Suryaa.co.in

Andhra Pradesh

ఇంతింతై.. వటుడింతై..లోకేషంతై!

-నవ్విననోళ్లే నొచ్చుకున్నాయ్‌
-పనికిరానివాడనుకున్న వాడే పనిమంతుడైన వేళ
-పాదయాత్రతో రాటుతేలుతున్న లోకేష్‌

లోకేష్.. ఈ వ్యక్తి ఈ కుర్రోడు ఎలాంటి వాడు అతని మనస్తత్వం ఏమిటి ఇతరులు చెప్పేది వింటాడా? తెలియగలవాడేనా వైసీపీ వాళ్లు అన్నట్లుగా, అతను దేనికి పనికిరానివాడా ఎగతాళి చేశారు కదా అవన్నీ నిజమేనా?
పాదయాత్ర ప్రారంభ ప్రారంభానికి ముందు ఆంధ్ర రాష్ట్రంలో అనేక మందికి ఈ ప్రశ్నలు ఉన్నాయి. తెలుగుదేశం కార్యకర్తలతో సహా ఎందుకంటే గ్రామాల్లో.. కార్యకర్తలకు అభిమానులకు సానుభూతిపరులకు లోకేష్ గురించి పూర్తిస్థాయి వివరాలు తెలియకపోవడం వల్ల వారిలోనూ ఈ అనుమానాలు ఉన్నాయి .

పాదయాత్ర మొదలైన తర్వాత లోకేష్ జనాన్ని పలకరించే తీరు మాట్లాడే విధానం జనంలో కలిసిపోతున్న తీరుకి ఇంతకాలం మేము విన్నవన్ని నిజం కాదు. ఈ కుర్రాడి లో నిజంగానే సత్తా ఉంది ,మార్పు తీసుకు రాగలరు. అందరిని గౌరవంగా చూడగలరు. మానవత్వం ఉంది. ఎన్నికలు రాజకీయాలే కాకుండా.. అతనిలో మంచి మనసున్న మనిషి ఉన్నాడు అనే విషయం అన్ని వర్గాల వారిని అన్ని వయసుల వారిని ఆకట్టుకుంది.

యువతీ యువకులు అయితే లోకేష్ లో తమను తాము చూసుకున్నారు. జగన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు కి 46 సంవత్సరాలు, అప్పటి యువత తమ కంటే పెద్దవాడైన జగన్తో మమేకమయ్యారు. కానీ ఇప్పుడు యువత లోకేష్ లో ఒక మెంటార్ ను చూస్తున్నారు. టెక్నికల్ సబ్జెక్టు మాట్లాడుతున్నారు. చర్చిస్తున్నారు.

లోకేష్ తో తమ సమస్యల్ని చెప్పుకుంటూ, తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు . లోకేష్ కూడా ఓపికగా ప్రతి ఒక్కరికి సమాధానం చెబుతూ వచ్చిన ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతూ, వారితో కలిసి పోతుండటం వారికి చాలా సంతోషం కలిగిస్తుంది. .

అన్నీ చేసేస్తాను అని హామీ ఇవ్వకుండా, చేయగలిగిన వాటిని చేస్తాను అని చెబుతూ.. చేయలేని వాటి మీద పరిష్కారం వెతుకుతాను అని చెప్పటం అందరిని ఆకట్టుకుంటుంది.తనకు అవగాహన లేని సబ్జెక్టు మీద నాకు వీటి గురించి తెలియదు. మేధావులతో చర్చించి తెలుసుకుంటాను అని చెప్పటం కూడా అందరికీ నచ్చుతుంది.

లోకేష్ ఇప్పుడు అందరూ తమ ఇంట్లో కుర్రాడు గాను, ఇంట్లో తమ్ముడు గానూ, అన్నగాను, కొడుకుగానూ, మనవడుగాను లెక్కేసుకుంటున్నారు.
ఇది చాలా మంచి పరిణామం చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి. ఎన్టీ రామారావు గారి మనవడు ఇంతలా మనతో కలిసి పోతాడు అని, ఏనాడు ఊహించని పల్లె నిండు మనసుతో దగ్గరకు తీసుకున్నారు.

రాబోయే 30 ఏళ్ల వరకు తెలుగుదేశానికి నాయకత్వం వహించేందుకు, ఒక నవ యువకుడు తయారయ్యాడు అని బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. పాదయాత్ర వల్ల లోకేష్ పై ప్రజల్లో మారిన అభిప్రాయం వల్ల లోకేష్ పై మరింత బాధ్యత పెరిగింది.

LEAVE A RESPONSE