విస్తరాకులో పిండి గణపతిని ఆవాహన చేసిన బీజేపీ

– ఏపీలో జగన్ సర్కారుకు వినూత్న నిరసన
గుంటూరు: వినాయక మండపాలకు అనుమతినివ్వాలని డిమాండ్ చేస్తూ, విస్తారకులో పిండి గణపతిని ఆవాహన చేసి, పంచోపచార పూజ చేసి, హిందువులపై వివక్ష కలిగిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి మనసుని మార్చాలని ఆ వినాయకుడినే కోరుకోవడం జరిగింది. 1892 లోనే సామూహిక బహిరంగ మండపాలలో వినాయకచవితిని జరపడం ప్రారంభించిన బాల గంగాధర్ తిలక్ ఫోటో కి పాలాభిషేకం చేసి, వారి స్ఫూర్తిని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. వైసీపీ లో హిందూ మంత్రులు, ఎమ్యెల్యేలు, ఎంపీ లు లేరా? లేదా జగన్ నిర్ణయాన్ని ప్రశ్నించలేని చేతకాని స్థితిలో ఉన్నారా అని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి సాదినేని యామిని శర్మ ప్రశ్నించారు.

Leave a Reply