– ఓటమి భయంతో కేటీఆర్ దొంగ సర్వే
– కేసీఆర్, కేటీఆర్ లను కవితనే నమ్మడం లేదు
– ఇక తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారు?
– ఎమ్మెల్యే కంటోన్మెంట్ శ్రీ గణేష్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోతున్నామన్న సంకేతాలను కేటీఆర్ ఇచ్చాడు. బై ఎలక్షన్ లో డిపాజిట్ తెప్పించడం కోసమే ఆయన ఆరాటపడుతున్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి.
20 నెలల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్ఎస్ 120 నెలల పాలనలో రాష్ట్రాన్ని దోచుకుంది. లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ ల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రాలేదు. ఓటమి భయంతో కేటీఆర్ దొంగ సర్వేలను వదులుతున్నాడు.
అవినీతి డబ్బుతో పేపర్, టీవీ, సోషల్ మీడియా పెట్టి తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 60 శాతం ఓట్లు రాబోతున్నాయని దొంగ సర్వేలతో హడావిడి చేస్తున్నారు. సికింద్రాబాద్ లోక్ సభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ కు 20 వేల ఓట్లు కూడా రాలేదు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో విజయం సాధించబోతుంది.
జూబ్లీహిల్స్ ప్రజలు సెంటిమెంట్ కు కాకుండా డెవలప్మెంట్ కు పట్టం కట్టబోతున్నారు. కంటోన్మెంట్ ప్రజలు కూడా సెంటిమెంట్ కు కాకుండా డెవలప్మెంట్ కే ఓటు వేసి గెలిపించారు. కేసీఆర్, కేటీఆర్ లను కవితనే నమ్మడం లేదు. ఇక తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారు?
హైదరాబాద్ లో వరదలు వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అమీర్ పేట వెళ్లి పరిశీలించారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా గణేష్ నిమజ్జనం లో మా సీఎం రేవంత్ రెడ్డి సామాన్యుడిలా పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. కాంగ్రెస్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని హైదరాబాద్ ప్రజలు నమ్ముతున్నారు.
సన్న బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డులు మంజూరు చేశాం. ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించినందుకు అక్కడ అభివృద్ధి జరుగుతోంది. కంటోన్మెంట్ ప్రజల కోసం 1 ఎంజీడీ వాటర్ ను, పంప్ హౌస్ ను కూడా సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారు. కంటోన్మెంట్ లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను నిర్మిస్తున్నాం. తిరుమలగిరి చెరువు ను అభివృద్ధి చేస్తున్నాం.