– వసతులు, ఉపాధ్యాయులు లేని పాఠశాలలు, అధ్యాపకులు, విద్యార్థులు లేని కళాశాలలు తప్ప ఏమున్నది గొప్ప?
• విద్యారంగంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిస్తే, 7.50లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వపాఠశాలలకు ఎందుకు గుడ్ బై చెప్పారు జగన్ రెడ్డి?
• సొంత నియోజకవర్గంలోని వేముల ప్రభుత్వజూనియర్ కళాశాలలో ఒక్క విద్యార్థి ఎందుకు ఉత్తీర్ణుత సాధించలేదో ముఖ్యమంత్రి చెప్పాలి
• విద్యాశాఖపై బొత్స అనాసక్తితో ఉన్నారు. విజయనగరం జిల్లా ‘పది’ ఫలితాల్లో వెనుకంజలో నిలవడమే అందుకు నిదర్శనం
– టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి రెడ్డి
రాష్ట్రవిద్యావ్యవస్థను అథమస్థాయికి చేర్చిన ముఖ్యమంత్రి, నాడు-నేడు, అమ్మఒడితో విద్యావ్యవస్థలో గొప్ప సంస్కరణ లు తీసుకొచ్చామని చెప్పుకుంటున్నాడని, ఈ విద్యా సంవత్సరంలో 7.50 లక్షలమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల లకు గుడ్ బై చెప్పి, ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లడంపై జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెబుతాడని టీడీపీ ఎమ్మెల్సీ భూమి రెడ్డి రామ్ గోపాల్ రెడ్డి నిలదీశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ ప్రభుత్వపాఠశాలల్లో సరైన మౌలికవసతులు కల్పించకపోవడం, విద్యాప్రమాణాలు పెంచేదిశగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఘోరంగా విఫలమైంది. విద్యార్థినీ, విద్యార్థులకు సరైనసమయంలో ఫీజురీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్పులు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది.
బోధనేతర అంశాల్లో ప్రభుత్వఉపాధ్యాయులకు పనిభారం పెంచడం కూడా రాష్ట్రవిద్యావ్యవస్థ దిగజారడానికి ప్రధానకారణం. 7.50లక్షల విద్యార్థులు సర్కారుబడులకు స్వస్తిచెప్పడమేనా ముఖ్య మంత్రి విద్యారంగంలో సాధించిన ప్రగతి? ఎన్నికలకు ముందు ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తానన్న జగన్, నేటికి 9,600లకు పైగా పాఠశాలలు ఉండ టంపై ఏం సమాధానం చెబుతాడు?
జాతీయవిద్యా విధానంపేరుతో జగన్ ప్రాథమికవిద్యను సర్వనాశనం చేశాడు
జాతీయ విద్యావిధానం పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రాథమికవిద్యను సర్వనాశనం చేశాడు. 117 జీవోద్వారా ప్రాథమిక విద్యకు పాతరేశాడు. 4,234 ప్రాథమికపాఠశాలల్ని ఉన్నతపాఠశాలల్లో విలీనంచేసిన జగన్ నిర్ణయంతో లక్షలాది విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. ఇంటింటికీ రేషన్ బియ్యం, పింఛన్లు ఇస్తున్నానని గొప్పులు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి, ప్రతి విద్యార్థికి విద్యను అందుబాటులో ఉంచాలనే నిబంధనను విస్మరించడం బాధాకరం.
వసతిదీవెన, విద్యాదీవెన సొమ్ము చెల్లింపులో కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అలానే ప్రభుత్వపాఠశాలల్లో చదువుతూ, వసతిగృహాల్లో ఉండే పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులు డైట్ ఛార్జీలకు కూడా జగన్ ప్రభుత్వం కోతపెట్టింది. టీడీపీప్రభుత్వం ప్రతివిద్యార్థికి ఏడాదికి రూ.19వేలవరకు డైట్ ఛార్జీలు చెల్లిస్తే, జగన్మోహన్ రెడ్డి ఆ మొత్తాన్ని రూ.10, రూ.12వేలకే పరిమితంచేశాడు. పదోతరగతి, ఇంటర్మీడియట్లో ఉత్తమప్రతిభ కనబరిచిన వారికి తానేపురస్కారాలు ఇస్తున్నట్టు జగన్ డబ్బాలు కొట్టుకుంటున్నాడు.
