జగన్ బీజేపీతో నడిపిన చీకటి వ్యవహరాలు నైతికమా..అనైతికమా బొత్సా?

– రాజశేఖర్ రెడ్డి మరణానికి జగన్ రెడ్డే కారణమని చెప్పింది నువ్వు కాదా బొత్సా?

• మంత్రి బొత్స గతం మరిచి అనవసర, అప్రస్తుత, అసత్యపు వ్యాఖ్యలు చేస్తున్నాడు.
• టీడీపీ పొత్తులు తప్పో..ఒప్పో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారు.
• జగన్ రెడ్డి…బొత్స లాంటి స్వార్థపరులు మైనారిటీలను తప్పుదోవ పట్టించడానికి ఎన్ని వేషాలేసినా ఉపయోగం లేదు.
• చంద్రబాబు ఎప్పుడూ రాష్ట్రాభివృద్ధి ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొనే పొత్తులు పెట్టుకున్నారు తప్ప, జగన్ లా వ్యక్తిగత ప్రయోజనాలకోసం కాదు బొత్సా.
• వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్నప్పడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ అబ్దుల్ కలామ్ ను రాష్ట్రపతిని చేసింది.
• గతంలో మోదీ ప్రభుత్వంతో కలిసి విభజనానంతర రాష్ట్రప్రయోజనాలకోసం పనిచేసింది
• జగన్ అవినీతి, దోపిడీతో నాశనమైన రాష్ట్రాన్ని, రోడ్లపాలైన ప్రజల్ని ఆదుకోవడానికే చంద్రబాబు బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యారనే నిజం ప్రజలు గ్రహించారు

• పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఆనాడు స్వప్రయోజనాలకోసం జగన్ ను, ఆయన తల్లి విజయమ్మను అనరాని మాటలనడం ఎలాంటి నైతికతో చెప్పు బొత్సా.
• తనపై ఉన్న అవినీతికేసుల నుంచి బయటపడటానికి , బెయిల్ రద్దుకాకుండా ఉండానికి జగన్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తడం నిజం కాదా?
• బీజేపీని బూచిగా చూపి తెలుగుదేశం పార్టీకి మైనారిటీలను దూరం చేయాలనే కుతంత్రంతోనే బొత్స అసత్యాలు మాట్లాడాడు.

– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి మాజీ చైర్మన్ మొహమ్మద్ అహ్మద్ షరీఫ్

మంత్రి బొత్స సత్యనారాయణ అనవసర, అప్రస్తుత, అసత్యపు వ్యాఖ్యలతో ప్రజల్ని పెడదారి పట్టించే ప్రయత్నం చేశారని, తెలుగుదేశం పార్టీ లౌకికవాద పార్టీ అని, తెలుగువారి ఆత్మగౌరవం.. ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఏర్పడిన పార్టీ అని, 40ఏళ్లుగా అందుకోసమే పనిచేస్తోందని, ఈ వాస్తవం బొత్స లాంటి వారు తెలుసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనమండలి మాజీ ఛైర్మన్ మొహమ్మద్ అహ్మద్ షరీఫ్ సూచించారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

“ రాష్ట్రప్రజల్లో తెలుగుదేశం పార్టీ యెడల అపారమైన విశ్వాసం, నమ్మకం, అంతు లేని అభిమానం ఉన్నాయనే వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. 5 ఏళ్లుగా జగన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం ఆర్థికంగా పతనమైంది. అన్నివర్గాల ప్రజలు జగన్ చేత గాని పాలనతో బాధల సుడిగుండాల్లో చిక్కి విలవిల్లాడుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి, తమకు మంచి భవిష్యత్ అనే పూర్తి నమ్మకం తో ప్రజలు ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి అనేది చంద్రబాబుకు కొత్తకాదు. 14 ఏళ్లు ఆయన ఆ పదవికే వన్నె తెచ్చేలా ప్రజారంజకంగా పనిచేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ 7 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి, పాలనలో తనదైన ముద్ర వేశారు. ఈ వాస్తవాలన్నీ తెలిసికూడా బొత్స , తనకేమీ తెలియ నట్టు, రాజకీయాలు అర్థం కానట్టు ప్రవర్తిస్తున్నారు.

