Suryaa.co.in

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ ను అదానీ ప్రదేశ్ చేయడమే ప్రభుత్వ లక్ష్యమా?

• ప్రజలు చెమటోడ్చి సంపాదించుకున్న దాన్ని దేశంలోనే రెండోఅతిపెద్ద ధనవంతుడైన వ్యక్తికి దోచిపెట్టడానికే ప్రభుత్వం, 10వేలమెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందంచేసుకుందా?
• 2024లో విద్యుత్ సరఫరాకు ఇప్పుడున్న అధికధరలప్రకారం ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది?
• 2024 యూనిట్ విద్యుత్ రూ.1.26పైసలకు వస్తుందని చెబుతుంటే, ఈప్రభుత్వం యూనిట్ రూ.3.50పైసలనుంచి రూ.4.50పైసలకు కొనడం అన్యాయంకాదా?
పీఏసీ ఛైర్మన్, టీడీపీ శాసనసభ్యులు ,పయ్యావుల కేశవ్ 
10వేలమెగావాట్ల సోలార్ విద్యుత్ టెండర్లు పిలిచిన ఏపీప్రభుత్వం, 9వేల మెగావాట్లను అదానీ సంస్థనుంచి దొడ్డిదారినకొనే చేస్తున్న ప్రయత్నంలోని అవకతవకలను ఎత్తిచూపితే, ప్రభుత్వం నుంచి సమా ధానంలేకపోగా, తానుప్రస్తావించిన వాటికి ఏమాత్రం సంబంధంలేని అంశాలను ప్రస్తావిస్తూ, పూర్తిగా అసలు వాస్తవాలను తప్పుదారి పట్టిం చే ప్రయత్నం పాలకులు చేస్తున్నారని, టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ స్పష్టంచేశారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే యథాతథంగా మీకోసం…!
తాను నిన్న లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరుతో ప్రకటన విడుదల చేశారు. అసలు తాను లేవనెత్తిన అంశాలేమిటో, వాస్తవాలేమిటో అసలు మంత్రి కి తెలుసునా అని ప్రశ్నిస్తున్నాను. రాష్ట్రప్రభుత్వం ముందు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి టెండర్లు పిలిచింది. అవి అదానీసంస్థకు కట్టబె ట్టబడ్డాయి. ఆ వ్యవహారంపై ఆరోపణలు వస్తే, కోర్టునుఆశ్రయిస్తే, దాన్ని కొట్టేయడంజరిగింది. మళ్లీ అదే అదానీగారు ఢిల్లీలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ఇండి యా (సెకీ) ద్వారా దాదాపు 22నెలల క్రితం ఎప్పుడో వేసిన టెండర్లో యూనిట్ రూ2.49పైసలకు ఇస్తామనగానే, దానికి ఏపీప్రభుత్వం వెంటనే ఒప్పుకుంది. సెకీ అనేది నిరంతరం టెండర్లు పిలుస్తూనే ఉంటుంది. ఎవరికి విద్యుత్ కావాలంటే, వారు వెళ్లి కొనుగోలు చేయవచ్చు. సెకీ దగ్గర ఇవాళ్టికిఇవాళ పిలిచిన టెండర్లలో దాదాపు 30, 40 టెండర్లు పరిశీలించవచ్చు. వాటిలో యూనిట్ సోలార్ విద్యుత్ రూ.1.99పైసలు, రూ.2.లు, రూ.2.01పైసలు, రూ.2.41పైసల కి వేసిన రకరకాల బిడ్లు ఉన్నాయి. రూ.1.49పైసలకు విద్యుత్ దొరు కుతుంటే, రూ.2.49పైసలకి కొనడానికి ఏపీప్రభుత్వం ఏరకంగా ముందు కెళ్లింది? ఏ విధంగా నిర్ణయం తీసుకుందని ప్రశ్నిస్తున్నాం.
