– బిజెపి ఎన్టీఆర్ వీహెచ్‌పి జిల్లా ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవ సెమినార్ సదస్సు లో కేంద్ర సాంస్కృతిక, టూరిజం శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
విజయవాడ: 1975 జూన్ 25న భారతదేశంలో అత్యవసర పరిస్థితి విధించబడిందని, ఇది ప్రజాస్వామ్యం పై అతిపెద్ద దాడి అని,
అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ అన్ని ప్రాథమిక హక్కులను కాలరాశారని కేంద్ర కల్చరల్, టూరిజం శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ విమర్శించారు.
పత్రికల పై ఆంక్షలు పెట్టి అరాచకాలు వెలుగులోకి రాకుండా అడ్టుకున్నారని, లక్ష మందికి పైగా అన్యాయంగా అరెస్టు లు చేశారని,
ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంగా మార్చారని, సంజయ్ గాంధీ నియంతలా ప్రజల మీద పడి అరాచకాలకు పాల్పడ్డాడని ధ్వజమెత్తారు.
ప్రజల ఐక్య పోరాటం చివరకు ప్రజాస్వామ్యాన్ని విజయం సాధించిందని, నియంతృత్వానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన కోట్లాది మంది త్యాగాలను దేశం గుర్తుచేసుకుంటుందని,నేటికీ కాంగ్రెస్ ఈ దుశ్చర్య ను ఖండించకుండా, పశ్చాత్తాపం లేకుండా ఉండటం చాలా దురదృష్టకరమని అన్నారు.
జయప్రకాష్ నారాయణ్, వాజపాయ్, వంటి ఎంతోమంది పోరాటాల కు నేతృత్వం వహించారని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి భారీ మూల్యం చెల్లించిన ఈ చారిత్రాత్మక పోరాటం చేసిన వీరులను దేశం కృతజ్ఞత తో నేడు గుర్తుచేసుకుంటుందని అన్నారు.
దేశం వారికి సదా గౌరవం ఇస్తుందని, నేటి తరాలకు ఎమర్జెన్సీ రోజులను తెలియ చెబుతున్నామని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆనాడు ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్ళిన T.V. సత్యనారాయణ, V. సత్యమూర్తి, J. రామానుజ, M. పూర్ణ చంద్ర శర్మ,
P. మాలకొండయ్య, N. నరసింహ రాజా, B. ఆంజనేయులు వంటి పెద్దలను కేంద్రమంత్రి వర్యులు గజేంద్ర సింగ్ షెకావత్ ఘనంగా సన్మానించారు.
ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షత వహించగా , ముఖ్య అతిధులుగా భారతీయజనతాపార్టీ ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, 20 సూత్రాల చైర్మెన్ లంకా దినకర్, బిజెపి రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజి, వీహెచ్‌పి జాతీయ కమిటి సభ్యులు ఎక్కాల రాఘవులు,బిజెపి క్లష్టర్ ఇంఛార్జ్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ, బిజెపి సీనియర్ నాయకులు వామరాజు సత్యమూర్తి, ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాల ఇంఛార్జ్ కళ్యాణ చక్రవర్తి పాల్గొన్నారు.