జగన్ రెడ్డి ని ఓడించటం రాష్ట్రంలో సాధ్యమేనా?

ఒక చిన్న ఉదాహరణ. నిన్న నేను ఇంకో సీనియర్ జర్నలిస్ట్ మిత్రుడు, ఇద్దరం ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర లో ఉన్న టీ స్టాల్ లో టీ తాగుతున్నాము. ఒకతను సాదాసీదా వ్యక్తి కనపడ్డాడు. మా మిత్రుడు కంగ్రాట్స్ సోదర అన్నాడు . అతనితో నేను అడిగా.. దేనికి మిత్రమా అని అడిగితే, ఏమిలేదు ఇతనికి జగన్ ప్రభుత్వం ఒక గొప్ప పదవి ఈయబోతుంది అన్నాడు. మంచి జీతం కాబినెట్ రాంక్ ఉన్న పదవి అన్నాడు.

ఒకింత ఆశ్చర్యం వేసిన అడిగాను ఇతను ఏమి చేస్తుంటాడు అని, సాక్షి జిల్లా స్థాయి రిపోర్టర్ అని. మళ్ళీ అడిగాను. ఇతను జగన్ కి తెలుసా అని. అని అడిగాను లేదు, జగన్ వ్యవస్థ చూసుకుంటుంది అన్నాడు. జగన్ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని చూసుకోవటానికి , ప్రతి ప్రాంతానికి ఒక వ్యవస్థ ఉందనుకోవాలి. ఆ వ్యవస్థకి సజ్జల, సుబ్బారెడ్డి, విజయ సాయిరెడ్డి, పెద్దిరెడ్డి ఇలా ఒక్కొక్కరు, ఒక్కొక్క వ్యవస్థను నడిపిస్తున్నారు అనుకోవాలి.

నేను గత రెండు సంవత్సరాల నుంచి .. అన్ని సంఘాలు పెద్దలు, తటస్త నాయకులు, జర్నలిస్ట్ లను, ఉద్యమకారులను, దగ్గరగా చూస్తా వున్నాను. జగన్ రెడ్డి రాజకీయం ఎలా వుంటది? ఎందుకు జగన్ రెడ్డి కోసం ఇంతమంది పనిచేస్తున్నారు? అని విశ్లేషణ చూస్తే, ఆయన తరహా రాజకీయం అర్ధం అవుతుంది.

సహజంగా నాయకులు సేవ చేద్దాం. ప్రజలకు తాత్కాలికంగా- దీర్ఘకాలికంగా ఇలాంటి మంచి పనులు చేయాలి. ఎలా పేరు తెచ్చుకుందాం? ఎలా విలువలు తో కూడిన రాజకీయం చేద్దాం? అని ఆలోచిస్తుంటారు (ఇప్పుడు కాదులెండి. పాతతరం నాయకులు).మన జగన్ రెడ్డి కి తెలిసిన ఒక్క రాజకీయం, గెలవటం కోసం ఏమిచేయాలి? ప్రత్యర్థిని ఎలా బలహీనం చేయాలి? తనకోసం బలిదానాయికైనా సిద్ధమయ్యే నాయకులను, ఎలాతయారు చేసుకోవాలి? అంతే అతని తరహా రాజకీయం.

ముఖ్య లక్షణాలు
జగన్ రెడ్డి మొహమాటం పడడు, తనకు కుల ముద్ర, తొక్క తోలు ఇలాంటి పులిహార ఆలోచన ఏమిచూడడు, తన చుట్టూ ఆర్థికమూలాలు , ముఖ్యమైన నాయకులు అంతరంగీకులు, తనకులం సంబందించి నోళ్లే వుంటారు. అలాగే రాష్ట్రాన్ని జోనులు మాదిరి, ఒక్కోజోను కి ఒక్కో రెడ్డి గారిని నియమించటం. వాళ్ళే ప్రాంతాలకు సామంత రాజులు అనుకోవచ్చు వాళ్లే వ్యవస్థలను నడిపిస్తుంటారు అనుకోవాలి.

ఆర్థికంగా సంపాదించుకొనే అవకాశం, తన వర్గం తాలూకా ఒక్కక్కరికి ఒక్కోవిధంగా.. ఒకరు ఇసుక, ఇంకొకరు మద్యం, ఇంకొకరు కాంట్రాక్టులు, కొంత మంది ఖనిజసంపద ఇలా.. ఒక్క తన వర్గానికి ఆర్థిక పరిపుష్టి కోసం, రాష్ట్ర ఖజానాని దోచేయటానికి పూర్తి స్వేచ్ఛ . అలా పార్టీ కోసం నిధులు పుష్కలంగా సమకూర్చుకుంటారు.

జగన్ పార్టీకి మద్దతుగా ఉన్న సామాన్యుడికి కూడా, రూపాయి అడగకుండా టిక్కెట్లు ఇస్తుంటారు. అలాగే ఎమ్మెల్యేలు- ఎంపీలు- మంత్రులు అవ్వడానికి భరోసా కల్పిస్తారు. అలా సామాన్య స్థితి నుంచి, నాయకులు గా ఎదిగే అవకాశం రావడంతో.. ఆ నాయకులు జగన్ రెడ్డి ని టిడిపి నాయకుడు బోసడీకే అన్నందుకు, టీడీపీ ఆఫీసులో వెళ్లి మరి కొట్టివచ్చారు అంత భక్తి భావం ఉన్న నాయకులు.

