“మోమి ననఁగ లజ్జించుచుంటి”,
“నేను మసీదు ముతవల్లిని కాను”,
“ముసల్మాను మతము
విడిచి, జందెమ్ము వేయుదు ద్విజుని భంగి”
అని అన్న ఉమర్ ఖయ్యామ్!
“నేను హంసను లోతైన చోటు నుండి ఎగిరి వచ్చాను;
దూసుకుంటూ ఎత్తులకు చేరాలని మనసుపడ్డాను;
నా మర్మాల్ని రక్షించె తోడు లేక కుమిలి పోయాను –
కనుక వాకిలిలో దూరి నే బయటకు దూకుతున్నాను”. (అనువాదం రోచిష్మాన్)
అని ఫార్సీ కవి ఉమర్ ఖయ్యామ్ ఒక రుబాయీని చెప్పాడు. “poetry is abstract” అని ఆదిభట్ల నారాయణ దాసు తెలియజెప్పారు. ఈ మాటలు చెప్పడానికి కారణం ఉమర్ ఖయ్యామ్ కవిత్వం కూడా ఒక కారణం అయుంటుంది.
ఉమర్ ఖయ్యామ్ 18 / 5/ 1048 లో పర్షియా (ఇరాన్) ఖొరస్తాన్ ప్రాంతంలోని నైషాపూర్ లో (నైషా అంటే వెదురు) పుట్టాడు. 1131లో మరణించాడు. ఒక రుబాయీలో తనకు 77యేళ్లు వచ్చాయని ఖయ్యామ్ చెప్పుకున్నాడు.
ఉమర్ ఖయ్యామ్ అన్నది కలం పేరు (తఖల్లుస్). అసలు పేరు గియాత్ ఉద్ దీన్ అబుల్ ఫతహ్ ఉమర్ బిన్ ఇబ్రాహిమ్ అల్ ఖయ్యామ్. ఖయ్యామ్ అంటే గూడారాలు వేసే వ్యక్తి అని అర్థం. గూడారాలు వెయ్యడం వీళ్ల వంశవృత్తి. అందువల్ల అది వంశనామం అయింది. ఖయ్యామ్ వంశస్థులు ఫారశీకులు. బహుశా ఖయ్యామ్ తాత లేదా తండ్రి ఇస్లామ్‌లోకి మారి ఉండచ్చు.
ఖయ్యామ్ అవివాహితుడు. ఈజిప్ట్, అరేబియా, ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్ ప్రాంతాల్లో సంచార జీవనం చేశాడు. ఖయ్యామ్ గణిత, ఖగోళ శాస్త్రవేత్త, జ్యోతిష్కుడు. తత్త్వవేత్త. ‘తఖ్వీమెజలాలీ’ అనే జ్యోతిష గ్రంథం రాశాడు ఖయ్యామ్. ‘అరాయిసన్ నఫాయిస్’ అనే తత్త్వశాస్త్రం, ‘అల్ జబర్’ అనే అరబి (Arabic) గ్రంథం,’ఒఖిలీదస్’ (geomietry), ‘ఇల్మె తబీయాత్'(chemistry), ‘దర్బారయే హుక్మతుల్ ఖాలిఖ్’ అనే వేదాంత శాస్త్రం గ్రంథం, ‘రిసాలా’ ఆర్థికశాస్త్రం గ్రంథం, ‘రిసాలయెమౌనూమా’ ఆనే తర్కశాస్త్ర గ్రంథం ఖయ్యామ్ రచనలు.
ఉమర్ ఖయ్యామ్ అనగానే ప్రపంచానికి గుర్తు వచ్చేవి రుబాయీలే (రుబాయి అనడం తప్పు) తాత్త్వికత, మార్మికత, కవిత్వం మూడిటినీ రంగరించి రుబాయియాత్ (రుబాయతు, రుబైయాత్ అనడం తప్పు)గా ఖయ్యామ్ లోకానికి అందించాడు.
ఉమర్ ఖయ్యామ్ రుబాయీలు 2000 వరకూ దొరికాయి. అందులో కొన్ని ప్రక్షిప్తాలు. వేమన పద్యాలలో లాగా ఖయ్యామ్ రుబాయీలలో కూడా ప్రక్షిప్తాలున్నాయి. స్వామి గోవిందతీర్థ 1096 రుబాయీలు మాత్రమే ఉమర్ ఖయ్యామ్‌వి అని నిర్ణయించి వాటికి ఇంగ్లిష్ , మరాఠీ అనువాదాలు చేశారు. “The Nector Of Grace” పేరుతో ఆయన ఇంగ్లిష్ అనువాదం విడుదలయింది. నిజానికి ఇవే సరైన అనువాదాలు.
1859లో Edward FitZ Gerald తొలి విడతగా 75 ఉమర్ ఖయ్యామ్ రుబాయీలను ఇంగ్లిష్‌లోకి?అనువదించి విడుదల చేశారు. ఇది చాలా ఆలస్యంగా ఇంగ్లిష్ లోకంలో ఆదరణను పొందింది. రెండవ విడతగా 1868 లో 110 రుబాయీలను ప్రకటించారు ఫిట్జ్ జెరాల్డ్. అటుపైన ఉమర్ ఖయ్యామ్ రుబాయీలు విశ్వవ్యాప్తమయ్యాయి.
