Suryaa.co.in

Andhra Pradesh

రాప్తాడు పర్యటన అంతా ‘జగన్నా’టకమేనా?

– హెలికాప్టర్ కిరాయి రావడానికే.. వెళ్లడానికి కాదు
– జగన్ రోడ్ పర్యటన ముందే ఖరారు
– కానీ పోలీసుల వైఫల్యమంటూ జగన్నాటకం
– వచ్చిన వారందరికీ ఖరీదుకట్టి తీసుకువచ్చినవారేనా?
– డబ్బులిస్తూ సోషల్‌మీడియాకు దొరికిన వైసీపీ నేతలు
– జగన్ మ్యాజిక్ .. చిలిపి ఇట్టే దొరికిపోయాడు

( భూమా బాబు)

రాప్తాడు పర్యటనలో వైసీపీ షో అంతా స్క్రిప్టెడ్ అని మనం ఊహించిందే! ఇప్పుడు జగన్ గారి హెలికాప్టర్ డ్రామా లోని ‘నిజాలు’ బయటపడ్డాయి. సహజంగా కాదు, పక్కా ప్రొడక్షన్.

సీన్ బై సీన్ ఎక్స్పోజ్:

“జన సమీకరణ” హెలిప్యాడ్ వద్దకు: డబ్బులిచ్చి తరలించిన 3000 మందిని “హెలిప్యాడ్ దగ్గర ఫ్లాష్ మోబ్ చెయ్యించారు. మంచి ఏరియల్ షాట్లు తీసుకొన్నారు!”

హెలికాప్టర్ డ్రామా:

భారీ జనం నుండి భద్రత కల్పించక హెలికాఫ్టర్ దెబ్బతిన్నదంటూ కట్టుకథ అల్లారు. దాని కోసం గందరగోళం సృష్టించడంతో.. వచ్చిన వారిలో ఎవరో పైలెట్ బ్యాగ్ కొట్టేశారు.
ఫేక్ ఎగ్జిట్ ప్లాన్ : పైలెట్ చేతులెత్తేయడంతో.. రోడ్డు మార్గంలో జగన్ వెళ్లారు అని డ్రామా మొదలెట్టి స్క్రోలింగ్ వేశారు.

ఎలా దొరికిపోయారు?

అడ్డంగా ఇలా దొరికిపోయాడు మన చిలిపి గులకరాయి ఏక్టింగ్ కింగు.

1. హెలికాప్టర్ సంస్థతో కేవలం పాపిరెడ్డిపల్లి వరకే వెళ్లడానికి వన్‌వేకి అద్దెకు మాట్లాడుకొన్నారు. తిరుగు ప్రయాణం వుండదు అని ముందే వారికి సమాచారం ఇచ్చారు.

2. రోడ్డు మార్గం ద్వారా జగన్ తిరుగు ప్రయాణం అవుతారు అని ఊహించని హఠాత్తు పరిణామంలో.. ఆశ్చర్యంగా తిరుగు ప్రయాణం దార్లల్లో అక్కడక్కడా నాయకులు, కార్యకర్తలు నిలుచున్నారు. హెలికాప్టర్లో వెళ్లి హెలికాప్టర్లో తిరిగి వెళతాడు అని కార్యక్రమం వుంటే అలా దారిలో నిలుచుకోడానికి వారు తింగరోళ్లు కాదు కదా.

అది ఎలా సాధ్యం? పరామర్శ అనంతరం జగన్ తిరుగు ప్రయాణంలో రోడ్డుమార్గాన వెళ్తారని స్థానిక నేతలకు ముందే సమాచారం ఇచ్చారు.

ఫైనల్ ట్విస్ట్ : పరిటాల వారి నియోజకవర్గం అని జగన్ భయపడ్డాడు. వెళితే దారమ్మట ఎవరూ రాకపోతే అభాసుపాలు అవతాం అని సేఫ్ సైడ్ హెలికాప్టర్ మాట్లాడుకొన్నారు. తిరిగి వెళ్లేప్పుడు ఏ మీడియా పట్టించుకోదు కాబట్టి ఈ ప్లాన్ చేశారు. బయట నియోజకవర్గాల నుండి కారలల్లో 3000 మందిని హెలిపాడ్ వద్దకు తెచ్చి, ఆయనకు అక్కడ కూడా జనం బ్రహ్మరథం పడుతున్నట్లుగా కోటికి పైగా ఖర్చు పెట్టి ఫేక్ డ్రామా ఆడారు.

విషాదం : ఒక బీసీ శవం మీద, ఇంకా వారింట దినం కూడా కాక ముందే ఈ నాటకం ఆడడం.

ముగింపు : అది మనుషులు ఆలోచిస్తారు. జగన్ నాన్న డెడ్ బాడీ దగ్గర అయినా.. చంపించిన బాబాయ్ బాడీ దగ్గర అయినా శవ రాజకీయం వదిలితే కదా.. జనం శవాలను వదలడానికి.

LEAVE A RESPONSE