మిగతా రెండో శ్రేణి.. తన రెడ్డి సోదరులకు 1100 పైగా సలహాదారుల రూపం, మంచి జీతాలతో పదవులు. తన రెడ్డి ప్రొఫెస్సొర్స్ కి రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ లుగా అవకాశాలు ఇవ్వడం.

రాష్ట్రము లో కుల సంఘాలను చూసుకోవటానికి, 60 కార్పొరేషన్స్ ఒక్కో కార్పొరేషన్ లో 10 డైరెక్టర్లు. అంటే 600 మందిని ప్రజల సొమ్ముతో, నెలకి మూడు లక్షల పైన జీతాలతో వాళ్ళ బాగోగులు చేసుకొనేలా అవకాశాలు కల్పించటం. అంటే 600 మంది డైరెక్టర్లు రాష్ట్రంలో ఆయా కులాల చిన్న చిన్న నాయకులను చేసుకొనేలా, వ్యవస్థ తయారు చేసుకోవడం. రాష్ట్రంలో ఏమి జరిగిన జగన్ రెడ్డి కోసం.. నమ్మిన బంటులా పని చేసే సైన్యం .అన్ని కులాలను జగన్ రెడ్డి కోసం పనిచేసాలా చేస్తాయి అనుకోవాలి.

ఇంకో గొప్ప బలం.. మొహమాటం లేకుండా తిమ్మిని బమ్మిని చేయగల సత్తావున్న మీడియా. దాంట్లో ప్రభుత్వ జీతాలు. సలహాదారుల రూపంలో తింటున్న అమర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఇంకా తటస్థుల రూపంలో , జగన్ రెడ్డి కి అవసరమైనప్పుడల్లా మద్దతుగా మాట్లాడగలిగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు రవి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే బొచ్చడు మంది మేధావి వర్గం వీళ్లందరినీ చూసుకొనే వ్యవస్థ.

జనాలే లేని గ్రామాలకు గ్రామ స్వరాజ్యం పేరిట, జర్మనీలో నాజీ సైన్యం తరహాలో తమపార్టీ వాళ్లకు ఇప్పించిన వాలంటీర్ పోస్టులు. మొత్తం సమగ్ర సమాచారాన్ని పార్టీకి అందించటం. నయానో భయానో మొత్తం గ్రామీణ ఓటరులను మద్దతుగా ఉండేలా చేసుకోవటం.

మీడియా లో 70% వరకు తనకు మద్దతుగా ఉంచుకోవటం. అలాగే తనకి నచ్చని మీడియా ని పులిహోర విషయాల్లో ఉంచడం. ఇంకా చెప్పాలంటే ..తన మద్దతు దారులను, ఆయా మీడియాను చూడకుండా ఉండేలా మీడియా మీద దాడి, అలాగే టీడీపీ అనుబంధ మీడియా ని.. రోజు ఏదో ఒక బూతులతోనో, రోజు ఏదో ఒక పనికిమాలిన అంశాలమీద తిప్పడం. రాష్ట్రానికి జరుగుతున్న విధ్వంసకర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా చేయడం.

మొహమాటం లేకుండా కులాల మధ్య , ప్రాంతాల మధ్య విభేదాలు లేపడం. ఆ మంటల్లో రాష్ట్రాన్ని ఉంచటం. అసలు సమస్యలను చర్చకి రాకుండా చేయటం. దాని కోసం ఒక వ్యవస్థ పనిచేసేలా చూసుకోవడం.

అప్పులు తెచ్చి మరీ 3 సంవత్సరాల నుంచి ఓట్ల కోసం, రాజకీయ పథకాలు రూపొందించి అందరికీ తలా పదిరూపాయలు ఇవ్వడం . ఆలా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పేదకుటుంబాలను, ప్రభుత్వాల మీద ఆధారపడే విధంగా, ఉచితాలు పంచటం. నేను మీకు సహాయం చేయబోతుంటే, అప్పులు అప్పులని నన్ను ఇబ్బంది పెడుతున్నారని సానుభూతి రాజకీయం.

ఇలా చెప్పుకొంటా పోతే జగన్ తనని నమ్ముకున్నోళ్లకు, మొహమాటం లేకుండా రాష్ట్ర ఖజానా కాకుండా అప్పులు తెచ్చి మరీ సలహాదారుల రూపంలోనో, ఇతర రూపాల్లో చేయాల్సినది చేసుకుంటా పోవడం. ఢిల్లీ అండదండలతో తన సామ్రాజ్యాన్ని, తన పదవిని సుస్థిర పరచుకోవటాని అను నిత్యం పనిచేయటం మన జగన్ రెడ్డి రాజకీయ విజయ రహస్యం అని నా భావం
నోట్: ఒక రాజకీయ వ్యవస్థ మీద అవగాహన ఉన్న వ్యక్తిగా నా అభిప్రాయం చెప్పాను. అంతేగాని ఎవరి మీద దుష్ప్రచారం చేయడం లేదు.

– జీఎన్‌ఆర్