రేణిగుంట మండల పరిధిలోని కరకంబాడి లో తిరుపతి రోడ్డు నందు డాక్టర్ వై.యస్.ఆర్ సంజీవిని జనరిక్ మందుల షాపు ను డాక్టర్ వై.యస్.ఆర్ సంజీవిని రాష్ట్ర చైర్మన్ డా. సింగనమల సుమన్ ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలలో ఇప్పటిదాకా 14 జనరిక్ మందుల షాపులను ఏర్పాటు చేశామని, వైద్యానికి పెట్టే ఖర్చు బారం సగం మందుల కొనుగోలు పైనే వుంటుందని, ప్రజల యొక్క వైద్య ఆరోగ్య ఖర్చు ను తగ్గించడానికే డాక్టర్ వై.యస్.ఆర్ సంజీవిని జనరిక్ మందుల షాపులను తీసుకొచ్చామని, ఇక్కడ నాణ్యమైన మందులు 70 శాతం వరకూ రాయితీలతో సరఫరా చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్ నారా మహీంద్రా, ఇస్మాయిల్, ఫార్మసీస్ట్ యోగిత తదితరులు పాల్గొన్నారు.