(అనిల్‌కుమార్)
దీనికి సమాధానంగా జయ్ అగర్వాల్ అనే భారతీయ మూలాలు కలిగిన ఒక అమెరికా పౌరుడు ఇటీవలి తన అనుభవాన్ని ఇలా చెప్పాడు.
తాను అమెరికా పౌరుడిననీ, ఫెడరల్ గవర్నమెంటు ఉద్యోగిననీ, గత పాతికేళ్లుగా భారత్ లో నివసించడం లేదనీ, భారత్ లో తాను ఓటు వెయ్యలేననీ కాబట్టి నిష్పక్షపాతంగా చెబుతున్నాననీ అన్నాడు.
తాను రెండు సంఘటనలను ఇలా చెప్పాడు.
సంఘటన -1
ఈ మధ్య ఒక రోజున వాషింగ్టన్ డీసీలో ఒక ఊబర్ ట్యాక్సీ ఎక్కాను. డ్రైవర్ ఆఫ్ఘనిస్తాన్ వాడు. మీరు భారతీయులా అన్నాడు. ఔనన్నాను. ఎవరైనా మోడీ మీద సినిమా తీస్తే బాగుంటుంది అన్నాడు. నేను షాక్ తిన్నాను. సినిమా గురించి కాదు అతనికి మోడీ తెలిసి ఉండడం గురించి.
ఎందుకలా అని అడిగాను.
దానికి అతను మోడీని మా ఆఫ్ఘనిస్థాన్ లో దేశాన్ని మార్చే ఒక మెజీషియన్ గా భావిస్తారు. మాక్కూడా అలాంటి నాయకుడు వచ్చి మా దేశాన్ని భారత్ లా మార్చాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు అన్నాడు.
సంఘటన -2
నా సహోద్యోగి ఇటియాగు అనే ఒక నైజీరియన్. ఆఫీసులో ప్రతి రోజూ ఉదయం కాఫీ టైంలో తమ నైజీరియన్ అధ్యక్షుడు బుహారీని తిట్టుకుంటూ ఉంటాడు బుహారీ తమ దేశాన్ని ముంచేశాడని. నన్ను కొంత ఆసూయగా చూస్తూ అంటాడు— అయినా మీకేంలే మీకు నరేంద్ర మోడీ లాంటి నాయకుడున్నాడు. ఇప్పుడు మీ దేశం చూడు ఎలా వెలిగి పోతోందో అని.
ఈ రెండు సంఘటనల్లోని వాళ్లు భారతీయులు కాదు. ఏ పొలిటికల్ ఎజెండా లేని వాళ్లు. తమకూ మోడీ లాంటి నాయకుడు కావాలనీ, తమ దేశం కూడా బాగు పడాలనీ కోరుకుంటున్నారు.
మోడీ పాలనలో భారత్ ప్రతిష్ట అంతర్జాతీయంగా ఎలా ఇనుమడించిందో వాళ్లు చూస్తున్నారు.
నేను అమెరికాలో ఉన్న ఈ పాతికేళ్లలో భారత్ ప్రతిష్ట ఇంతగా ఉండడం నేను చూడలేదు. మోడీని ద్వేషించే వాళ్లు ఎంత ద్వేషించినా నిజాలు మాత్రం ఒప్పుకోక తప్పదు.