– రాజకీయాలకు అతీతంగా హైందవ శంఖారావం
– బిజెపి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి
విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను 95 శాతం పరిష్కరిస్తున్నాం అని ఆదోని ఎంఎల్ఏ పార్థసారథి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమం ,వారధిలో పాల్గొన్న
ఆదోని ఎంఎల్ఏ పార్థసారథి ఈ సందర్భంగా పాత్రికేయుల తో పార్ధసారధి మాట్లాడుతూ .. తెలుగుతల్లికి జలహారతి పేరుతోనదుల అనుసంధానం భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తోంది.నదుల అనుసంధానం అప్పటి ప్రధాని వాజ్ పేయ్ నాటి ఆలోచన విధానం.అటల్ బిహారీ వాజ్ పేయ్ శతజయంతి సంవత్సరం లో నదుల అనుసంధానం చేయడం నిజంగానే గేమ్ ఛేంజర్ గానే పరిగణించాలి.
80 లక్షల జనాభాకు తాగునీరు, 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు, 22.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ, పరిశ్రమలకు 20 టిఎంసిల జలాలు అందించడం లక్ష్యంగా జలహారతిలో కార్యక్రమం రూపొందించడం జరుగుతోంది. గోదావరి నీటిని క్రుష్ణా నదికి తరలించడం ద్వారా నదుల అనుసంధానం వేగవంతం చేయడం ఎన్ డిఎ ప్రభుత్వం లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా శస్యశ్యామలంగా మారుతుందని బిజెపి భావిస్తోందని ఎమ్మెల్యే వివరించారు.
రాష్ట్రంలో వాజ్ పాయ్ కల నేరవేరబోతోందన్నారు. వైసీపి ప్రభుత్వంలో సాగునీటి వ్యవస్ధ అస్థవ్యస్ధం అయితే ఇప్పుడు ఇరిగేషన్ వ్యవస్ధను చంద్రబాబు గాడిలో పెడుతున్నారని ఎమ్మెల్యే కితాబునిచ్చారు. జనవరి 5 వతేదీన జరగే హైందవ శంఖారావం రాజకీయపార్టీలకు అతీతంగా దేవాలయాల పరిరక్షణ కోసం దేశ వ్యాప్త ఉధ్యమంలొ భాగంగానే ఇక్కడ హైందవ శఖారావం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యం లో జరుగుతోందన్నారు. రెండులక్షల మందితొ హైందవ శంఖారావం జరుగుతుందని ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరిస్తున్నాయన్నారు.
ధర్మాచార్యుల ఆధ్వర్యంలో దేవాలయాలు అభివ్రుద్ది జరగాలని ఇప్పటికే చాలా దేవాలయాలు ఆస్ధులు ఆక్రమణలో ఉన్నాయని వాటిని స్వాధీనం చేసుకుని దేవాలయాల అభివ్రుద్దికి నడుం బిగించాల్సిన అవసరం ఉందన్నారు. దేవాలయాల మాన్యాలను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావానికి వచ్చే వారికి ఏర్పాట్లు జరగబోతున్నాయన్నారు.
గత వైసీపి ప్రభుత్వం లో హుండీ ఆదాయాలను పక్కదోవ పట్టించారు.గత ప్రభుత్వ చీకటి జీఓలతో ఆలయాల ఆదాయాలను వేరే విధంగా వినియోగించారు.ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు దేవుడి మీద భక్తి ఉందో లేదో కానీ హుండీ మీద మాత్రం ఉంది.హుండీ డబ్బులు దేవుడికి కాకుండా సంక్షేమ పధకాలకు ఖర్చుపెడతున్నారు. చాలా దేవాలయాలు ధూపదీప నైవ్యేద్యాలు అందక విలవిల లాడుతున్నాయి
రాజకీయాలకు అతీతంగా దేవాలయాలకే ఖర్చు చేయాలని విశ్వహిందూ పరిషత్ ఆలోచన
ధూప దీప నైవేద్యాలకు కాకుండా వేరే విధంగా వినియోగిస్తున్నారు.హైందవ శంఖారావం రాజకీయ కార్యక్రమం కాదు. అన్ని రాజకీయ పార్టీలు, సాధు సంత్ లు కూడా వస్తారు..ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలనేది మా లక్ష్యం. ప్రభుత్వాలు వేసే పాలకమండళ్ళకి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి దేవాలయాలపై అంత భక్తి శ్రద్ధలు ఉండకపోవచ్చు అన్నారు.
పాత్రికేయుల సమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణ రాజు, రాష్ట్ర నాయకుడు ఉప్పలపాటి శ్రీనివాస రాజు తదితరులు పాల్గొన్నారు.