• స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కుట్రను, పాలకుల కక్షను బయటపెట్టే ఆధారాలు ప్రజల ముందు ఉంచిన తెలుగుదేశం
• స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పరిధిలోని శిక్షణా కేంద్రాల్లోని పరికరాలు, సాఫ్ట్ వేర్ కు సంబంధించిన వీడియోలు, కాలేజీ యాజమాన్యాలు ఇచ్చిన ధృవీకరణ పత్రాలు, సిమెన్స్ సంస్థ ప్రపోజల్స్ ప్రజల ముందు ఉంచుతున్నాం
• ఇవన్నీ పరిశీలిస్తే, ఈ ప్రభుత్వకుట్ర, పాలకులు చంద్రబాబుపై పెంచుకున్న కక్ష ఏస్థాయిలో ఉందో ప్రజలకు అర్థమవుతుంది
– పీఏసీ ఛైర్మన్, టీడీపీ శాసనసభ్యులు పయ్యావుల కేశవ్
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తొలినుంచీ అసత్య ప్రచారం చేస్తూ, న్యాయస్థానా లకు కూడా అసత్యాలు, అర్థసత్యాలే చెబుతోందని, ఈ పరిస్థితుల్లో ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని టీడీపీ శాసనసభ్యులు, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ సూచించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు మూలాధారమని ప్రభుత్వం, సీఐడీ చెబుతున్న ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ ప్రైవేట్ సంస్థ అయిన శరత్ అసోసియేట్స్ చేసింది. సదరు సంస్థ, ఐ.వీ.ఎస్ అసోసియేట్స్ అనే సంస్థ ఒకే కంప్యూటర్ వినియోగిస్తూ, ప్రభుత్వానికి పనిచేస్తున్నాయి. ప్రభుత్వం తమకు అనుబంధంగా పనిచేసే సంస్థతో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో ఆడిట్ నిర్వహించి, కావాలనే కుట్రపూరితంగా వ్యవహరించిందని దీన్నిబట్టే అర్థమవుతోంది.
ఐ.వీ.ఎస్ అసోసియేట్స్ సంస్థ జగన్ రెడ్డికి చెందిన కంపెనీ లైన కార్మెల్ ఏషియా, ఇతర సంస్థల ఆడిట్స్ నిర్వహిస్తూ ఉంటుంది. ఆ సంస్థ ఆడిటింగ్ వ్యవహారాలు నిర్వహించే కంప్యూటర్ ద్వారానే శరత్ అసోసియేట్స్ సంస్థ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆడిట్ కార్యకలాపాలు నిర్వహించి, జగన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పరిధిలోని శిక్షణా కేంద్రాల్లో తొలుత ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించాలని జగన్ సర్కార్ శరత్ అసోసియేట్స్ కు చెప్పింది. తరువాత ఆర్.ఎఫ్.పీ ప్రపోజల్ పెట్టే సమయంలో ఫిజికల్ వెరిఫికేషన్ వద్దని చెప్పారు. ఇక్కడే ప్రభుత్వ దురుద్దేశం అర్థమవుతోంది. శరత్ అసోసియేట్స్ ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టర్ నాలుగు పేపర్లు చదివి, వాటిలో తనకు ఇదిగో ఈ తేడా కనిపించింది అని చెప్పగానే, పోలోమంటూ ఈ ప్రభుత్వం మొత్తం వ్యవహారం నడిపిన అధికారుల్ని వదిలేసి, చంద్ర బాబే తప్పుచేశాడంటూ ఆయన్ని అరెస్ట్ చేయడం కక్షసాధింపు కాక మరేమిటి?
జగన్ ప్రభుత్వం శరత్ అసోసియేట్స్ సంస్థను ఫిజికల్ వెరిఫికేషన్ చేయవద్దని ఎందుకు చెప్పిందంటే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పరిధిలోని 42 శిక్షణా కేంద్రాల్లో సీమెన్స్ సంస్థ ప్రపోజల్ ప్రకారం అన్నిరకాల నట్లు, బోల్టులు, ఆఖరికి గుండుసూదులు కూడా ఉన్నాయి. 42 శిక్షణా కేంద్రాల్లో అన్నిరకాల పరికరాలు, సాఫ్ట్ వేర్, ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఉన్నదని ధృవీకరించే వీడియోలను ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేస్తున్నాం.
