయాల్సి వచ్చేది. ఇక రాత్రిపూట ప్రెస్ లో పనిచేస్తున్నప్పుడు శబ్దం రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేది. రెండు పేజీలు, నాలుగు పేజీల మ్యాగజైన్‌లను ముద్రించడం, దానిలో వార్తా అంశాలు, దేశంలోని ఇతర ప్రాంతాలలో ఏమి జరుగుతోంది,దాని గురించి సమాచారాన్ని సేకరించి రాయడం జరిగేది.

అసలు ఈ సమాచారాన్ని అండర్ గ్రౌండ్ లో పనిచేసే వివిధ వ్యక్తుల నుండి, బయటకు వెళ్లిన వారి నుంచి తెప్పించేవారు. ప్రత్యేకంగా సమాచారాన్ని రాబట్టడం కోసం కొందరు బయటకు వెళ్లేవారు. ఒకరకంగా చెప్పాలంటే జర్నలిస్టులానే అండర్ గ్రౌండ్ వర్క్ చేసేవారు. ఉదాహరణకు, అండర్ గ్రౌండ్ పత్రికలు కర్ణాటకలో, మహారాష్ట్రలో వివిధ పేర్లతో నాలుగు చోట్ల ముద్రించబడ్డాయి. మరాఠీలో, కన్నడలో, తెలుగులో, హిందీలో.. ఆయా రాష్ట్రాల్లో పేర్లుకూడా వేరుగా ఉండేవి.

ఇందులో రెండు రకాల పనులు చేశేవారు. కొందరేమో ప్రింటింగ్ ప్రెస్ లలో రాత్రంతా కలిసి పనిచేసి ఒక వెయ్యి కాపీలను ముద్రిస్తే , మరికొందరు తెల్లవారుజామున 3.30-4.00 నుండి 5.00 గంటల మధ్య మరియు రోడ్డుపైకి వెళ్లి ఇంటి గేటు దగ్గర పెట్టడం మొదలైన పనులు చేశారు.

ఇక మూడవ విషయం , ఎవరైతే అరెస్టు అయి జైలులో లేదా పోలీసు స్టేషన్లలో ఉన్నారో వారిని హింసించేవారు. అణిచివేసేవారు. వారు తప్పు చేయకపోయినప్పటికీ వారు జైలులో ఉండాల్సిందే. అలా జైలులో ఉండటం వల్ల చాలా మంది జీవనోపాధి దెబ్బతింది. ఇంట్లో సంపాదించే వారు లేకపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

అలాంటి సమయంలో వారికి ఆసరాగా నిలబడడం, వారి బాగోగులు చూడడం, పిల్లలరక్షణ అనేది చాలా పెద్ద పని. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజల గొంతును వినిపించడానికి సత్యాగ్రహం కోసం చేసిన ప్రణాళికను విజయవంతం చేయడానికి ఈ నాలుగు పనులు ప్రణాళికతో చేసారు.ఇది అతి ముఖ్యమైన పోరాటం. ఈ నాలుగు పనులను ప్రణాళికతో చేయడం వల్ల ఆరోజుల్లో విజయవంతం అయ్యాయి.

అయితే కొన్నిసార్లు అనిపిస్తుంది క్రూరత్వాన్ని కూడా గుర్తుంచుకోవాలి అనీ ,సంఘ్ యొక్క మూడవ గౌరవనీయ సర్ సంఘ చాలక్ బాలాసాహెబ్ దేవరస్ జీ ఎమర్జెన్సీ తర్వాత చాలా ముఖ్యమైన ప్రకటన చేశారు. తన బహిరంగ ప్రసంగంలో అన్నారు.

మీరు వాళ్లను క్షమించవచ్చేమో, మర్చిపోవచ్చేమో, కానీ దేశ చరిత్రలో, తీవ్ర అణచివేత, దౌర్జన్యాలు చోటుచేసుకున్న చీకటి అధ్యాయం చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఈ విషయంపై చాలా పుస్తకాలు వచ్చాయి. ప్రముఖమైన వ్యక్తులు, సంస్థలు కూడా సాహిత్యాన్ని ప్రచురించాయి. అందువలన, అది చరిత్రపుటల్లో నిలిచిపోయింది.

క్రూరత్వం, అమానవీయం చాలా విస్తృతమైన సాక్ష్యంగా ఆ సంఘటన జరిగింది. మన దేశంలో పోలీసు-పరిపాలన వ్యవస్థ కూడా క్రూరత్వాన్ని ప్రదర్శించగలదు అనేలాగా ఒక అనుభవం ఎమర్జెన్సీ సమయంలో జరిగింది. రెండు చేతులను కట్టి పై నుంచి లాగి ఆ సమయంలో వీపుపై కర్రలతో కాళ్లపై కొట్టేవారు.

