Suryaa.co.in

Andhra Pradesh

“ఒక అన్వేషి ప్రయాణంలో.. నాకు కాస్తంత చోటు..!

– శ్రీపాద శ్రీనివాస్

వి.గోపీచంద్ … ఆకాశవాణి – హైదరాబాద్ కేంద్రంలో ఉన్నతాధికారిగా పనిచేసిన వ్యక్తి..

చక్కనైన అనేక రేడియో కార్యక్రమాలకు రూపకల్పన చేసిన విజ్ఞాని…. వ్యవసాయరంగ పరిజ్ఞానంలో ఓ శిఖరమే.. !
అంతేనా.. అనేకమంది ఔత్సహిక కళాకారులకు చేయూతను ఇచ్చిన వారధి.
వారిచే ప్రోత్సాహంపబడి లబ్ధి పొందిన వారిలో నేను ఒకడ్నే..!

ఈరోజు (07.11.2023) హైదరాబాద్ లో జరిగిన వారి పుస్తకం ” ఒక అన్వేషి ప్రయాణం” పుస్తక ఆవిష్కరణ సభలో గోపీచంద్ నాపై ఆప్యాయత జల్లును కురిపించారు.

సుమారు 170 పేజీలు వున్న ఆ పుస్తకంలో నా రచనకు కూడా అవకాశం కల్పించారు.

డా. బి.అర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్ మరియు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ డా. చక్రపాణి వంటి పెద్దల చేతుల మీదుగా, ఆకాశవాణి – దూరదర్శన్ – ప్రసార భారతి ఉన్నతాధికారుల సమక్షంలో సభ వేదికపై సదరు పుస్తకాన్ని నాకు ప్రజెంట్ చేశారు. తద్వారా మరపురాని ఓ అనుభూతిని నాకు మిగిల్చారు.

LEAVE A RESPONSE