Suryaa.co.in

Andhra Pradesh

దళితుల్ని చంపిన, దూషిస్తున్న వైసీపీ నేతల్ని, వారికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రిని వచ్చేఎన్నికల్లో చావు దెబ్బకొడతాం

• దళితుల్ని కిరాతకంగా చంపి, వారిని దూషిస్తున్న వారికి ముఖ్యమంత్రి అండగా నిలవడం దళితజాతిని అవమానించడంకాదా?
• వైసీపీఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కళ్లం హరికృష్ణారెడ్డి, పంచ్ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్లు దళితుల్ని దారుణంగా దూషిస్తున్నా ముఖ్యమంత్రి స్పందించకపోవడాన్ని ఏమనుకోవాలి?
• 2024 ఎన్నికల్లో ఏ దళితకాలనీల్లో వైసీపీజెండాలు పట్టుకోకుండా దళితుల్ని చైతన్యంచేస్తాం.
• వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేకరించిన ప్రజలవ్యక్తిగత వివరాలు అనామక ఏజెన్సీలకు ఇచ్చే హక్కు, అధికారం ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు?
– టీడీపీ అధికారప్రతినిధి మహాసేన రాజేష్

పోలీసుల సమక్షంలో, వారి భద్రత నడుమ హంతకులు సభలు పెట్టే దుస్థితి వచ్చిం దని, రంపచోడవరం సమీపంలోని కూనవరంలో వైసీపీఎమ్మెల్సీ అనంతబాబు, వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మరొకరు అతనితమ్ముడని, వీళ్లందరూ గతంలో దళిత యువకుల్ని కిరాతకంగా చంపడం బెదిరించడం చేశారని టీడీపీ అధికారప్రతినిధి మహాసేన రాజేష్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ వైసీపీఎమెల్సీ అనంతబాబు గతంలో తనవద్ద డ్రైవర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపేసి, అతని శవాన్ని అతనింటివద్దే పడేసి, గర్భవతిగా ఉన్న మృతుడి భార్యను బెదిరించాడు. అధికారపార్టీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, తన ఇసుకమాఫి యాను ప్రశ్నించాడన్న అక్కసుతో వరప్రసాద్ అనే దళితయువకుడికి పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేయించి, చావుబతుకుల్లో ఉన్న అతన్ని అతనితల్లివద్ద పడేశాడు.

జక్కంపూడి రాజా సోదరుడు ఇటీవలే వైసీపీలోని శెట్టిబలిజ వర్గానికిచెందిన రామ కృష్ణ అనే యువకుడిని చంపేస్తానని బహిరంగంగానే బెదిరిం చాడు. ఇలాంటి ముగ్గురు కరుడుగట్టిన నేరస్తులతో పోలీసులరక్షణలో సభలు పెట్టించడం ద్వారా ముఖ్యమంత్రి ఏం సంకేతాలు ఇస్తున్నాడు?

ముఖ్యమంత్రి ఇచ్చిన ధైర్యంతోనే, దళితుల్ని చంపి, వారిని అవమానించి, వేధిస్తున్నవారు పోలీసుల రక్షణలో సభలు పెట్టగలిగారు
దళితుల్ని చంపి, వారిని అవమానించినవారు బహిరంగసభలు పెట్టడంపై రాష్ట్రవ్యాప్తం గా దళితవర్గం ఆగ్రహం వ్యక్తంచేసినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. జగన్ రెడ్డి అండ తో సభలోనే వైసీపీఎమ్మెల్సీ అనంతబాబు దళితసంఘాలు, నేతల్ని హెచ్చరించాడు. నా సభను అడ్డుకునే అర్హత, దమ్ము, ధైర్యం రాష్ట్రంలో ఏదళితుడికిలేదని, అలా అడ్డుకుంటే వారు ఎక్కడా రాష్ట్రంలో సభలు, సమావేశాలు పెట్టుకోలేరని హెచ్చరించాడు. పోలీసులసమక్షంలో అనంతబాబు దళితులకు సవాల్ విసిరినా, జగన్మోహన్ రెడ్డి తన తమ్ముళ్లను వారించలేదు.