అప్పట్లో క్రూరత్వం మూడు రకాలుగా ఉండేది. పోలీస్ స్టేషన్‌లో అరెస్టు చేసిన వ్యక్తి లాకప్‌లో ఉంటే,వారిని జైలుకు పంపే ముందు చాలా హింసించేవారు. ఆ సమయంలో, ఆంధ్రప్రదేశ్ (ప్రస్తుతం తెలంగాణ) కు చెందిన ఒక కార్యకర్త శరీరంపై సుమారు 100 చోట్ల కొవ్వొత్తితో కాల్చారు కొబ్బరికాయ లోపల కీటకాలను ఉంచి నాభి పైన కట్టారు.

దీన్ని పోలీసుల భాషలో ఏరోప్లేన్ అంటారు. గోలీ అంటారు, చపాతీ అంటారు.ఇలా ఇవన్నీ వివిధ రకాల హింసలు. వ్యక్తిని కూర్చోబెట్టి అతన్ని చుట్టేయడం,విద్యుత్ షాక్ ఇవ్వడం, లేదా శరీరం అంతా గుండు పిన్నులను చొప్పించడం ఇలా దారుణమైన అఘాయిత్యాలను చేసేవారు.

ఇలా మూడు లేదా నాలుగు రోజులు పోలీసుల దగ్గర లాకప్ లో దారుణమైన చిత్రహింసలు అనుభవించిన తర్వాత జైలుకు వచ్చిన తర్వాత పది పదిహేను రోజుల వరకు శరీరాన్ని మసాజ్ చేయాలి. ఇదంతా నేను కూడా చేశాను.ఈ అమానవీయ దురాగతాల వల్ల కొంతమంది జీవితాంతం వికలాంగులయ్యారు. కొందరు ఏదో ఒకరకమైన వ్యాధితో జీవనం గడిపారు. ఇదంతా మన కళ్ల ముందే జరిగింది.

ఎవరైతే చిత్రహింసలు అనుభవించారో వారి నోటి నుంచి ఒక్క పదం కూడా ప్రభుత్వానికి అనుకూలంగా రాలేదు. వారు ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం నుంచి వేరు కాలేదు. వారు వారి ఇంటి వ్యక్తులను కూడా ఈ ఉద్యమం నుంచి వేరు చేయలేదు. కర్ణాటకలో పోలీస్ స్టేషన్ లోనే రాజు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఇలాంటి లాకప్‌డెత్ లు, అనేక రకాల చిత్రహింసలు దేశవ్యాప్తంగా చాలా చోట్ల జరిగాయి.

ఆసమయంలో ఓం ప్రకాష్ కోహ్లీ ఢిల్లీలో ఉన్నాడు,రాజ్యసభ సభ్యులుగా ఉండేవారు,వి ద్యార్థి పరిషత్‌కు అఖిల భారత అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.,ఓంప్రకాష్ కోహ్లి నడకలో కాస్త వికలాంగుడైన సంగతి అందరికీ తెలిసిందే.

ఢిల్లీలోని తీహార్ జైలులో పోలీసులు అతడిని తన్నారు. లాకప్‌లో అతనికి తీవ్ర అవమానం జరిగింది. ఆయన కాలేజీ ప్రొఫెసర్. వికలాంగుడు కావడం వల్ల ఆయన నిలబడటం కష్టమైంది. అలాంటి వ్యక్తిని కూడా చిత్రహింసలకు గురిచేశారు. దాదాపు దేశమంతటా ఇదే జరిగింది.

బెంగుళూరులో గాయత్రి మంత్రం జపం చేయడం ద్వారా ఒక మహిళ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేసింది. ఆమెను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లారు.ఆ సమయంలో ఆమె గర్భవతి ,లాకప్‌కు తీసుకెళ్లిన తర్వాత ఆమెకు ప్రసవ నొప్పులు రావడంతో ఆస్పత్రికి తరలించారు.

ఆసుపత్రిలో, ఆమెను మంచం మీద పడుకోబెట్టారు . ఆమె ప్రసవ సమయంలో ఆమె రెండు కాళ్ళకు గొలుసుతో బంధించారు. ఈరోజు ఆ విషయాలను గుర్తు చేసుకుంటే మన మనస్సులో ఒకరకమైన బాధ, కోపం కలుగుతుంది. గర్భిణీ స్త్రీ ఎలా పారిపోతుంది. అంతేకాదు డెలివరీ కోసం, డెలివరీ అయిన తర్వాత కూడా అలా ఆమెను కట్టిపడేయాల్సిన అవసరం ఏముంది.