ప్రభుత్వ చెబుతున్న రూ.2.49పైసలు సెకీ డిస్కవర్డ్ ప్రైస్ అని చెబుతున్నారు. డిస్కవర్డ్ ప్రైస్ అంటే టెండర్లో కోట్ చేసిన ధరేకదా? టెండర్లో కోట్ చేసింది రూ.2.93పైసలు అయితే, ప్రభుత్వానికి రూ.2.49పైసలకు ఇస్తున్నట్లు చెప్పారు. ఇదేమైనా ఆషాఢం ఆఫరా.. ఈ ప్రభుత్వాని సెకీ డిస్కౌంట్లు ఇవ్వడానికి? ప్రభుత్వం తక్కువధరకు విద్యుత్ కొంటున్నామంటూ ప్రజలచెవుల్లో పూలుపెడుతోంది. ప్రభుత్వం చెబుతున్నట్లుగా యూనిట్ విద్యుత్ ధర రూ.2.49పైసలకు కూడా రావడంలేదు. అవునో..కాదో చెప్పాలని నేను నిన్నసవాల్ చేస్తే, మంత్రిగారి ప్రకటనలో దానిపై స్పం దనలేదు. రూ.2.49పైసలపేరుతో అనేకధరల్ని దొడ్డిదారిని చేర్చారు. మొత్తంగా వచ్చే సరికి ప్రజలపై అదనపు భారం పడనుంది, యూనిట్ రూ.3.50పైసలనుంచి రూ.4.50పైసలవరకు పడుతోంది. కాదని చెప్పగ ల ధైర్యం ప్రభుత్వానికి ఉందా? దీనిపై ఎవరితోనైనా, ఎక్కడైనా సరే చర్చ కు రావడానికి తాను సిద్ధంగాఉన్నాను.
ఏపీలో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు పెట్టడంకంటే, బయటినుంచి విద్యుత్ కొనడమే చౌకని ప్రభుత్వం చాలా చిత్రంగా మాట్లాడుతోంది. నీరు పల్ల మెరుగుఅన్నారుగానీ, పవర్ పల్లమెరుగు అని ఎవరూ అనలేదు. నార్త్ నుంచి సౌత్ కు పవర్ వస్తుంది కాబట్టి, రాజస్థాన్ నుంచి కొంటున్నామం టారా? ఏమిటీ ఈ సమాధానాలు? శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో వంద ల అడుగులనుంచి విద్యుత్ పైకి రావడంలేదా? చిత్రమైన మాటలు, విచి త్ర విన్యాసాలుచేయడం మానుకోండి. రాజస్థాన్ లో ప్లాంట్ పెట్టి, అక్కడి నుంచి విద్యుత్ కొంటే చౌకఅని చెబుతారా? కేంద్రప్రభుత్వం ప్రకటించిన (ఐఎస్ టీఎస్) ఇంటర్ స్టేట్ ఛార్జీలప్రకారం రాజస్థాన్ నుంచి కొనడమే నయమంటారా? కేంద్రప్రభుత్వం ఇచ్చిన గెజిట్ లో డిసెంబర్ 22 లోపల ప్రారంభమయ్యే ప్రాజెక్టులకు మాత్రమే ఇంటర్ స్టేట్ ఛార్జీలు వర్తిస్తాయని, లేకపోతే, ఆభారాన్ని రాష్ట్రాలే భరించాలని చాలాస్పష్టంగా చెప్పారు. కానీ ఏపీ ప్రభుత్వం 2024 లో విద్యుత్ కొంటామని చెప్పింది. అప్పుడు ప్రభుత్వమే సోషలైజేషన్ పేరుతో యూనిట్ కు రూపాయి అదనంగా చెల్లించాల్సిఉంది. ఐఎస్ టీఎస్ ఛార్జీలు కావొచ్చు, సోషలైజేషన్ ఛార్జీలు కావొచ్చు, డిస్ట్రిబ్యూషన్ ఛార్జీలు కావొచ్చు… ఏవైనాసరే విద్యుత్ కొనే రాష్ట్రం, అమ్మేరాష్ట్రమే చెల్లించాలి. అప్పుడు ఏరకంగా ఈ ప్రభుత్వం రాజస్థాన్ నుంచి ఉచితంగా విద్యుత్ వస్తుందని చెబుతుంది.