ఫిట్జ్ జెరాల్డ్ అనువాదాలు సరైనవి కావు. అవి స్వేచ్ఛానువాదాలు. ఆయన అనువాదంలో కనిపిస్తున్న తొలి రుబాయీని ఆయనే మరొక విధంగా కూడా అనువదించారు. ఏ రుబాయీకి ఆ రుబాయీగా సరిగ్గా అనువదించినది స్వామి గోవింద తీర్థ. మనకు ఉమర్‌ఖయ్యామ్ తెలియాలంటే గోవింద తీర్థ అనువాదాన్నే చదవాలి.
ఉమర్ ఖయ్యామ్ రుబాయీలను తెలుగులో ఫార్సీ నుంచి ఏ రుబాయీకీ ఆ రుబాయీగా, పిఠాపురం ఉమర్ ఆలీషాహ్ అనువదించారు. ఈ అనువాదాలు 1926 నుండీ భారతి పత్రికలో ధారావాహికగా అచ్చయ్యాయి. ఇవి తెలుగులో వచ్చిన ఉన్నతమైన ఉమర్ ఖయ్యామ్ రుబాయీల అనువాదాలు. తెలుగులో ఉమర్ ఖయ్యామ్‌ను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఉమర్ అలీ షాహ్ అనువాదాల్నే చదవాలి.
బూర్గుల రామకృష్ణారావు స్వల్ప సంఖ్యలో ఫార్సీ నుండి ఖయ్యామ్ రుబాయీలను తెలుగులోకి తెచ్చారు. దువ్వూరి రామిరెడ్డి పానశాల పేరుతో ఖయ్యామ్ రుబాయీలను అనువదించారు. ఇక ఇతర అనువాదాలు ఫిట్జ్ జెరాల్డ్ ఇంగ్లిష్ నుండి తెలుగుకు వచ్చినవే. అవి 25కు పై చిలుకు ఉన్నాయి. ఆదిభట్ల నారాయణదాసు ఫిట్జ్ జెరాల్డ్ ఇంగ్లిష్ అనువాదాల్ని సంస్కృతంలోకీ, అచ్చతెలుగు (దేశ్యాంధ్రం)లోకీ అనువదించారు.
ఉమర్ ఆలీషాహ్ అనువదించిన ఒక ఉమర్ ఖయ్యామ్ రుబాయీ :
“నీవు జనింపక పూర్వం /బీ వసుధన్ స్త్రీలూఁ, బురుషు లెందఱో కల రా / జీవమె నీలో నున్నది / యీవును నశియింతు వెపుడో యిఁక రా వేఁగన్”.
ఉమర్ అలీషాహ్ అనువదించిన ఇంకొన్ని ఉమర్ ఖయ్యామ్ పలుకుల్ని ఆస్వాదిద్దాం రండి. “వనముల నెఱ్ఱ పువ్వులు నృపాల రణాంగణ వీర రక్త సంజనితములె శోభిత దశన్”, “యే పనికో కాలము చుట్టుచున్నది సర్పంబట్లు జాగ్రత్త”, “ప్రపంచమనగ సంధ్యలు , నుషస్సులనెడు నశ్వముల నెలవు”, “మదియే హితమై సుఖ మిచ్చు నీకు
దుఃఖమే విషము”, “తెలివి గలదేని తెలివినే తెలిసికొనుము”, “కాల మేరి నయినన్ మన్నించెనే?”, “నీ మొగ ముండదు పోవు బూడిదై”,
“ముండ్ల పొదలనె గద గులాబులు జనించు”,
“ఓ విధీ యెంతకాల మిటు లూరక వేదనలందు డింతు వయ్యో విరమింపవేమి?”,
“పాపముల్ నరులు చేయనిదే బ్రతుకెట్లు సాగునో?”, “అశ్రువులే నాకు మిత్రులు”,
“స్వర్గ సౌధమొక గోధుమ గింజకు విక్రయింతు”, “దయయే స్వర్గము, విధి నిర్దయయే నరకంబు” “నీదు మొహమునకును బోలునె చంద్రుఁడు”,
“జగంబు స్వప్న మిది చూచుచుంటిని బ్రతికియుండి”, “ననున్ జెఱఁబట్టెఁ బ్రేమ”, “కాలమది మోసకత్తె”, “నీవు శూన్యమే యింతకు మున్నె”, ” బోర్ల వేసిన పాత్రను బోలె నభము కాలరూపంబు సూచించు”.
