Suryaa.co.in

Telangana

మహిళలను మహారాణులుగా చూడడమే ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యం

-మహిళా లోకానికి రాఖీ శుభాకాంక్షలు
-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మ కు ఇందిరమ్మ రాజ్యం లో ఏర్పడిన  ప్రజా ప్రభుత్వం పెద్దన్నగా అండగా ఉంటుందని తెలిపారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా …వారి రక్షణే ధ్యేయంగా ప్రజా పాలన సాగిస్తున్నామని చెప్పారు.

ఎన్నికలకు ముందు మహిళలకు మాట ఇచ్చినట్టుగా అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సు రవాణా పథకాన్ని ప్రారంభించిందని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను మహిళలకు అందిస్తున్నదనీ చెప్పారు. అదే విధంగా డ్వాక్రా మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వడ్డీ లేని రుణాలను ఇచ్చామన్నారు.

మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడానికి ఈ ఐదు సంవత్సరాలలో వడ్డీ లేని రుణాలు లక్ష కోట్ల రూపాయలు అందిస్తామన్నారు. మహిళలను మహాలక్ష్మిగా మా ప్రభుత్వం చూసుకుంటుందన్నారు.  ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఎప్పుడు అండగా ఉంటామని, రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరీ సోదరీమణులకు రాఖీ శుభాకాంక్షలు చెప్పారు

LEAVE A RESPONSE