ఇటీవలే కంతేరులో కళ్లం హరికృష్ణారెడ్డి అనే వైసీపీ కా ర్యకర్త దళితుల్ని చావచితగ్గొట్టాడు.అప్పటికి అతనికసి చల్లారక, కొట్టినవారిపైనే పోలీ సులతో తప్పుడు కేసులుపెట్టించాడు. దళితులకు జరిగిన అన్యాయంపై కొన్నిపార్టీల నేతలు కంతేరువెళ్లి బాధితుల్ని పరామర్శించి, వారితో హరికృష్ణారెడ్డిపై ఎస్సీఎస్టీ కేసు పెట్టించారు. దాంతో జగన్ రెడ్డి మరోతమ్ముడు, అమెరికాలో ఉండే పంచ్ ప్రభాకర్ రెడ్డికి కోపమొచ్చింది. హరికృష్ణారెడ్డిపై కేసుపెట్టించే దమ్ము, ధైర్యం వచ్చాయా.

కంతేరు దళి తులకు అండగా నిలిచిన దళితనేతలతోపాటు, యావత్ దళితజాతినే నానా ఛండాలం గా దూషించాడు. ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని, దళితులపుట్టుకను నిర్భయంగా దూ షించాడు. అయినాకూడా వైసీపీప్రభుత్వంలోని దళితులుగానీ, జగన్ గానీ అతన్ని వారించలేదు. గతంలో చంద్రబాబు అనని మాటల్ని అన్నట్టు ప్రచారంచేసి, దళితుల్ని రెచ్చగొట్టి, వారిఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, నేడు తనపార్టీవారితో దళితుల్ని హత్యచేయించడం, అత్యాచారాలు, వేధింపులు, దాడులకు పాల్పడేలా వారి ని ప్రోత్సహించడం చేస్తున్నాడు.

కూనవరం బహిరంగ సభలో వైసీపీఎమ్మెల్సీ అనంతబాబు చేసిన సవాల్ ను స్వీకరిస్తున్నాం
కూనవరంసభలో అనంతబాబు దళితుల్ని ఉద్దేశించి చేసిన సవాల్ ను మేం స్వీకరిస్తు న్నాం. దళితల్ని చంపి, వారిని దూషిస్తూ ఎగిరెగిరిపడుతున్న అనంతబాబులాంటి వైసీపీనేతలు ఎవరికీ వచ్చేఎన్నికల్లో డిపాజిట్లుకూడా రాకుండా చేస్తామని హెచ్చరిస్తు న్నాం. నేనే దళితయువకుడిని చంపానని ఒప్పుకున్న ఒకనేరస్తుడు, పోలీసుల రక్ష ణలో పబ్లిగ్గా దళితుల్ని తూలనాడి సవాల్ విసిరితే, రాష్ట్రంలోనికోటి మంది దళితులు చూస్తూ ఊరుకోవాలా?

అనంత బాబు బహిరంగంగానే మా ధైర్యం, మా అండ జగనన్నే అంటున్నాడు. దాన్నిబట్టే అనంతబాబు, జక్కంపూడిరాజా, హరికృష్ణా రెడ్డి, పంచ్ ప్రభాకర్ రెడ్డి లాంటివాళ్లు దళితుల్ని ధైర్యంగా దూషిస్తూ, కాలర్ ఎగరేసుకొని తిరగగలుగుతున్నారు. తన తమ్ముళ్లైన అనంతబాబు, ప్రభాకర్ రెడ్డి, జక్కంపూడి రాజాలాంటి వాళ్ల నిర్వాకాలతో జగన్ రెడ్డికే నష్టం జరుగుతోంది. అలాంటి వెధవల్ని కాపాడుతూ, తన గొయ్యి తానే తీసుకుంటున్నాడు.

దళితులపై జరిగే దారుణాల్ని, అరాచకాల్ని ప్రపంచానికి తెలియకుండచేయడానికే జగన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నాడు . దానిలో భాగంగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్లను ఏదోఅన్నాడని దుష్ప్రచారం చేయడం. చంద్రబాబు, పవన్ కల్యాణ్ అదిఅన్నారు.. ఇదిఅన్నారని దుర్మార్గంగా విషప్రచారంచేస్తున్న జగన్ రెడ్డికి, గతంలో తానుచేసిన నీతిమాలినప్రచారం గుర్తులేదా అని ప్రశ్నిస్తున్నాం.

