దళిత గర్జన సభ నిర్వహించడం నేరమా?

Spread the love

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

ప్రతిపక్ష నేత ఇంటి గేటుకి తాడు కట్టి నిర్బంధించడం, ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలకు తాళం వేసి నాయకుల్ని అడ్డుకోవడం రాజారెడ్డి రాజ్యాంగంలో పోలీస్ వర్కింగ్ స్టయిల్. దళితుల హక్కులు కాపాడాలంటూ పిఠాపురం నియోజకవర్గంలో దళిత గర్జన సభ నిర్వహించడం నేరమా? ఈ కార్యక్రమానికి వెళ్తున్న టిడిపి దళిత నాయకుల్ని గృహనిర్బంధం చేయడం, పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ వర్మతో సహా వందమంది నాయకులు, కార్యకర్తలను తాళం వేసి పార్టీ కార్యాలయంలో బంధించడం దారుణం. పోలీసుల నిర్బంధకాండను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వైసిపి నాయకులు యథేచ్ఛగా దళితులపై దాడులు, హత్యలు చేసినా ప్రభుత్వం, పోలీసులు స్పందించడం లేదు. వైసీపీ ప్రభుత్వం ఆపేసిన దళిత సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభించాలని, దళితులపై దాడులు ఆపాలని పోరాడుతున్న ప్రతిపక్షంపై ఉక్కుపాదం మోపడం జగన్ రెడ్డి దళిత వ్యతిరేక ధోరణికి అద్దం పడుతోంది.

Leave a Reply