కేటీఆర్ పుట్టిన రోజున వినూత్న కార్యక్రమాలు

– ది లీడర్ ఫ్రం లోకల్ టు గ్లోబల్ అనే పేరుతో డాక్యుమెంటరీ, గిఫ్ట్ ఏ స్మైల్
– తలసాని సాయికిరణ్ యాదవ్

తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సందర్భంగా హైదరాబాద్‌లో వినూత్న కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీఆర్‌ఎస్ సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయికిరణ్

యాదవ్ వెల్లడించారు. సాంకేతికను వినియోగించుకుని, వాటిని కేక్‌లో రూపొందించామన్నారు. కేటీఆర్ సాధించిన విజయాలను విజువల్స్ రూపంలో ప్రదర్శిస్తున్నట్లు వివరించారు.

మీడియాతో మాట్లాడిన సాయి ఇంకా ఏమన్నారంటే… ఎల్లుండి ఈనెల 24 న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ భవన్ లో ఘనంగా సంబరాలు జరుపుతున్నాం. మంత్రి
ktr2 కేటీఆర్ చేసిన గొప్ప గొప్ప కార్యక్రమాలను వీడియో రూపంలో (Documentary) విడుదల చేస్తున్నాం. ది లీడర్ ఫ్రం లోకల్ టు గ్లోబల్ అనే పేరుతో, మంత్రి కేటీఆర్ అంచలంచెలుగా ఎదిగిన విధానాన్ని 5-6 నిమిషాల్లో డాక్యుమెంటరీ రూపంలో విడుదల చేస్తాం. సాండ్ ఆర్ట్, 3d వాల్ ఏర్పాటు.. రైజ్ ఆఫ్ తెలంగాణ పేరుతో కేక్ కట్ చేస్తాం.

గత 8 ఏళ్లుగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను కేక్ లో రూపొందిస్తాం.కేక్ కటింగ్ ప్రాంతంలో కాలేశ్వరం, దుర్గం చెరువు త్రీడీ గ్రాఫిక్స్ ప్లాన్ చేసాం.కేటీఆర్ అభిమానులు వచ్చే సమయంలో కళాకారులచే కళారూపాలుంటాయి.మహంకాళి బోనాల జాతర కాబట్టి, 116 ఆలయాల్లో మంత్రి కేటీఆర్ కి చల్లని దీవెనలు ఇవ్వాలని అర్చన చేయనున్నాం. నగరంలోని వివిధ డివిజన్లలో సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో నగర ప్రజాప్రతినిధులు అందరూ హాజరవుతారు.కేటీఆర్ స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో నడుద్దాం. ఉదయం 9:30 నుంచి మంత్రి కేటీఆర్ జన్మదిన సంబరాలు జరుగుతాయి. పెద్ద ఎత్తున హాజరై మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలి. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కూడా జరుగుతుంది.