టీడీపీప్రభుత్వంలో చంద్రబాబు ఏ.పీ.జే.అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల పేరుతో విద్యార్థినీ విద్యార్థులకు ప్రతిభాపురస్కారాలు అందించారు. జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లపాలనలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ దిగజారిందని కేంద్రప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ర్యాంకింగ్స్ వర్క్ లో ఏపీ దేశంలోనే అట్టడుగు స్థానంలో నిలిచింది. 2019వరకు టీడీపీ ప్రభుత్వం పీజీ విద్యార్థులకు ఫీజురీయింబర్స్ మెంట్ అందించింది.
జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఉన్నతచదువులు చదివేవారికి ఫీజు రీయింబర్స్ మెంట్ ఎత్తేశాడు. దానిప్రభావంతో ఇంటర్, డిగ్రీతో చదువుకు స్వస్తిచెప్పే వారి సంఖ్య పెరిగింది. పదోతరగతి ఫలితాల్లో విజయనగరం జిల్లా అట్టడుగు స్థానంలో ఎందుకు నిలిచిందో విద్యాశాఖమంత్రి బొత్స సమాధానం చెప్పాలి.
డిగ్రీ కళాశాలల్లో ప్రభుత్వం నిర్ణయించిచన ఫీజులతో 3లక్షలమంది విద్యార్థులు నష్టపోయారు.
రాష్ట్రంలో దాదాపు 1100డిగ్రీ కళాశాలల్లో ఫీజు రెగ్యులరైజేషన్ విషయంలో ప్రభుత్వం అవకతవకలకు పాల్పడింది. వైసీపీనేతలకు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవారికి చెందిన కళాశాలల్లో ఒకరకమైన ఫీజులు, ఇతరకాలేజీల్లో మరోరకంగా ఫీజు నిర్ణయించ డంతో దాదాపు 3లక్షలమంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు.
రాష్ట్రంలోని అన్ని వి శ్వవిద్యాలయాల్లో దాదాపు 700వరకు ఖాళీలున్నాయి. సరైన అధ్యాపకులు, బోధనేత ర సిబ్బందిలేకపోవడంతో విశ్వ విద్యాలయాల్లో విద్యాభ్యాసానికి విద్యార్థులు ఆసక్తిచూప డంలేదు. కస్తూర్బా విద్యాలయాలు, గురుకులపాఠశాలల్లో సరైన ఉపాధ్యాయులు లేకుండాపోయారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులస్థానంలో సరైనవిద్యార్హతలులేనివారు పాఠ్యాంశాలు బోధిస్తుండటంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోంది.
నాడు-నేడు పేరుతో రూ.16వేలకోట్ల ప్రజలసొమ్ము కాజేసి, నాసిరకంగా పనులుచేశారు. సొంత నియోజకవర్గంలోని వేముల ప్రభుత్వజూనియర్ కళాశాలలో ఒక్క విద్యార్థి ఎందుకు ఉత్తీర్ణతసాధించలేదో ముఖ్యమంత్రి చెప్పాలి.
ప్రభుత్వపాఠశాలల్ని కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామని ప్రగల్భాలు పలుకుతున్న ముఖ్యమంత్రికి, అరకులోయ పట్టణంలోని ప్రభుత్వకళాశాల దుస్థితి కని పించడంలేదా అని ప్రశ్నిస్తున్నాం. బడుగు బలహీనవర్గాల బాలికలు విద్యనభ్యసించే డిగ్రీకళాశాల భవనం పెచ్చులూడిపోతుంటే, ప్రభుత్వానికి, విద్యాశాఖమంత్రికి కనిపించ లేదా?
