చదువుకునే పిల్లల సంఖ్య పెంచడం గురుపూజ కాదా, బాబులూ?

ఎంపీ విజయసాయి రెడ్డి

ఉపాధ్యాయ దినోత్సవం రోజు కూడా తెలుగుదేశం తండ్రీకొడుకులు పాలకపక్షంపై నిందలేయడం మానలేదు.అధికారం లేకపోవడంతో దొరికిన తీరిక వారి నోళ్లకు హద్దూ అదుపూ లేకుండా చేస్తోంది.వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలనలో టీచర్లకు అన్యాయం జరుగుతోందనే అభాండాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ లోకేష్‌ వేశారు.తెలుగుదేశం పార్టీ ‘అగ్రనేతలు’ టీచర్లకు బోధనేతర బాధ్యతలు అప్పగిస్తున్నారంటూ అడ్డగోలు ఆరోపణలకు తెగబడుతున్నారు.ముఖ్యమంత్రిగా దశాబ్దానికి పైగా అధికారాలు చెలాయించిన చంద్రబాబు ఇప్పుడు విష యాలేమీ తెలియనట్టు మాట్లాడడం విడ్డూరంగా ఉంది.చినబాబు నాడు పబ్లిక్‌ స్కూల్లో తన గురువులకు ఎంత మర్యాద ఇచ్చాడో, ఇప్పుడు తన మాతృమూర్తికి ఎంత తిండి పెడుతున్నాడో జనానికి తెలియదనుకుంటున్నాడు.ఎంత తండ్రి కేబినెట్‌లో కీలక మంత్రిగా పనిచేసినా అంత ధీమా ఏ కొడుకుకూ పనికి రాదు.

Leave a Reply