చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ దావోస్ వెళ్లినప్పుడు బులుగు మీడియాతో పాటు చాలామంది కుహనా మేధావులు ఏడ్చారు. ఫ్లైట్ ఖర్చులకు సరిపడా పెట్టుబడులు కూడా రావని. ఆ విమర్శలు విన్నాక నారా లోకేష్ చిన్న స్మైల్ ఇచ్చారే తప్ప ఎక్కడా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు.
నారా లోకేష్ ఊహించినట్లుగానే ఇప్పుడు అన్ని సంస్థలు ఒక్కొక్కటిగా విశాఖకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే టీసీఎస్ తమ పనులు ప్రారంభించింది. ఇప్పుడు కాగ్నిజెంట్ కూడా తమ ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లు ట్వీట్ చేసింది.
కాగ్నిజెంట్ క్యాంపస్ ద్వారా ప్రత్యక్షంగా సుమారు 8000 మందికి, పరోక్షంగా మరో 6000 ఉద్యోగాలు వస్తాయి. రాబోయే రోజుల్లో ఏఐ, డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ రంగంలో ఉద్యోగ అవకాశాలు మరిన్ని వస్తాయని కాగ్నిజెంట్ ట్వీట్ చేసింది. వచ్చే ఏడాది నుంచే కార్యకలాపాలు ప్రారంభిస్తామని స్పష్టం చేసింది.
దావోస్ లో నారా లోకేష్ ఇచ్చిన ప్రజెంటేషన్, విజన్.. కాగ్నిజెంట్ కు నచ్చింది. అందుకే ఇప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. కాగ్నిజెంట్ బాటలోనే రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు ఏపీకి కచ్చితంగా వస్తాయి. దానికంతటికి కారణం… నారా లోకేష్ ప్లాన్నింగ్ మరియు ఆయన ఇచ్చిన భరోసా.