– శ్యాంసుందర్ గౌడ్, సారంగపాణి
సికింద్రాబాద్: సికింద్రాబాద్ నియోజకవర్గంలో సీతాఫల్మంటే అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ శ్రేణులు భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు బూర్గుల శ్యాంసుందర్ గౌడ్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి మాట్లాడారు. జీఎస్టీ స్లాబ్ లను ఐదు శాతం, 18 శాతానికి తగ్గించడంతో నిత్యావసర సరుకుల ధరలు తగ్గుతాయని, అలాగే ఆర్థిక సంస్కరణలకు వెసులుబాటు కల్పించినట్టు అవుతుందని తెలిపారు. కార్లు మొదలుకొని రిఫ్రిజిరేటర్, టీవీల ధరలు కూడా తగ్గుతాయని, వివిధ ఉత్పత్తులపై జీఎస్టీ పన్ను శాతాన్ని తగ్గించడంతో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చినట్టు అవుతుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనిశకత వలన భారత్ ఎటువంటి సవాళ్లైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాచమల్ల కృష్ణమూర్తి, కనకట్ల హరి, ఆకారం రమేష్, మేకల కీర్తి హర్ష కిరణ్ అంబల రాజేశ్వర్, ప్రభు గుప్తా, ఇవి నరేష్, సురేష్ ముదిరాజ్, చోటా ప్రభువు, శ్రీనివాస్, శ్రీధర్ రావు హనుమంతు ముదిరాజ్, కుమారస్వామి, సంపత్, ఇంద్రన్న, దేవుడు కుమార్, అనూష, తదితరులు పాల్గొన్నారు.