చంద్రబాబు సేవామిత్ర యాప్ తో ప్రజలవ్యక్తిగత వివరాలుసేకరిస్తున్నాడని గగ్గోలు పెట్టిన జగన్, వాలంటీర్లతో సేకరించిన ప్రజల వ్యక్తిగతసమాచారాన్ని, ఎవరికి అందిస్తున్నాడు?
సేవామిత్ర యాప్ చంద్రబాబు ప్రవేశపెట్టాడని, దానిలో ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ నంబర్ లాంటివాటిని నమోదుచేస్తున్నారని, దానివల్ల ప్రజల స్వేచ్ఛ, గోప్యత కు భంగం కలుగుతోందని వచ్చీరాని ఇంగ్లీషులో గగ్గోలుపెట్టాడు. మరిప్పుడు తాను చేస్తున్నదేమిటి? ఆనాడు చంద్రబాబు సంక్షేమపథకాల అమలుకోసం అర్హుల్ని గుర్తించడానికి ప్రజల వివరాలు సేకరిస్తే, నేడు జగన్ రెడ్డి తనకక్షసాధింపులు, కుట్రలు, దుర్మార్గాలకోసం వాలంటీర్లను వినియోగించి, ప్రతి ఇంటి వివరాల్ని ఎందుకు సేకరిస్తున్నాడు. నెలలో నాలుగుసార్లు వాలంటీర్లు ప్రజల వేలిముద్రలు, వారి ఫోటోలు ఎందుకు తీసుకుంటున్నారు?

అమాయకులైన నిరుద్యోగయువతను వాలంటీర్లుగా నియమించి , వారికి ముష్టి 5వేల జీతమిస్తూ, వారిద్వారా సేకరించిన సమాచారాన్ని ఏంచేస్తున్నాడో , ప్రజల డేటాను ఎక్కడదాచారో చెప్పాలని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. దానిపై ఆయ న్ని అనరాని మాటలంటారా? వాలంటీర్లను అడ్డంపెట్టుకొని ముఖ్యమంత్రి నుంచి గ్రామ స్థాయి వైసీపీనేతవరకు చేసేదారుణాలు ప్రజలకు తెలియవనుకుంటున్నారా? ప్రజలకు సంబంధించిన డేటా సంఘవిద్రోహశక్తులకు చేరితే జరిగే అనర్థాలు,దారుణాలు మాటల్లో చెప్పలేం. ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీ అనేసంస్థకు ప్రజలడేటా ఇచ్చే అధికారం ముఖ్య మంత్రికి ఎవరిచ్చారు?

సదరుసంస్థ నిర్వాహకుడైన రవీంద్రరెడ్డికి, ముఖ్యమంత్రికి ఉన్న సంబంధం ఏమిటి? వేరే రాష్ట్రాల్లో వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా, అక్కడ జరిగే నేరాలు,ఘోరాలకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటోంది. కానీ 2.50లక్షల మంది వాలం టీర్లుఉండి, వారిద్వారా సేకరించిని ఇంటింటిసమాచారం ప్రభుత్వం వద్ద ఉండి కూడా రా ష్ట్రంలో నేరాలు-ఘోరాలు ముఖ్యంగా ఆడబిడ్డలపై అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.

2024ఎన్నికల్లో దళితులు వైసీపీ జెండా పట్టుకోకుండా వారిని చైతన్యం చేస్తాం
జగన్మోహన్ రెడ్డి ముమ్మాటికీ దళితద్రోహే. చంద్రబాబు దళితులకోసం ప్రత్యేకంగా 27 పథకాలు అమలుచేస్తే, జగన్ వాటిని రద్దుచేశాడు. ఎస్సీ కార్పొరేషన్ ను తుంగలో తొ క్కాడు. దళితవిద్యార్థులకు చంద్రబాబు ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, దళిత యువతకోసం తీసుకొచ్చిన విదేశీవిద్యను రద్దుచేశాడు.

నాలుగున్నరేళ్లలో ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా, ప్రభుత్వఉద్యోగాలు భర్తీచేయకుండా దళిత, బీసీ యువతను నిరుద్యోగులుగా మిగిల్చాడు. భూమికొనుగోలు పథకంతో చంద్రబాబు భూమిలేని దళితులకు భూములుకొనిస్తే, జగన్ వచ్చాక ఇళ్లపట్టాల పేరుతో 11వేల ఎకరాలు లాక్కొని, వారిని రోడ్డునపడేశాడు.

దళితజాతికి ఇంత అన్యాయంచేసిన జగన్ రెడ్డి మీ బిడ్డలకు మేనమామననిచెప్పి దళితుల్ని వంచించాడు. 2024 ఎన్నికల్లో ఏ దళిత కాలనీలోకూడా వైసీపీజెండా ఎగరకుండా చేస్తాం. వైసీపీజెండా పట్టుకోవాలంటే సిగ్గుపడేలా దళితుల్లో చైతన్యం తీసుకొస్తాం.” అని రాజేష్ స్పష్టంచేశారు.

LEAVE A RESPONSE