ప్రజల ఆస్తులు, రాష్ట్ర సంపద దోచేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన జగన్ రెడ్డి విధ్వంస పాలనతో సర్వనాశమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు
ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నా టీడీపీ మైనారిటీలకు సముచిత ప్రాధాన్యం, గౌరవం ఇచ్చింది

అధికారంలోకి వచ్చినప్పటినుంచీ దేశంలో ఎవరూ పాల్పడని విధంగా తారాస్థా యి అవినీతితో జగన్ తనదోపిడీని విశృంఖలంగా కొనసాగించారు. రాష్ట్ర వనరులు , ప్రజల ఆస్తులన్నీ దోచుకోవడంతో పాటు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. తన ను ప్రశ్నించేవారిని, తనకు ఎదురుతిరిగేవారిని అణచివేసి ప్రతిపక్షాలు.. ప్రజలు.. ప్రసారమాధ్యమాల గొంతుల్ని ముఖ్యమంత్రి నులిమేశాడు. నియంతపాలన చేస్తూ అంతిమంగా రాష్ట్రంపై రూ.10లక్షల కోట్ల అప్పుల భారం మోపాడు. జగన్ రెడ్డి చేతగాని పాలనతో దేశంలో వెనుకబడిన రాష్ట్రాల జాబితాలో ఏపీ అట్టడుగు స్థానంలో నిలిచింది.

ఈ విధంగా అన్నివిధాల నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి అభివృ ద్ధి బాటలో పయనింపచేయాలంటే అధికారంలోకి వచ్చే తెలుగుదేశం-జనసేన కూటమికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహాయసహాకారాలు చాలా అవస రం. దానిలో భాగంగానే నేడు చంద్రబాబు బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యారు తప్ప , అధికారపార్టీ ఆరోపిస్తున్నట్టుగా అనైతిక కార్యకలాపాలకోసం కాదు. కేంద్రంలోని ఎన్డీఏతో టీడీపీ ఇప్పుడే కొత్తగా కలవడంలేదు. గతంలో వాజ్ పేయ్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉండి రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సహాయసహకారాలు పొందింది.

విభజన తర్వా త ఏర్పడిన కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంకోసం 2014లో కూడా చంద్రబాబు కేంద్రప్రభుత్వంలో భాగస్వామి అయ్యారు. ఆనాడు కేంద్రంలో రెండు మంత్రి పద వులు పొందిన తెలుగుదేశం.. మిత్రపక్షమైన బీజేపీకి రాష్ట్రంలో రెండు మంత్రి పద వులు ఇచ్చింది. ఈ విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టు కున్నప్పటికీ టీడీపీ ప్రభుత్వంలో మైనారిటీలకు ఎప్పుడూ, ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఎటువంటి మతపరమైన ఘర్షణలు జరిగిన దాఖలాలు లేవు.

టీడీపీ ప్రభుత్వం మైనారిటీ వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, మైనారిటీ ల గౌరవాన్ని పెంచేలా పనిచేసింది. మొదట ఎన్డీఏలో భాగస్వామిగా చేరిన చంద్రబాబునాయుడు, ఆనాటి ప్రధాని వాజ్ పేయ్ తో మాట్లాడి భారత రాష్ట్రపతి గా అబ్దుల్ కలామ్ ను నియమించడంలో కీలకపాత్ర పోషించారనేది ఎవరూ కాద నలేని వాస్తవం. తెలుగుదేశం పార్టీ రాష్ట్రహితం, ప్రజల సంక్షేమం కోరి పొత్తులు పెట్టుకుంది తప్ప, ఎన్నడూ వ్యక్తిగత ప్రయోజనాలకోస వెంపర్లాడలేదు.