ఏపీలో 6వేలమెగావాట్ల సోలార్ ఉత్పత్తిచేయడానికి, సదరు విద్యుత్ సరఫరాకు అవసరమైన లైన్లుసిద్ధంగా ఉన్నాయి. భూములు చంద్రబాబుప్రభుత్వంలోనే సేకరించారు. విద్యుత్ సేకరణ, ఉత్పత్తికి అవసరమైన లైన్ల వ్యవస్థను, గ్రీన్ కారిడార్ వ్యవస్థ మొత్తం అప్పుడే సిద్ధంచేశారు. రాష్ట్రంలోనే ఇంతవ్యవస్థ ఉన్నప్పుడు, పొరుగురాష్ట్రాల నుంచి విద్యుత్ కొనాల్సిన అవసరమేంటని ప్రశ్నిస్తున్నాం? ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం విద్యుత్ సరఫరాకు చేయాల్సింది ఏమీ లేదుకదా.
విజయవాడకు పవర్ రావాలంటే తమిళనాడుపోయి, కర్ణాటక నుంచి రావాలని కథలుచెబుతారా? మంత్రికి అసలు ఏమైనా తెలుసా?
ఐఎస్ డీఎస్ అవకాశం ఈ ప్రభుత్వానికిలేదు. ఒకవేళ ఐఎస్ డీఎస్ ఛార్జీలు చెల్లించేపనిలేకపోయినా, సోషలైజేషన్ ఛార్జీలు కచ్చితంగా ఏపీప్రభుత్వం చెల్లించాల్సిందే. ఇంతాచేసి యూనిట్ రూ.2.49పైసలకు వస్తుందా…. అంటే రాదు. కచ్చితంగా యూనిట్ రూ.3.50పైసల నుంచి రూ.4.50పైసలు పడుతుంది.
అదే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కంపెనీని ఏపీలోనే నెలకొల్పితే, అదనంగా ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండానే, సోలార్ విద్యుత్ యూనిట్ రూ.2లకి, అంతకంటే తక్కువకే వచ్చేదేమో? దానివల్ల మనరాష్ట్రంలోని యువత కు ఉద్యోగాలు వచ్చేవి. జీఎస్టీ ఆదాయంకూడా రాష్ట్రానికే వచ్చేది. ఇప్పు డు ఈ ప్రభుత్వనిర్వాకంతో ఉద్యోగాలు రాజస్థాన్ కు పోతే, జీఎస్టీ ఆదా యం గుజరాత్ కు వెళ్తోంది.
ఇక గతంలో ఈ ప్రభుత్వం బూట్ మోడల్ విధానంలో టెండర్లు పిలిచింది. బూట్ మోడల్ అంటే బిల్ట్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్ విధానం, అంటే 20 లేదా 30ఏళ్లపాటు సంస్థనునడిపి, దాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగిం చడం. ఆ విధానం ప్రకారం యూనిట్ గతంలోనే రూ.2.49పైసలకు వచ్చింది. అప్పుడే రూ.2.49పైసలకు వస్తే, ఇప్పుడు కూడా అదేధరా.. ఆ ధరేదో సెకీ ఏపీప్రభుత్వానికి బంఫర్ ఆఫర్ ఇచ్చినట్లు పాలకులు ఫీలవుతున్నారు. ఇప్పుడు ఆ విధానాన్నికాదని, లూట్ మోడల్ కు తెరతీశారు. లూట్ అంటే ప్రజలను లూఠీచేయడం. అంటే కంపెనీ ఏపీలో సంస్థ నెలకొల్పితే, దాన్ని ఎంతకాలంనడిపినా, అదిచివరకు వారిదే అవుతుంది. పెట్టుబడి పెట్టేది ఏపీప్రభుత్వమైతే,లాభపడేది పారిశ్రామిక వేత్తలు. ఇదికాకుండా అదానీసంస్థ ఎక్కడో నెలకొల్పే విద్యుత్ ప్లాంట్ 30 ఏళ్లతర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డికి ఏమైనా అప్పగిస్తారా? మాకు స్పష్టంగా అర్థమయ్యింది ఏమిటంటే, గతంలో విద్యుత్ కొనుగోళ్లకు సం బంధించి ప్రభుత్వం పిలిచింది బూట్ మోడలైతే, ఇప్పుడు లూట్ మోడ ల్ ను నమ్ముకుంది.
అధికారులు మరీ ఎందుకిలా ప్రజలనుమోసగించేలా వ్యవహరిస్తున్నారో తెలియడంలేదు.