నాడు-నేడు పథకం కింద దాదాపు రూ.16వేలకోట్లతో నాసిరంగా పనులు చేయ బట్టే, రాష్ట్రంలోని అనేక పాఠశాలలు, కళాశాలల్లో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. పులివెందులనియోజకవర్గంలోని వేముల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత ఏడాది ఒక్కవిద్యార్థికూడా ఎందుకు ఉత్తీర్ణతసాధించలేదో జగన్మోహన్ రెడ్డే సమాధానం చెప్పాలి. సొంతనియోజకవర్గంలోని పాఠశాలలు, కళాశాలల్ని పట్టించుకోని ముఖ్యమంత్రి రాష్ట్ర విద్యారంగాన్ని ఉద్ధరించానని చెప్పడం సిగ్గుచేటు. విద్యారంగ అభివృద్ధిలో జగన్ మాటలు తెంపరిమాటలేనని తేలిపోయింది.
పాఠశాలల నిర్వహణకు కేంద్రప్రభుత్వమిచ్చే నిధుల్ని జగన్ దారిమళ్లిస్తున్నాడు
మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయఖాళీలన్నీ భర్తీచేస్తానన్న జగన్, నాలుగున్నరేళ్ల లో ఎందుకు ఆపనిచేయలేదు? పాఠశాలల నిర్వహణకు కేంద్రప్రభుత్వమిచ్చే నిధుల్ని కూడా జగన్ ప్రభుత్వం దారిమళ్లిస్తోంది. గతఏడాది దాదాపు రూ.122కోట్లను ప్రభు త్వం ఇతరఅవసరాలకు వినియోగించింది. అమ్మఒడి కింద ఏటా ప్రతివిద్యార్థికి రూ.15 వేలు ఇస్తానన్న జగన్, నాలుగేళ్లు పూర్తయ్యసరికి అటు విద్యార్థులసంఖ్యలో, ఇటు ఇస్తున్న సొమ్ములో కోతపెట్టి, తల్లులకు గుండెకోత మిగిల్చాడు.
కడప డీఈవో రాఘవ రెడ్డి వ్యవహారశైలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశవిధానాలకు అద్దంపడుతోంది. ఈ నెల 15వ తేదీన ప్రభుత్వపాఠశాలల ఉపాధ్యాయులు ఎలాంటి ఆందోళనలు, నిరస నలు, ధర్నాలు చేయడానికి వీల్లేదని, అలా వ్యవహరించేవారిపై చర్యలుతీసుకుంటామ ని ఉత్తర్వులిచ్చాడు. ఉపాధ్యాయులు, విద్యార్థులు వారిసమస్యలు, ఇతరత్రాకారణాల తో ఆందోళనలుచేస్తే, వారిపై కఠినచర్యలు తీసుకుంటామని డీఈవో రాఘవరెడ్డి చెప్పడం దుర్మార్గంకాదా?
ప్రభుత్వటీచర్లు, విద్యార్థులపై చర్యలుతీసుకునే అధికారం డీఈవో కు ఎవరిచ్చారు. వైసీపీనేతల సభలు, సమావేశాలకు ఉపాధ్యాయులు, విద్యార్థుల్ని తరలించి నప్పుడు డీఈవోకి నిబంధనలు గుర్తురాలేదా? ఏ జిల్లాలో, రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జీవోలిస్తున్న డీఈవోపై స్థానిక కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎవరి అనుమతితో డీఈవో ఒక్క కడప జిల్లాలో జీవోలు ఇస్తున్నాడో ప్రభుత్వం తక్షణమే సమాధానంచెప్పాలి. జగన్ విద్యావ్యవస్థను నాశనంచేస్తున్న తీరుపై మేథావులు, విద్యావేత్తలు, ప్రజాసంఘాలు స్పందించాలి.” అని రామ్ గోపాల్ రెడ్డి విజ్ఞప్తిచేశారు.