అవినీతికేసులు, బాబాయ్ హత్యకేసు నుంచి తప్పించుకోవడానికి, అవినాశ్ రెడ్డిని కాపాడటానికే జగన్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అడుగులకు మడుగుల వత్తాడు

జగన్ రెడ్డి తనపై ఉన్న అవినీతికేసులు, బాబాయ్ హత్యకేసు నుంచి తప్పించుకో వడానికి, తన తమ్ముడు అవినాశ్ రెడ్డిని హత్యకేసు నుంచి బయటపడేయడాని కే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అడుగులకు మడుగులు వత్తాడు అన్నది పచ్చినిజం. బెయిల్ పై బయటఉన్న జగన్ రెడ్డి తన బెయిల్ రద్దుకాకుండా చూడటం కోసం, తన బాబాయ్ హత్యకేసు తన మెడుకు చుట్టుకోకుండా ఉండ టం కోసం బీజేపీతో చీకటి వ్యవహారాలు నడిపాడని మంత్రి బొత్సకు తెలియదా?

కేంద్ర సహకారం కోసం.. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ నేడు బీజేపీతో కలవడం అనైతికం ఎలా అవుతుందో బొత్సానే చెప్పాలి. గతంలో కాంగ్రెస్ లో ఉన్న బొత్స రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి హోదాలో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని దారుణంగా తప్పు పట్టాడు. తన తండ్రిని జగనే చంపించి, ఆ నేరాన్ని కాంగ్రెస్ పార్టీపై.. ఆపార్టీ అధినేత్రి సోనియాగాంధీపై వేస్తున్నాడని బొత్స.. జగన్ రెడ్డిని దూషించలేదా? రాజశేఖర్ రెడ్డి మరణానికి జగన్మోహన్ రెడ్డే కారణమని ఆనాడు బొత్స అనలేదా ?

జగన్ తల్లి విజయమ్మను ఏకవచనంతో సంబోధించి ఆమెపై ఎదురుదాడి చేయలేదా? పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఆనాడు తన అవసరాలకోసం జగన్ ను అనరాని మాటలన్న బొత్స, నేడు అదే వ్యక్తి పంచనచేరి టీడీపీని తప్పుపట్టడం సిగ్గుచేటు. ఏది నైతికమో…ఏది అనైతికమో బొత్సలాంటి స్వార్థనాయకుడితో చెప్పించుకోవాల్సిన అగత్యం టీడీపీకి, చంద్రబాబుకి రాలేదు. తెలుగుదేశం పార్టీ పొత్తు తప్పో…ఒప్పో త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారనే సత్యాన్ని బొత్స గ్రహించాలి. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ప్రజల అభిలాష, ప్రజల కోరికే. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు కాబట్టి, రాష్ట్రాన్ని అన్నివిధాలా మరలా అభివృద్ధిబాటలో పయనింపచేయాల్సిన బాధ్యత తనపై ఉంది కాబట్టి, మరలా కేంద్రంలో అధికారంలోకి వచ్చే సూచనలు బీజేపీకే ఎక్కువ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు ముందుచూపుతో ఎన్డీఏలో భాగస్వామిగా చేరడానికి సిద్ధమ య్యారు.

ఎన్నికల వ్యవస్థని గుప్పెట్లో పెట్టుకొని ప్రజల్ని భయపట్టి, ప్రలోభపెట్టి మరలా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న జగన్ రెడ్డిని నిలువరించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే చంద్రబాబు బీజేపీకి దగ్గరయ్యారు

అన్నింటికంటే ప్రధానంగా వ్యవస్థల్ని ధ్వంసం చేసి, తన జేబుసంస్థగా మారిన వ్యవస్థల్ని అడ్డుపెట్టుకొని జగన్ రెడ్డి వచ్చేఎన్నికల్లో అక్రమ మార్గాల్లో గెలవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎన్నికల వ్యవస్థని గుప్పెట్లో పెట్టుకొని ప్రజాస్వా మ్యయుతంగా ఎన్నికలు జరక్కుండా చేయడానికి కుట్రలు పన్నుతున్నాడు. ప్రజల మద్ధతు లేదనితెలిసే, జగన్ దొడ్డిదారిన గెలిచేందుకు, ఓటర్లని భయపెట్టి, డబ్బుతో ప్రలోభపెట్టి తాను మరలా ముఖ్యమంత్రి అయ్యేందుకు తాపత్రయపడు తున్నాడు. జగన్ కుట్రలకు అడ్డుకట్ట వేసి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించి, ప్రజల్ని గెలిపించేందుకు చంద్రబాబు బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యారు అనేది పచ్చినిజం.

