– గవర్నర్ ని కలిసి ఏం మాట్లాడారు?
– ఏ సబ్జెక్టుపై, ఎవరిమీద ఫిర్యాదు చేశారు?
– బయటికి వచ్చిన వెంటనే పాత్రికేయులకు వివరించలేదెందుకు?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
మంగళగిరి:. సిట్ దర్యాప్తు చేస్తున్న మద్యం కుంభకోణం కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధ్యులు ఎంతటివారైనా చట్టానికి పట్టించండని గవర్నర్ ని కోరారా? ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా గవర్నర్ ని కలిసి మాట్లాడిన విషయం బయటి ప్రపంచానికి ఎందుకు తెలియజేయలేదు. తెలియజేయకుండా ఉండడంలో మీ ఆంతర్యమేమిటి? మీడియా కేకలేస్తున్నా వారికి ఏమీ చెప్పకుండా తుస్సు మని వెళ్లిపోయారుందుకు?
బయటికి వచ్చాక గవర్నర్ ని ఎందుకు కలవాల్సి వచ్చిందో వివరించాల్సివుంది. మీ హయాంలో సరఫరా చేసిన మద్యంలో విష పూరిత పదార్థాలున్నట్లు చెన్నైలోని ఎస్జీఎస్ ల్యాబ్ నిర్ధారించిన విషయం నిజం కాదా? విషపూరిత పదార్థాలున్నాయని నిర్ధారిస్తే ఆ మద్యాన్ని ఎలా అమ్మారు? ఆ విషపూరిత మద్యం త్రాగి వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. నీ ఐదేళ్లపాలనలో నీవు సరఫరా చేసిన మద్యం తాగి 90,385 మంది కిడ్నీ రోగాలతో బాధపడుతున్నారు. 29,369 మంది కాలేయ సమస్యతో బాధపడుతున్నారు. 12,663 మంది నరాల బలహీనతతో కొట్టుమిట్టాడుతున్నారు.
ఇంతమంది చావుకు కారకులయ్యారు. ఇంతమంది ఆనారోగ్యాలకు కారకులయ్యారు. మీపై, మీ అవినీతి టీమ్ పై రాష్ట్ర కల్తీ మద్యంతో చావుకు కారణమైన జగన్ అండ్ కో టీమ్ పై డీజీపీ ప్రత్యేక కేసు నమోదు చేయాలి. కేసు నమోదు చేసిదర్యాప్తు చేయాలని కోరుతున్నాం. కల్తీ మద్యం తాగితే చనిపోతారని జగన్ కు తెలిసే ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంతేకాక అనేకమంది వికలాంగులవడం జరిగింది. కనుక జగన్ పైన, జగన్ అవినీతి టీమ్ పై బిఎస్ఎస్ 105 క్రింద ‘‘కల్పబుల్ హోమిసైడ్ నాట్ ఎమౌంట్ టు మర్డర్’’ క్రింద కేసు రిజిష్టర్ చేయాలి.
మద్యం కుంభకోణంలో దర్యాప్తు సిట్ చూసుకుంటుంది కాని ఫలితంగా చనిపోయిన, అంగవికలాంగులైన దానిపై ప్రత్యేక కేసును డీజీపీ రిజిష్టర్ చేయించి సమర్థులైన అధికారులతో దర్యాప్తు చేయించాలి. బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. జగన్ తన పార్టీ నాయకులతో గవర్నర్ ను కలిశాక ఏం మాట్లాడారో తెలపకపోవడంలో మర్మమేమిటో? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. జగన్ గవర్నర్ ను కలవడం అఫిషియల్ ట్రిప్పా లేక మాజీ ముఖ్యమంత్రి హోదాతో కలిశారా అని అనుకుంటున్నారు.
జగన్ కు నిజాలు బహిర్గతం చేయడానికి ఎందుకంతగా భయపడుతున్నారో తెలియడంలేదు. జగన్ తన టీం తో రాజ్ భవన్ ను చూడ్డానికి వెళ్లినట్లుందిగా ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని క్షుణ్ణంగా దర్యాప్తు చేయమని గవర్నర్ ను కోరారా? లేక బిగ్ బాస్ అయిన తనను (జగన్ ను) కూడా అరెస్టు చేయమని కోరారా? వైసీపీ.. అవినీతిలో పీకలదాక కూరుకుపోయి ఉంది.
వంద కోట్ల లిక్కర్ స్కామ్ కే కేజ్రివాల్ ప్రభుత్వం కొట్టుకుపోయింది, అంతులేని లిక్కర్ స్కామ్ చేసిన వైసీపీ ఏంకావాలి? జే బ్రాండ్ మద్యంలో విషపూరిత పదార్థాలున్నట్లు చెన్నైలోని ఎస్ జీఎస్ ల్యాబ్ నిర్ధారించినప్పటికి దయా, దాక్షిణ్యాలు లేకుండా ఆ మద్యాన్ని అమ్మారు. వేలాదిమంది ఈ మద్యం తాగి నరాల వ్యాధి, తదితర వ్యాధులతో చనిపోయినా జగన్ మనసు కరగలేదు.
జగన్ ప్రభుత్వం అనేకమంది నరాల బలహీనత, లివర్ చెడిపోవటానికి, కిడ్నీలు దెబ్బతినడానికి కారణమైంది. వేలాదిమంది చనిపోతే మావారు శుద్ధపూసలని జగన్ వారిని వెనకేసుకురావటం న్యాయమా? ధర్మమా? ఇంతమంది చావులు, కిడ్నీలు, కాలేయాలు దెబ్బతినడానికి జగన్ అవినీతి, అసమర్థ పరిపాలనే కారణం. అందుకే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారు. జగన్ దురుద్దేశం కారణంగానే అమాయకులు చనిపోయారని డీజీపీ గుర్తించాలి.
సిట్ దర్యాప్తు చేస్తున్నప్పటికి దాంతోపాటు గవర్నర్ కూడా కల్పించుకొని కల్తీ మద్యం తగితే మనుషులు చస్తారని తెలిసీ కూడా కల్తీ మద్యం అమ్మినందుకు జగన్ టీంకు శిక్ష వేయాలి. జగన్, టీమ్ పై విషపూరిత మద్యాన్ని సరఫరా చేసి చావులకు కారణమైనవారిపై సపరేట్ కేసు రిజిష్టర్ చేయాలి.
బాధ్యులందరినీ చట్టానికి పట్టించాలి, వారిని అరెస్టు చేయాలి. జగన్ కు జాలి, దయ లేదనడానికి ఇదే నిదర్శనం. జగన్ అవినీతి ఆస్తులు రికవరి చేసి మద్యం తాగి అవయవాలు దెబ్బతిన్నవారికి సహాయం చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కోరారు.