“అతడు, శూన్యమైనా అతడున్నాడు, నాకు తెలిసింది; /
ఈ సత్యాన్ని ప్రపంచం అన్న పుస్తకం తెలిపింది; /
హృదయం అతడి కాంతితో గ్రహించగలిగినప్పుడు – /
నాస్తికత్వపు చీకటి దాన్ని నమ్మకపు వెలుగుగా మార్చింది”. (అనువాదం రోచిష్మాన్) అని అన్న ఖయ్యామ్ భారతీయ వేదాంత చింతనతో ప్రభావితమయినట్లు తెలుస్తోంది. భారతీయ వేదాంత చింతన ఖయ్యామ్‌లో ఇలా మెఱుస్తోంది… “… జగంబు మిథ్యగాఁ జేయుమి! యట్టి శూన్యమునఁజేరు మదేకద శాంతి ధామమున్.”, “ఆ పిపీలికా బ్రహ్మ పర్యంతమైన / శక్తి నీ తేజమునను బ్రజ్వలన మొందు / నీశ్వరునకు నీకును భేదమేమి లేదు / నిన్నుఁజెందని సద్గుణ మున్న దెందు?” (ఉమర్ అలీ షాహ్ అనువాదాలు) అని అద్వైత భావనల్ని రుబాయీలుగా అందించారు.
వేదాంత చింతన తనలో పండాక “…. మాకు నిషిద్ధ జీవనము మౌంజియు జన్నిదమున్న మేలగున్” (ఉమర్ అలీషాహ్ అనువాదం) అని ఖయ్యామ్ అన్నాడు. “నీవు నా మధు కలశంబు నేలఁ బగులఁ గొట్టి, మధువంతయును నేలఁ బెట్టినావు
నా మనో వ్రణమును రేపినావు నే నిఁ / కీశ్వరునిఁ గూర్చి మొరనిడ నేఁగుచుంటి” (ఉమర్ అలీషాహ్ అనువాదం) అని అన్న ఒక్క రుబాయీ చాలు ఉమర్ ఖయ్యామ్ కవిత్వ తాత్త్విక, తాత్త్విక కవిత్వ ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి.
ఉమర్ ఖయ్యామ్ ఒక మతాతీతమైన వ్యక్తి. కాబా యాత్రను, రంజాన్‌ను ఆమోదించలేదు. “నే మసీదుముతవల్లిని గాను …” అని (ఉమర్ అలీ షాహ్ అనువాదం) ఉమర్ ఖయ్యామ్ అన్నాడు. ఇలాంటి వాటివల్లే ఔరంగ్ జేబ్ ఉమర్ ఖయ్యామ్ రుబాయీలను నిషేధించి ఉంటాడు.
తాను సరి అనుకున్నాక, తానొక ముస్లీమైనందుకు సిగ్గుపడుతున్నానని సాహసంతో ఇలా చెప్పాడు ఉమర్ ఖయ్యామ్: “ఎంతకాల మజ్ఞానినై యెసఁగుచుందు?/మతివిరక్తిని పడి, ముసల్మాను మతము/ విడిచి, జందెమ్ము వేయుదు ద్విజునిభంగి: / నేలయన “మోమి” ననఁగ లజ్జించుచుంటి” (ఉమర్ అలీ షాహ్ అనువాదం).
మత, కుల, ప్రాంతీయతలకు అతీతంగా కవిత్వాన్ని చెప్పిన ఉమర్ ఖయ్యామ్‌ను నేటి తెలుగు కవులు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కవిత్వం పేరుతో ప్రాంతీయత, మత, కుల వాదాల అకవిత్వం తెలుగుకు పెనుశాపం అయిపోయిన ప్రస్తుత పరిస్థితిలో, ఉమర్ ఖయ్యామ్ స్ఫూర్తితో తెలుగులో ‘కవిత్వం’ రావాల్సిన అవసరం ఉంది.
మహాకవులకు లోకాన్ని పిలిచే గొప్ప లక్షణం ఉంటుంది. ఇదిగో ఇలా:
این قافله عمر عجب میگذرد
دریاب دمی که با طرب میگذرد
ساقی غم فردای حریفان چه خودی
پیش آر پیاله را که شب میگذرد.
“ఈ వయస్సు శకటం విచిత్రంగా గడిచిపోతున్నది;
మధువును ఇవ్వు ఖుషీ అనూహ్యంగా గడిచిపోతున్నది;
సాఁకీ, నా శత్రువు కోసం నువ్వు ఆలోచించద్దు –
తీసుకురా పాత్ర, నిశ వేగంగా గడిచిపోతున్నది”. (రోచిష్మాన్ అనువాదం)
ప్రపంచ ముస్లీమ్ ఉగ్రవాదులు, తెలుగులో కవిత్వాన్ని చంపేసిన ముస్లీమ్ వాద, కులవాద, ఇతర వాద కవులం అంటూ, కవిత్వమంటూ తచ్చాడుతున్న అసాంఘీక, అశ్లీల శక్తులు, దేశ ద్రోహులు, వ్యభిచారులు, తార్పుడుగాళ్లు, బ్రాహ్మణులు, హిందువుల భిక్షగా వచ్చిన బతుకు బతుకుతూ వాళ్లపైనే విద్వేషాన్ని కక్కుతున్న ప్రముఖ కవులు అన్న నేరస్థులు, అతి నీచులు, మానసిక రోగులు ఉమర్ ఖయ్యామ్ స్ఫూర్తితో మామూలుగా, ‘మనుషులు’గా మారాలి.

9444012279