చేపలు, మాంసం మార్కెట్లు పెట్టడమేనా.. అభివృద్ధి..?

వైకాపా పాలనపై నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షయూ, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అప్పలరాజు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

అభివృద్ధికి మారుపేరుగా చంద్రబాబునాయుడు నిలిస్తే.. అవినీతికి నంబర్ వన్ ఐకాన్గా జగన్ రెడ్డి నిలిచారని నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. మంత్రి అప్పలరాజు అవగాహన లేకుండా, స్థాయి మరిచి మాట్లాడుతూ చంద్రబాబునాయుడిని విమర్శించడం సిగ్గుచేటని మండిపడ్డారు.

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి చేపలు, మాంసం మార్కెట్ పెట్టడమేనా అభివృద్ధి అంటే అని ప్రశ్నించారు.ఓటీఎస్ పేరుతో పేదల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పేదవారికి ఒక్క ఇల్లూ ఇవ్వలేని మీకు వేల కోట్లు వసూలు చేసే హక్కు ఎక్కడిదని ధ్వజమెత్తారు.

తెదేపా హయాంలో చంద్రబాబునాయుడు చేసిన అభివృద్ధి మంత్రి అప్పలరాజుకు కనబడటం లేదా అని జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. ఓటీఎస్ నగదు చెల్లించకపోతే.. పథకాలు రద్దు చేస్తామని వాలంటీర్ ద్వారా బెదిరించడం దుర్మార్గమని, ఈ విధానాన్ని తెదేపా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. ప్రజావ్యతిరేక పాలనకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

Leave a Reply