– G 20 అవగాహన సదస్సు లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్
రాజంపేట : ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల నుద్దేశించి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు మాట్లాడుతూ.. ఒకే భూమి , ఒకే కుటుంబం , ఒకే భవిష్యత్తు అనే ఆలోచన G 20 లక్ష్యం, . 85 శాతం జీడీపీ , 75 శాతం ట్రేడింగ్ , 4.6 బిలియన్ల జనాభా శాతం పరిమాణం జి20 నందు భాగస్వామ్య ,కలిగిన ప్రపంచ దేశాలుకు మన ఆతిధ్యం , మన సాంస్కృతిక విలువల పరిచయం తెలిసే విధంగా 57 చోట్ల సదస్సులు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.
కరోనా ఎదుర్కోవడం , దాని బారి నుండి అనేక దేశాలను కాపాడడంతో మన సత్తా ప్రపంచానికి తెలిసింది.నేడు ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యం బారిన పడితే , భారతదేశం సమర్థ వంతంగా 6.7 శాతం వృద్ధిరేటు సాధిస్తున్నది. విద్యార్థులు వాతావరణ మార్పులను అర్థం చేసుకోవాలి , వాటి పరిరక్షణ కొరకు కృషి చేయాలనీ పిలుపు నిచ్చారు.
అమృతోత్సవాలు జరుపుకొంటున్న తరుణంలో జాతీయ జెండా ఒకవైపు , మరో చేత్తో జి20 జెండా ముందుకెళ్లాలని యువతకు ప్రధాని పిలుపునిచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పురుషోత్తం రెడ్డి , వైస్ ప్రిన్సిపాల్ ILN , అధ్యాపకులు , విద్యార్ధి నాయకుడు అంజాద్ తదితరులు పాల్గొన్నారు.