దాదాపు 30 గంటల నిడివిగల వీడియోలు పరిశీలిస్తే శిక్షణాకేంద్రాల్లో ఎలాంటి పరికరాలు ఉన్నాయో కళ్లకుకట్టినట్టు కనిపిస్తుంది. అంత నిడివి గల వీడియోలు పరిశీలించడం కష్టమవుతుందని తెలిసి, 42 కేంద్రాల్లోని పరికరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వివరాలను తెలియచేస్తూ 6 నిమిషాల నిడివిగల వీడియోను విడుదలచేస్తున్నాం.
30 గంటల నిడివి గల ఈ వీడియోలు మేం చేసినవి కావు.. ఈ ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో తీసినవే. వీడియోల్లోని పరికరాలు వాస్తవంగా లేవు అనడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే 42 శిక్షణా కేంద్రాల నిర్వాహకులు తమకు అన్నిరకాల పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం అంది నట్టు నిర్దారిస్తూ ధృవీకరణ పత్రాలు అందించారు. అవికూడా మీడియా వారికి అంది స్తున్నాం. వీడియాలు, ధృవీకరణ పత్రాలను ఇటీవల టీడీపీ విడుదలచేసిన వెబ్ సైట్లో కూడా అందుబాటులో ఉంచుతున్నాం.
పరికరాలు, సాఫ్ట్ వేర్ కు సంబంధించి సిమెన్స్ సంస్థ ఇచ్చిన 160 ప్రపోజల్స్ ను కూడా మీడియా ముందు ఉంచాం
ఇంత స్పష్టంగా స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కేంద్రాల్లో అన్నిరకాల పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా..లేదని నమ్మించే ప్రయత్నం ఈప్రభుత్వం చేయడం ముమ్మాటికీ కక్షసాధింపులో భాగమే. వైసీపీప్రభుత్వం వచ్చాక ఆర్జా శ్రీకాంత్ అనే అధికారి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో భాగమైన డిజైన్ టెక్, సిమెన్స్ సంస్థలు అద్భుతపనితీరు ప్రదర్శించాయని ప్రశంసాపత్రం కూడా అందించారు.
వీడియోలు, ధృవీకరణ పత్రాలతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణాకేంద్రాల్లో అందుబాటులో ఉంచాల్సిన పరికరాలు, సాఫ్ట్ వేర్ కు సంబంధించి సిమెన్స్ సంస్థ ఇచ్చిన 160కు పైగా ప్రపోజల్స్ ను కూడా మీడియావారికి అందిస్తున్నాం. ఇంత సమాచారం కళ్లముందు కనిపిస్తున్నా.. ఇంకా తప్పుజరిగిందని ఎలా చెబుతారు?
కేంద్రప్రభుత్వం అద్భుతం అని కొనియాడిన ప్రాజెక్ట్..జగన్ ప్రభుత్వానికి నేరంగా కనిపిస్తోంది
ప్రభుత్వం ముందే అనుకున్న విధంగా శరత్ అసోసియేట్స్ తో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో తూతూమంత్రంగా ఆడిట్ నిర్వహించింది. ఆ సంస్థ, జగన్ సంస్థలకు చెందిన ప్రైవేట్ ఆడిటర్లు కలిసే పనిచేస్తున్నారు అనడానికి ఒకే కంప్యూటర్ వినియోగిం చడమే నిదర్శనం. దానికి సంబంధించిన ఆధారాలు కూడా మీడియావారికి అందిం చాం. వీటన్నింటినీ పరిశీలిస్తే ఈ ప్రభుత్వ కుట్ర ఏమిటో స్పష్టంగా అర్థమవుతోంది. నేడు మీడియా వారికి ఇచ్చిన సమాచారాన్నే రేపు న్యాయస్థానాల ముందు కూడా ప్రవేశపెడతాం.
కేంద్రప్రభుత్వ అధీనంలోని సంస్థలన్నీ కూడా ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అమలుచేసిన విధానాన్ని పరిశీలించాలని కోరుతూ కేంద్రప్రభుత్వ సెక్రటరీ రాసిన లేఖను కూడా త్వరలో బహిర్గతం చేయనున్నాం. కేంద్ర ప్రభుత్వం అద్భుతం అన్నది జగన్ రెడ్డి ప్రభుత్వానికి నేరంగా కనిపిస్తోంది. శరత్ అసోసియేట్స్ ఆడిట్ రిపో ర్ట్ తప్పని మేం తొలినుంచీ చెబుతున్నాం. దానికి సంబంధించిన వీడియోలు నేడు విడుదల చేశాం. శరత్ అసోసియేట్స్ తప్పుచేసిందని ఆ వీడియోలు చూస్తే అర్థమవు తుంది.” అని పయ్యావుల స్పష్టం చేశారు.