ధనిక ప్రపంచంలో భారత్‌ దే అగ్రస్థానం

బి. జె. పి. రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్ నాయుడు

భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడలో మైనార్టీ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైనార్టీ మోర్చా ఇంచార్జ్ భాజపా రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఇలాంటి ప్రధానిని పొందడం మన అదృష్టం, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను ఇతర దేశాల ప్రజలు చూసే విధానం మారిపోయింది. ఏ సమస్య వచ్చినా పరిష్కారం కొరకు వెూది ని ఆహ్వానించడం నరేంద్ర మోదీ నాయకత్వానికి నిదర్శనం.

ప్రపంచంలో, భారతదేశం తిరిగి ప్రపంచానికి విశ్వ గురువుగా రూపాంతరం చెందుతుంది, కాబట్టి భారతదేశం 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు దూసుకుపోతుంది. ఇవాళ చూస్తే బ్రిటన్ కూడా వెనక్కి వెళ్లిపోయింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గా అవతరించింది. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ విభాగం చీప్ షేక్ బాజి ప్రదాన కార్యదర్శి సయ్యద్ భాషా , మౌలాలి , తదితర నాయకులు పాల్గొన్నారు. యువత రక్తదానం చేయగా, భవిష్యత్ లో రక్త దానం చేయడానికి సందిగ్ధత తెలియ చేస్తూ, యువకులు నమోదు కొరకు ముందుకు రావడం అభినందనీయం.

Leave a Reply