Suryaa.co.in

Features

కుంభవృష్టి కాదది..నరుని దృష్టి..!

పచ్చదనాల సిరి..
ఇప్పుడేమో ధార్ ఎడారి..
నాలుగు మాటలు చెప్పి
వెళ్లిపోయే మోడీ..
అతడి రాక కోసం
అధికారుల గారడీ..
గ్రీనరీ..అదెంత పేరడీ..
పెద్దోళ్ల మెప్పుకై
దేనికైనా రెడీ!

కొందరి మాటల్లో
కాబోయే రాజధాని..
సువిశాల విశాఖలో
మరో చోటే దొరకలేదా
మోడీ సభకు..
ఏంటీ రభస..
ఎందుకీ ప్రయాస..
ఎవరి మెప్పు కోసం ఈ సోస!

ఇప్పటికే పెరుగుతున్న కాలుష్యం..
ఆ మధ్య
హుదూద్ విధ్వంసం..
నిత్యం ‘రియల్’
వికటాట్టహాసం..
రోడ్ల విస్తరణ..
కట్టడాలు..కూల్చేయడాలు..
అన్నిటికీ వృక్షాలేనా లక్ష్యాలు?
ప్రగతి ఫలాలు
స్వార్థపరుల భక్ష్యాలు!?

ఆంధ్ర విశ్వకళాపరిషత్తు..
ఎవడి బాబు సొత్తు..
మూడు గంటల ముచ్చట
కోసం చేసేస్తారా మోడు..
ఇది చరిత్ర ఎరుగని ప్రళయం
మానవుడే దానవుడై
సృష్టించిన విలయం..
మతి చెడి..గతి తప్పి
తప్పిన లయం..!

సురేష్ కుమార్ ఇ
జర్నలిస్ట్

LEAVE A RESPONSE