ఇలాంటినిర్ణయాలతో భవిష్యత్ లో కోర్టులచుట్టూ తిరగ క తప్పదు. ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న విద్యుత్ కొనుగోళ్లు 2024లో చేస్తామంటోంది. ఈప్రాజెక్ట్ 2024లో మొదలుపెడితే, అప్పటికి యూనిట్ విద్యుత్ ధర ఎంతఉంటుందని ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడే యూనిట్ రూ.1.99పైసలుంటే, అప్పటికి దానిధర ఇంకాతగ్గుతుంది. ఇప్పుడు, అప్పుడు ఉండేపరిస్థితులను బట్టి వేసిన అంచనాలప్రకారం 2024 నాటికి యూనిట్ విద్యుత్ ధర రూ.1.26పైసలకే వస్తుంది. రూ.1.26పైస లకు లభించేవిద్యుత్ ని రూ.2.49పైసలు పెట్టి ఏపీప్రభుత్వం ఎందుకు కొంటోంది… దానికితోడు అదనపు ఛార్జీలు కలిపితే, యూనిట్ రూ.3.50 పైసలనుంచి రూ.4.50పైసలుపడుతోంది. అంతధర వెచ్చించి ఎవరికోసం, ఎవరిపైభారం వేయడానికి ఈ ప్రభుత్వం విద్యుత్ కొంటుంది అన్నదే తమసందేహం? దానిపై సమాధానంచెప్పకుండా ఏదేదో చెబితే ఎలా? ఇప్పటికే రాష్ట్రప్రజలపై ట్రూఅప్ ఛార్జీలపేరుతో భారం వేశారు. అప్పులతో ప్రభుత్వానికే సంబంధంలే…మనకేం లేదని ప్రజలకు అనుకో వడానికి లేదు. అంతిమంగా భారమంతా ప్రజలపైనే పడుతుందని అంద రూ గ్రహించాలి. పంజాబ్ ప్రభుత్వం సామాన్యుడికి యూనిట్ రూ.1.19పైసలకే ఇస్తోంది. ఈ ప్రభుత్వం మాత్రం ఎందుకు అదానీలు ముద్దు, టాటాలు వద్దనే పంథాతో ముందుకుపోతోంది?
సెకీ వెబ్ సైట్లో చూస్తే, ఏ ప్రభుత్వమైనా సరే యూనిట్ రూ.1.99పైసలకే కొనేలా ఆఫర్లు రెడీగా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం మాత్రం యూనిట్ రూ.2.49పైసలే ముద్దు అంటోంది. ఏ కంపెనీలు యూనిట్ రూ.1.99పై సలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయో చెప్పమంటే చెబుతాం.
కేంద్రప్రభుత్వం సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడానికి ఇచ్చిన సమయం 18 నెలలైతే, ఈ ప్రభుత్వం 2024వరకు సమయం ఎందుకు తీసుకుంది? ఈ విధంగా తప్పులమీద తప్పులుచేస్తూ, ప్రభుత్వం ఎందుకు సమర్థిం చుకుంటోంది. ఇలానే జరిగితే కోర్టులచుట్టూ తిరగకతప్పదని మరోసారి స్పష్టంచేస్తున్నాం. ఉన్న గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ నే మార్చేసిన జగన్ ప్రభుత్వం, కొత్తగా మరోకార్పొరేషన్ అంటోంది. ప్రతిపక్షానికి కూడా కాస్తో కూస్తో తెలుసని అధికారులు గుర్తిస్తే మంచిది.
ప్రభుత్వం చేసే తప్పిదాలకు పేదలు బలవుతున్నారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం పెంచినధరలు, వేసినపన్నులుకట్టలేక జనం ఛస్తున్నారు. అది చాలదన్నట్లు ఇప్పుడు మళ్లీ లూట్ మోడల్ తో వారిని మరింత లూఠీచేస్తారా? ఇప్పుడు కొనాలనుకుంటున్న విద్యుత్ 2024కి అంటు న్నారు. అప్పటికి యూనిట్ విద్యుత్ ధర రూ.1.26పైసలే ఉంటుంది. దానికోసంఇప్పుడే రూ.3.50పైసలనుంచి రూ.4.50పైసలకు కొంటారా? దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు ప్రకటించాలి, లేకపోతే తక్కువకు ఎవరు విద్యుత్ ఇస్తే వారివద్దనుంచే కొనాలని డిమాండ్ చేస్తున్నాం.