ఉత్తర భారతదేశంలో స్టెరిలైజేషన్ విస్తృతంగా ఆచరించబడింది. అప్పట్లో ప్రభుత్వాన్ని, పరిపాలనను నడిపే చతుష్టయం ఉండేది. స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు, దేశంలోని జనాభాను నియంత్రించేందుకు అందులోని వ్యక్తులు ఎమర్జెన్సీని దుర్వినియోగం చేసిన విధానం… అత్యంత అమానవీయత మరియు మానవ హక్కులకు వ్యతిరేకంగా చరిత్ర పుటల్లో ఎప్పుడూ నల్ల మచ్చగా ఉంటుంది.

ఆ సమయంలో ఉద్దేశ పూర్వకంగానే జైలులో గొడవలు పెట్టారు. క్రిమినల్ ఖైదీలు కూడా జైలులో ఉండేవారు. రాజకీయ ఖైదీలకు వ్యతిరేకంగా పోరాడేందుకు వారిని ప్రేరేపించారు. వారు అందుకు ఒప్పుకోకపోతే వారిని కొట్టేవారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేసేవారు. దాని ఫలితంగా జైళ్లలో గొడవలు జరిగేవి. బళ్లారి జైలులో జరిగిన గొడవ ఫలితంగా25మందికి చేతులు, కాళ్లు విరిగాయి. నెలల తరబడి ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది.

ఎమర్జెన్సీ సమయంలో ఏవైతే చిత్రహింసలు జరిగాయో, అవి చాలామట్టుకు పోలీసు లాకప్ లోనే జరిగాయి. అవి కూడా స్వయం సేవకులపైనే. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి,అండర్ గ్రౌండ్ లో చురుకైన స్వయం సేవకులు ఎక్కువగా ఉండేవారు,దాంతో బయట తిరగడం వల్ల వారు పట్టుబడ్డారు.

రెండవది వారి ద్వారా మిగితా వారి వివరాలు కూడా తెలుస్తాయని అనుకునేవారు. ఉదాహరణకి, సాహిత్యం ప్రచురణ గురించి అడిగేవారు. ఎక్కడ ప్రింట్ చేయబడింది? లాంటి ప్రశ్నలు అడిగేవారు. వారు ఎన్ని అడిగినా, ఎన్ని చిత్రహింసలకు గురిచేసినప్పటికీ మన స్వయం సేవకులు ఏమీ మాట్లాడేవారు కాదు. దాంతో మరింత ఎక్కువగా వారిని చిత్రహింసలకు గురయ్యేవారు

ప్రజాస్వామ్యం ఉంటూ,,ప్రజాస్వామ్యంలోనే పోరాడాలి.ఆ పోరాటం కూడా అది రాజ్యాంగబద్ధంగా మాత్రమే జరగాలి. తుపాకీ పట్టుకుని విప్లవం చేయడం కాదు. ఆయుధాలు చేపట్టడం, పోరాడి ఎమర్జెన్సీని వ్యతిరేకించడం సరైన పద్ధతి కాదు. కమిటీ స్పష్టమైన ఉద్దేశం అలాంటిదే. ప్రజలను హింస మార్గంలో నడిపించకండి, ఇది స్పష్టంగా నిర్దేశించబడింది. సత్యాగ్రహం అంటే ఎలా చేశారు అంటే ఏదైనా వీధి మూలలో లేదా ఏదైనా ప్రదేశంలో,బస్ స్టాండ్ వద్ద,రైల్వే స్టేషన్ వద్ద,వీలైనంత ఎక్కువ మంది రావాలి.

ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేయాలి. ఇది మా డిమాండ్ అంటూ నినదించాలి. అలా సత్యాగ్రహం చేసేవారిని పోలీసులు వచ్చి పట్టుకున్నారు. అంతేకాకుండా వీలైనంత వరకు సాహిత్య కరపత్రాలను అందజేయడం కూడా అందులో భాగమే,ఎందుకంటే ఆసమయంలో వేరే మార్గం లేదు. అందుకే సత్యాగ్రహానికి వెళ్లేటప్పుడు జేబులో, సంచిలో అందరికీ ఇవ్వడానికి కరపత్రాలు పెట్టుకునేవారు.