బీజేపీని బూచిగా చూపి తెలుగుదేశానికి మైనారిటీల్ని దూరం చేయాలని చూస్తున్న జగన్ కుతర్కబుద్ధిని ముస్లింలు నమ్మరు

బీజేపీని బూచిగా చూపి తెలుగుదేశానికి మైనారిటీలను దూరం చేయడానికి జగన్ రెడ్డి, అతని పార్టీ ప్రయత్నిస్తోంది. చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకునే తన కుతర్కబుద్ధిని జగన్ ఎంతలా ప్రదర్శించినా ప్రజలు ఆయన్ని నమ్మే పరిస్థితి లేదు. 5 ఏళ్లుగా బీజేపీతో అంటకాగిన జగన్, ఎన్నికల్లో ఓట్లు అడిగేముందు మైనారిటీలకు ఏం సమాధానం చెబుతాడు? మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించని జగన్ రెడ్డి, చివరకు చంద్రబాబు ప్రత్యేకంగా మైనారిటీలకోసం అమలుచేసిన అనేక సంక్షేమపథకాల్ని రద్దుచేశాడు. ఉన్న అరకొర పథకాలకు ఎలాంటి ఆర్థిక సహాయం చేయకపోగా, చివరకు మైనారిటీల పై గతంలో ఎన్నడూ లేని విధంగా తన ప్రభుత్వంలో దాడులు చేయించాడు.

మైనారిటీ మహిళలపై జరిగిన అత్యాచారాలు, మైనారిటీ సోదరులపై పెట్టిన తప్పుడుకేసులు సహా వారిపై జరిగిన దారుణాలన్నింటికీ జగన్ రెడ్డే బాధ్యుడు. మైనారిటీ కుటుంబాలు బలవన్మరణాలకు పాల్పడిన ఘటనలు జగన్ ప్రభుత్వం లోనే ఎందుకు జరిగాయో మంత్రి బొత్స సమాధానం చెప్పాలి. అబ్దుల్ సత్తార్, అబ్దుల్ సలాం కుటుంబాలు ఏమయ్యాయో బొత్సకు తెలియదా? మైనారిటీ యువతకు ఉపాధి లేకుండా చేసి, వారి పొట్టకొట్టింది జగన్ రెడ్డి కాదా? దుల్హన్, దుకాన్-మకాన్, విదేశీవిద్య, రంజాన్ తోఫా, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి రుణాలు, మైనారిటీ కార్పొరేషన్ కు నిధులు లేకుండా చేసింది జగన్ రెడ్డి కాదా?

పేదముస్లింలను ప్రభుత్వసొమ్ముతో చంద్రబాబు హజ్ యాత్రకు పంపితే, జగన్ ఆ పథకాన్ని కూడా రద్దుచేశాడు. మసీదులు, మదర్సాలు, షాదీఖానాల నిర్మాణానికి, మరమ్మతులకు చంద్రబాబు ఇబ్బడిముబ్బడిగా నిధులు కేటాయి స్తే, జగన్ రెడ్డి మొక్కుబడిగా నిధులిచ్చి చేతులు దులపుకున్నాడు. మైనారిటీ పాఠశాలలు, కళాశాలలు, ఉర్దూ విశ్వవిద్యాలయం నిర్మాణానికి జగన్ రూపాయి నిధులు ఇవ్వలేదు. చివరకు వక్ఫ్ భూముల్ని వైసీపీనేతలు ఆక్రమిస్తే జగన్ చోద్యం చూశాడు.

2019 ఎన్నికల్లో జగన్ రెడ్డి మైనారిటీలకు కల్లబొల్లి మాటలు చెప్పి వారి ఓట్లు దండుకున్నాడు. మరలా జగన్ రెడ్డి చెప్పే అబద్ధాలు… బొత్స లాంటి వాళ్ల దుష్ప్రచారం నమ్మకుండా మైనారిటీ సోదరులంతా రాష్ట్ర ప్రగతి కోసం, తమ బిడ్డల భవిష్యత్ కోసం మంచి నిర్ణయం తీసుకోవాలి.” అని షరీఫ్ కోరారు.

 

Leave a Reply