Suryaa.co.in

National

తమిళనాడులో కిలో టమోటా రూ.70లకే..!

సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
చెన్నై: ప్రస్తుతం మన దేశంలో పెట్రోల్, వంట గ్యాస్ ధరలు మండిపోతున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు వీటి ధరలు పెరగడమే తప్ప ఏనాడు తగ్గిన దాఖలాలు లేవు. ఇలాంటి తరుణంలోనే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టమోటా ధరలు… సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. కిలో టమోటా ధర 130 రూపాయలు ఇప్పటికే దాటేసింది. కొన్ని ప్రాంతాల్లో కేజీ టమోటా ధర రూ. 150 కూడా దాటేసింది.
ఇలాంటి తరుణంలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కిలో టమాట 70 రూపాయలకే ప్రజలకు ఇవ్వాలని అని అధికారులు కు ఆదేశాలు జారీ చేశారు సీఎం స్టాలిన్. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కిలో టమాట ధర 150 రూపాయలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం స్టాలిన్. ప్రభుత్వ దుకాణాల్లో సబ్సిడీ లో టమాటాలు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తాజాగా సీఎం స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయంతో తమిళనాడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A RESPONSE