ఈ ఎమర్జెన్సీని ప్రజలు ఆమోదించలేదు,ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ప్రజాస్వామ్యం అణచివేయబడింది. కాబట్టి దానికి వ్యతిరేకంగా అనేక మంది పోరాడారు,సత్యాగ్రహం యొక్క ప్రధాన లక్ష్యాలలో ఇది ఒకటి.దాదాపు ప్రతిచోటా 49వేలకు మందికి పైగా సత్యాగ్రహులు అరెస్టయ్యారు.

అన్ని పోరాటాలలో సంఘ ,జయప్రకాష్ నారాయణ్ ఉద్యమంలో మరియు తరువాత ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటంలో కలిసి పనిచేసింది.దాంతో సంఘను అణిచివేయడానికి ప్రయత్నించారు. ఇది ప్రధానమైనది. దాదాపు 25సంస్థతో పాటు సంఘ్‌ను కూడా నిషేధించారు. కాబట్టి ఇలా సంఘను నిషేధించడం మరియు సంఘను అణచివేయడం పట్ల ప్రభుత్వ పెద్దలకు, నాయకుల, ప్రధానికి స్పష్టమైన లక్ష్యం ఉంది.

సంఘ్‌ను అణచివేయడానికి కార్యకర్తలకు సూచించడంతో పాటు వారు ఎక్కడ కలుసుకున్నా ఆ కార్యాలయాలని మూసివేసేవారు. సంఘ కార్యాలయాన్ని ముట్టడించారు, కార్యాలయానికి తాళం వేశారు, కార్యాలయం లోపల కార్యకర్తల అడ్రస్లు ఉన్న డైరీలు తీసుకుని వారి ఇళ్లకు వెళ్లేవారు. ప్రభుత్వ లేదా కళాశాలలో సంఘ కార్యకర్తలు ఉంటే, వారికి ఉద్యోగంలో ఒత్తిడి తెచ్చి సస్పెండ్ చేశారు.

చాలా మంది స్వయంసేవకులు రోజువారి శాఖలో పాల్గొనలేకపోయేవారు. అలాంటి వారు ఎప్పుడో వచ్చి శాఖలో పాల్గొనేవారు. వారికి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇంట్లో ఇబ్బందుల వల్ల రోజుశాఖకు రాలేకపోయేవారు. ఎమర్జెన్సీ సమయంలో ఇలాంటి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉండడం సంఘకు తోడైంది. ఎందుకంటే వారు రోజు వెళ్లకపోడంతో డైరీలో వారిపేరు రాయబడలేదు. దాంతో పోలీసులు వారి ఇళ్లకు వెళ్లలేకపోయేవారు. ఆ సమయంలో క్రియాశీలకంగా మారారు.

వారు మా పేర్లు పోలీసుల జాబితాలో లేదు కాబట్టి మా ఇంటిని మీరు ఉపయోగించుకోండి. అండర్ గ్రౌండ్ కార్యకర్తలు మా ఇంట్లో ఉంటారు, భోజనం చేస్తారు,ఎందుకంటే మా ఇంటికి పోలీసులు రాలేదు. ఇలా వివిధ కార్యకర్తలు ధైర్యం చెప్పారు. వారి వైపు నుంచి అన్ని రకాల సహకారం అందించారు. ఇతర సంస్థలు,ఇతర పార్టీ,కార్యకర్తలకు కూడా సంఘ కార్యకర్తలు సహాయం చేశారు.

కర్ణాటకలో ఇద్దరు సర్వోదయ కార్యకర్తల ఇంట్లో పరిస్థితి బాగాలేనప్పుడు,సంఘ కర్యకర్తలు వారికి ఏర్పాట్లు చేశారు. పోరాటానికి అవసరమైన నిధులు,మన సంఘ కార్యకర్తలు సేకరించారు.

ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్యం,అక్కడ ప్రజల గొంతును అణిచివేసేందుకు,అణచివేయడానికి ఏ ప్రయత్నమూ ఎంతోకాలం విజయవంతం కాదు. కొంతకాలం అణిచివేయడానికి ప్రయత్నించవచ్చు. ఈ ఇరవై నెలల అత్యవసర పరిస్థితిఅలాంటిదే. శాశ్వతంగా అణిచివేయలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల గొంతు ఎప్పటికైనా ఎత్తవచ్చు,

ఎమర్జెన్సీపై పోరాటం ఎందుకు విజయవంతమైంది, అంటే ప్రజలలో చైతన్యం మరియు సంస్థాగత నాయకత్వం ఆ సమయంలో ప్రజలకు సరైన మార్గనిర్దేశం చేసింది. ముఖ్యంగా ఆ ఉద్యమంలో విద్యార్థులు,యువత ఉద్యమం ఒక మార్పు కోసం దేశవ్యాప్త ఉద్యమానికి దారితీసింది.