ఏపీ ఈఆర్ సీ కి తెలియకుండానే దాన్ని సంప్రదించకుండానే ప్రభుత్వం ఈ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలకు పూనుకుంది. ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో ఏపీఈఆర్ సీనిర్ణయిస్తుందని మాత్రమే చెప్పారు. పదాల మాయతో ప్రజలను మాయచేయాలని చూస్తున్నారు. అసలు ఈ కొను గోళ్లకు సంబంధించి ప్రభుత్వంనుంచి ఏపీఈఆర్ సీకి ప్రపోజలే పోలేదు.
ఏపీ ఈఆర్ సీఎట్టిపరిస్థితుల్లోనూ చీకటి ఒప్పందాలుచేసుకోదు. ఏపీ ఈ ఆర్సీ కచ్చితంగా పబ్లిక్ ‍హియరింగ్ పిలిచేతీరుతుంది. అలాంటిదేమీ ఈ వ్యవహారంలో జరగలేదు.
ఇంకో విషయమేంటంటే, ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం, రాష్ట్రంలోని రెండు విద్యుత్ సరఫరాసంస్థలు ఎలాంటి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు చేసుకోవడానికి వీల్లేదని స్పష్టంగా చెప్పారు. అందుకే ఆరెండు సంస్థలకు తెలియకుండా ప్రభుత్వం మూడోడిస్ట్రిబ్యూష న్ కంపెనీసాయంతో ఈ ఒప్పందంచేసుకుంది. పేదలకడుపుకొట్డడానికి ప్రభుత్వం ఎందుకింతలా తపిస్తోంది? పేదలు చెమటోడ్చి సంపాదించుకు న్నదాన్ని దేశంలోనే రెండో అతిపెద్ద ధనవంతుడికి దోచిపెడతారా? తప్పుల మీదతప్పులుచేస్తూ, వాటిని సమర్థించుకోవడానికి ప్రయత్నిం చకండి. ఆంధ్రప్రదేశ్ ను అదానీ ప్రదేశ్ గా మారుస్తామంటే మేము చూస్తూ ఊరుకోమనిహెచ్చరిస్తున్నాం. గతంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకే డబ్బులు చెల్లించమని కోర్టులకుచెప్పినవారు, ఇప్పుడు ఈ పదివేలమెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లకు ఎక్కడినుంచి తెచ్చి డబ్బులుకడతారు? గతంలో టీడీపీప్రభుత్వంలోజరిగిన సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను, ఈముఖ్యమంత్రే గ్రిడ్ సెక్యూరిటీ పేరు చెప్పి ఆపేశాడు.
నిన్నటివరకు ఈ ప్రభుత్వం గ్రిడ్ సెక్యూరిటీపేరుతో ఆపేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం విధించిన మస్ట్ రన్ నిబంధనతో ఈప్రభుత్వానికి మరో అవకా శం లేదు. ఇప్పడుచేసుకున్న ఒప్పందాన్ని గ్రిడ్ సేఫ్ట పేరుతో ఆపడానికి కూడా వీల్లేదు. కేంద్రం చట్టాన్ని మార్చేసరికి, ఈ ప్రభుత్వం తప్పించుకో వడానికి వీల్లేకుండా పోయింది. పాలకులనిర్ణయాలతో, జెన్ కో, ట్రాన్స్ కో ల నిర్ణయాలతో అంతిమంగా విద్యుత్ రంగమే కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. కిందిస్థాయిలో ఉన్న సిబ్బంది ఎంత ఇబ్బందిపడుతున్నా రో, ప్రజలకు సమాధానంచెప్పలేక ఎంతలా విలవిల్లాడుతున్నారో గ్రహిం చండి. ఈప్రభుత్వం చేసుకుంటున్న చీకటి ఒప్పందాలపై ఏదోఒకరోజు న్యాయస్థానాలకు సమాధానంచెప్పక తప్పదని హెచ్చరిస్తున్నాం.

LEAVE A RESPONSE