అందుకే దేశంలోని యువకులకు దేశం పట్ల, సమాజం పట్ల అవగాహన కల్పించాలి. సరైన దిశను నిర్ణయించడంలో బలమైన శక్తి అవసరం,ఇది ఎల్లప్పుడూ వారికి శిక్షణ అందించాలి,కాబట్టి ఆ శక్తి సమాజానికి ఎల్లప్పుడూ రక్షణ కవచం అవుతుంది .,ఆశాదీపంలా తయారవుతుంది.

జైలులో ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యాంపులా పరిగెత్తేవాళ్లం.డిఐఆర్‌లో ఎవరి కేసులు నడుస్తాయి, వాళ్ళు15రోజుకు లేదా నెలలో చాలాసార్లు జైలు నుండి బయటకు వచ్చేవారు ,బెయిల్ అందుబాటులో ఉండేది.మీసాలో,ఛార్జ్ షీట్ లేదు, కోర్టు లేదు. కాబట్టి మిసా చట్టం కింద అరెస్టు అయిన వారి జీవనశైలి భిన్నంగా ఉండేది. మిసా చట్టం కింద అరెస్టు అయితే ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు, ఎప్పుడు లోపలకి వెళ్తారో తెలియదు.

జైలులో బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఉండేవి. ఆ రోజుల్లో ఆ చట్టం మాత్రమే పని చేసేది. కార్యకర్తలు జైలులో కూడా ఆ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడారు.,చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశేవారు. వారు దానికి వ్యతిరేకంగా సత్యాగ్రహ ఉద్యమం అంటే లోపల ఉపవాసం చేసేవారు. దీని కారణంగా పరిపాలన కొన్ని చట్టాలను మార్చవలసి వచ్చింది.

మరోవైపు, సొలిసిటర్ జనరల్ నిరేన్ డే సుప్రీంకోర్టులో వాదించారు మరియు అతని వాదనను సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది. ఆయన వాదన ఏంటంటే దేశ భద్రత కోసం ప్రజలను MISA కింద అరెస్టు చేశారు.వారిపై ఎలాంటి ఛార్జ్ షీట్ లేదు మరియు ఎంతకాలం జైలులో ఉండాలి అన్నదానికి ఎలాంటి హామీ లేదు.వారు జీవితాంతో జైలులో ఉండాలనేది వారు వాదించారు. వాదన పూర్తయింది, అలాగే దేశ భద్రత కోసం జైల్లోనే కాల్చి చంపినా.. ప్రభుత్వంపై నేరం లేదు.ఇది రెండో వాదన.

ఇది రాజ్యాంగాన్ని సవరించడం కాదు, ఇక్కడ రాజ్యాంగాన్ని సవరించడం లేదు,ఇది రాజ్యాంగాన్ని అంతం చేస్తోంది అని లోక్ సభ సభ్యుడు కామత్ వ్యాఖ్యానించారు.

రాజ్యాంగాన్ని ప్రభుత్వం ఏం చేసింది అంటే,ఇది దాదాపు రాజ్యాంగానికి ముగింపు పలికింది. వారు రాజ్యాంగాన్ని సవరించారు ,రాజ్యాంగ ప్రవేశికలో సెక్యులరిజం మరియు సోషలిజం, రెండు పదాలను చొప్పించారు.ఇంతకు ముందు ఇవి లేవు. ఆ సమయంలో రాజ్యాంగాన్ని తారుమారు చేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. ఐదేళ్ల లోక్‌సభ పదవీకాలం ఆరేళ్లకు పెంచారు. అంటే ఏడాదికి పెంచేసారు. జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాలన్నీ మళ్లీ సరిదిద్దబడ్డాయి.

నేను ఎప్పుడూ చెబుతాను,ప్రజాస్వామ్యం సురక్షితం,మన దేశ పార్లమెంటరీ వ్యవస్థ, రాజ్యాంగం మొదలైన వాటి వల్ల అది సురక్షితంగా ఉంది.అయితే అంతకు మించి మేలైన సమాజం ,వారిని మేల్కొనేలా పని చేసే సమాజం యొక్క రాజకీయేతర నాయకత్వం అంటే వారి నిస్వార్థత, దేశభక్తి బాధ్యత వహిస్తుంది. ఇలాంటి వారికి సమాజం ప్రజలు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. అందుకే దేశం కోసం ఇలాంటి నాయకత్వం సమాజంలోని ప్రతి రంగంలోనూ ఉండాలి. అదే దేశానికి భరోసా.

(vsktelangana.org)

LEAVE A RESPONSE